10th Class Result Date 2025: పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?

రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ఏప్రిల్ 1తో ముగిసిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాల మూల్యాంకనం కేవలం 7 రోజుల్లోనే పూర్తి చేసిన పాఠశాల విద్యాశాఖ ఫలితాల విడుదలకు చకచకా ఏర్పాట్లు చేస్తుంది. మరో మూడు రోజుల్లో ఫలితాలు విడుదల చేయనున్నట్లు విద్యాశాఖ తాజాగా ప్రకటన జారీ చేసింది..

10th Class Result Date 2025: పదో తగరతి విద్యార్ధులకు అలర్ట్.. పబ్లిక్‌ పరీక్షల ఫలితాల తేదీ వచ్చేసింది! ఎప్పుడంటే..?
10th Class Result Date 2025

Updated on: Apr 20, 2025 | 6:40 AM

అమరావతి, ఏప్రిల్ 20: రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఏప్రిల్ 1వ తేదీతో ముగిసిన సంగతి తెలిసిందే. జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ఏప్రిల్ 3 నుంచి ప్రారంభమవగా ఏప్రిల్ 9వ తేదీతో దాదాపు 26 జిల్లా కేంద్రాల్లో ముగిసింది. మార్కులను ఆన్‌లైన్‌లో ఎంటర్‌ చేసే ప్రక్రియ కూడా దాదాపు ముగింపు దశకు చేరుకుంది. ఫలితాలను ఏప్రిల్ 23న అంటే బుధవారం విడుదల చేయనుంది. ఈ మేరకు పాఠశాల విద్యా శాఖ కసరత్తు చేస్తోంది.

ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా 6,19,275 మంది రెగ్యులర్‌ విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంగ్లిష్‌ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది పరీక్షలు రాశారు. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తోపాటు టీవీ9 తెలుగు వెబ్‌సైట్‌లోనూ నేరుగా చెక్‌ చేసుకోవచ్చు. అలాగే మనమిత్ర వాట్సప్‌ నంబర్‌లోనూ విద్యార్థులు చెక్‌ చేసుకోవచ్చు.

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 17 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు నిర్వహించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు ఫీజుకట్టగా.. వీరిలో 6,19,275 మంది పరీక్షలు రాశారు. అలాగే ఏప్రిల్‌ 3 నుంచి 7 వరకు సార్వత్రిక విద్యాపీఠం పది, ఇంటర్మీడియట్‌ పరీక్షలు కూడా మార్చి 17 నుంచి మార్చి 28 వరకు జరిగాయి. ఈ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనం కూడా ముగిసింది. ఈ పరీక్షల ఫలితాలు కూడా త్వరలోనే వెల్లడించే అవకాశం ఉంది. ఇప్పటికే ఇంటర్మీడియట్‌ పబ్లిక్‌ పరీక్షల ఫలితాలు వెల్లడించిన సర్కార్‌ ఈ మేరకు పదో తరగతి పరీక్షల ఫలితాల వెల్లడికి ఏర్పాట్లు చేస్తుంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.