Gold Rates: దీపావళి నాటికి బంగారం ధరలు మరింత పెరగనున్నాయా.? మార్కెట్‌ నిపుణులు ఏం చెబుతున్నారంటే..

|

Aug 16, 2021 | 6:18 PM

Gold Rates: మీరు బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.? అయితే ఇదే సరైన సమయం. ఎందుకంటే రానున్న రోజుల్లో బంగారం ధరలు పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు. దీనికి కారణంగా వారు ఏం చెబుతున్నారంటే..

1 / 6
భారతీయులను, బంగారాన్ని విడదీసి చూడలేము. ఇంట్లో ఏ చిన్న శుభకార్యం జరిగినా కొంత బంగారాన్ని కొనుగోలు చేయాలని భావిస్తుంటారు. కేవలం ఆభరణాలకే పరిమితం కాకుండా బంగారాన్ని పెట్టుబడిగా కూడా భావించేవారు చాలా మంది ఉన్నారు.

2 / 6
 ఇక గత కొన్ని రోజులుగా ఆషాడమాసం కారణంగా తగ్గిన బంగారం ధరలు తాజాగా శ్రావణ మాసంలో మళ్లీ పెరుగుతున్నాయి. వరుసగా మూడవ రోజు కూడా బంగారం ధరలు పెరిగాయి. ఇక గత నెలతో పోల్చితే బంగారం అమ్మకాలు పది శాతం పెరిగాయి.

3 / 6
 బంగారం ఇలా పెరగడానికి డాలర్‌ విలువ తగ్గడమే కారణమని నిపుణులు చెబుతున్నారు. డాలర్‌ విలువ పడిపోవడంతో ఎక్కువ మంది బంగారంపై పెట్టుబడులు పెడుతున్నారు. కాబట్టే బంగారం ధర ఇలా పెరుగుతోందని నిపుణులు చెబుతున్నారు.

4 / 6
 ప్రస్తుతం హైదరాబాద్‌లో 10 గ్రాముల బంగారం ధర రూ. 48,090కి చేరింది. రానున్న రోజుల్లో వివాహాది కార్యక్రమాలతో పాటు దీపావళి ఉండడంతో బంగారం ధర మరింత పెరిగే అవకాశాలున్నాయని మార్కెట్‌ నిపుణులు చెబుతున్నారు.

5 / 6
డాలర్‌ విలువ తగ్గడంతో చాలా మంది పెట్టుబడికి తర్వాతి ఆప్షన్‌గా బంగారాన్నే ఎంచుకుంటారని కాబట్టి బంగారం ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయని అంటున్నారు.

6 / 6
బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకున్నా, భవిష్యత్తు అవసరాల కోసం కొనుగోలు చేయాలనుకున్నా ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. దీపావళి నాటికి తులం బంగారం రూ. 50 వేలకు చేరుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.