AIIMS AP Recruitment: ఆంధ్రప్రదేశ్‌లోని మంగళగిరిలో ఉన్న ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. భారత ప్రభుత్వ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖకు చెందిన ఈ సంస్థలో సీనియర్ రెసిడెంట్లు/ సీనియర్ డెమాన్‌స్ట్రేటర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 11 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో సీనియర్ రెసిడెంట్లు/ సీనియర్ డెమాన్‌స్ట్రేటర్ ఖాళీలు ఉన్నాయి.
* అనెస్తీషియాలజీ, బయోకెమిస్ట్రీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, న్యూరాలజీ, అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ, పీడియాట్రిక్స్, ఫార్మకాలజీ, రేడియో డయాగ్నసిస్ వంటి విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.
* పైన తెలిపిన పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్లలో పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ డిగ్రీ (ఎంఎస్/ డీఎన్‌బీ)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
* అభ్యర్థుల వయసు 45 ఏళ్లు మించకూడదు.
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను ఇంటర్వ్యూలో చూపిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేస్తారు.
* మెడికల్ అభ్యర్థులకు నెలకు రూ. 67,700, నాన్ మెడికల్ అభ్యర్థులకు నెలకు రూ. 56,100 జీతంగా చెల్లిస్తారు.
* వాక్‌ఇన్ ఇంటర్వ్యూలను ఎయిమ్స్ మంగళగిరి, అడ్మిన్ అండ్ లైబ్రరీ బిల్డింగ్, గ్రౌండ్ ఫ్లోర్, గుంటూరులో నిర్వహిస్తారు.
* ఇంటర్వ్యూను 26-05-2022న నిర్వహిస్తారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..