Wipro Spices: మరో రంగంలోకి అడుగు పెట్టిన విప్రో.. ఈసారి వంటింటిని టార్గెట్‌ చేసిన దిగ్గజ సంస్థ.

|

Dec 20, 2022 | 2:33 PM

విప్రో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఐటీ మొదలు గృహోపకరణాల వరకు, హెల్త్‌ కేర్‌ నుంచి మిషనరీ వరకు ఎన్నో రకాల వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన విప్రో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరును గడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విప్రో తాజాగా..

Wipro Spices: మరో రంగంలోకి అడుగు పెట్టిన విప్రో.. ఈసారి వంటింటిని టార్గెట్‌ చేసిన దిగ్గజ సంస్థ.
Wipro Acquires Nirapara
Follow us on

విప్రో గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పనిలేదు. ఐటీ మొదలు గృహోపకరణాల వరకు, హెల్త్‌ కేర్‌ నుంచి మిషనరీ వరకు ఎన్నో రకాల వ్యాపారాల్లోకి అడుగుపెట్టిన విప్రో ప్రపంచవ్యాప్తంగా ఎంతో పేరును గడించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విప్రో తాజాగా మరో రంగంలోకి అడుగు పెట్టింది. ఈసారి ఈ దిగ్గజ సంస్థ వంటింటిని టార్గెట్ చేసింది. దేశంలో అత్యధికంగా స్కోప్‌ ఉన్న మసాలాలు, ప్యాక్‌ చేసిన ఆహార పదార్థాల రంగంలోకి దిగింది. కేరళకు చెందిన సంప్రదాయ ఆహార బ్రాండ్లకు పెట్టింది పేరైన ‘నిరపరా’ను విప్రో కొనుగోలు చేస్తోంది.

ఈ విషయాన్ని విప్రో కన్జ్యూమర్‌ కేర్‌ సోమవారం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు విప్రో, నిరపరాల మధ్య ఒప్పందం కుదిరింది. అయితే ఈ డీల్‌ విలువ ఎంత అనే విషయాన్ని మాత్రం ఇరు కంపెనీలు ఇప్పటి వరకు వెల్లడించలేదు. ఇదిలా ఉంటే మసాలాల రంగంలోకి ఇప్పటికే పలు ప్రముఖ కంపెనీలు ఎంట్రీ ఇచ్చాయి. డాబర్‌, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్‌, ఐటీసీ వంటి కంపెనీల సరసన విప్రో కూడా వచ్చి చేరింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నిరపరా కంపెనీ వ్యాపారం 63 శాతం కేరళలోనే జరుగుతోంది. మరి విప్రో కొనుగోలు తర్వాత అమ్మకాల జోరు దేశమంతా విస్తరిస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే నిరపరా కంపెనీని 1976లో ప్రారంభించారు. ఈ బ్రాండు పలు రకాల మసలాలు, అప్పాడాల తయారీలో ఉపయోగించే బియ్యపు పిండినీ తయారు చేస్తుంది. విప్రోకు ఇది 13వ కొనుగోలు. ఈ ఒప్పందంతో మసాలాలు, రెడ్‌ టు కుక్‌ విభాగంలోకి ప్రవేశించడానికి మార్గం సుగమమైందని విప్రో కన్జ్యూమర్ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ అనిల్‌ ఛుగ్ తెలిపారు. ఈ కొనుగోలు ఒప్పందం వార్తలతో విప్రో షేరు రూ. 390 వద్ద ముగిసింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని బిజినస్ వార్తల కోసం క్లిక్ చేయండి..