School Bags: ఈ స్కూల్‌ బ్యాగు ఖరీదు అక్షరాల రూ.60 వేలు.. ఇంత ధర ఎందుకో తెలిస్తే షాకవుతారు!

School Bags: సాధారణంగా స్కూల్‌ బ్యాగులు రూ.500 నుంచి వెయ్యి లేదా రెండు వేల రూపాయల వరకు ఉంటుంది. లేదామూడు వేలు ఉంటుంది. ఇక్కడ మాత్రం ధర వింటే షాకవుతారు. ఇక్కడ పిల్లలకు స్కూల్‌ బ్యాగు కొనాలంటే ఏకంగా రూ.60 వేలు చెల్లించాల్సి..

School Bags: ఈ స్కూల్‌ బ్యాగు ఖరీదు అక్షరాల రూ.60 వేలు.. ఇంత ధర ఎందుకో తెలిస్తే షాకవుతారు!

Updated on: Nov 04, 2025 | 3:45 PM

School Bags: సాధారణంగా స్కూల్‌ బ్యాగులు రూ.500 నుంచి వెయ్యి లేదా రెండు వేల రూపాయల వరకు ఉంటుంది. లేదామూడు వేలు ఉంటుంది. ఇక్కడ మాత్రం ధర వింటే షాకవుతారు. ఇక్కడ పిల్లలకు స్కూల్‌ బ్యాగు కొనాలంటే ఏకంగా రూ.60 వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఈ ధర ఎక్కడో తెలుసా? జపాన్‌లో. ఇక్కడ స్కూల్ బ్యాగుల (ప్రత్యేకంగా రాండోసేలు అనే బ్యాగులు) ధరలు ఎక్కువగా ఉండటానికి కొన్ని కారణాలు ఉన్నాయంటున్నారు అక్కడ వ్యాపారులు. ఇందులో ప్రధానమైన కారణాలు ఇవే.

ఇది కూడా చదవండి: PM Kisan: పీఎం కిసాన్‌ 21వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయో తెలుసా?

నాణ్యత (High Quality Materials): రాండోసేలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వాటిలో Genuine leather లేదా పటిష్టమైన సింథటిక్ లెదర్ వాడతారు. వాటిని పిల్లలు 6 ఏళ్ల వయసులో కొనుగోలు చేసి 6 సంవత్సరాల పాటు ఉపయోగించగలిగేలా తయారు చేస్తారు. వాటి నిర్మాణం వెన్నెముకకు మద్దతివ్వడానికీ, బ్యాలెన్స్‌ మెరుగుగా ఉండడానికీ రూపొందించి తయారు చేస్తారు. పెద్ద మొత్తంలో ఈ బ్యాగులు చేతితోనే తయారు చేస్తారు. ధర పెరగడానికి ముఖ్యమైన కారణం.. వాటిలో వివరణాత్మక స్టిచింగ్, శ్రమతో చేసిన డిజైన్ ఉంటాయి.

ఇవి కూడా చదవండి

6 సంవత్సరాల పాటు సర్వీసు:

బ్యాగ్ ఒకసారి కొనుగోలు చేస్తే 6 సంవత్సరాలపాటు మళ్లీ కొనాల్సిన అవసరం ఉండదు. దీర్ఘకాలిక పెట్టుబడి అనే భావనతో తల్లిదండ్రులు ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉంటారు. రాండోసేరు అని పిలువబడే జపనీస్ స్కూల్ బ్యాగులు ఖరీదైనవి. వాటి అధిక నాణ్యత, మన్నిక, నైపుణ్యం కారణంగా ధరలు ఎక్కువగానే ఉంటాయి. అవి ప్రీమియం పదార్థాలతో తరచుగా తోలుతో తయారు చేస్తారు. ప్రాథమిక పాఠశాల మొత్తం, సాధారణంగా ఆరు సంవత్సరాలు ఉండేలా రూపొందిస్తారు. అలాగే వాటిని తరచుగా నైపుణ్యం కలిగిన చేతివృత్తులవారు చేతితో తయారు చేస్తారు.

ఈ బ్యాగు జాకెట్‌ ఫ్రూప్‌లా పని చేస్తాయి:

ఒక వేళ పిల్లలు నీటిలో మునిగినా అవి పిల్లలు మునిగిపోకుండా కాపాడుతాయి. నీటిలో జాకెట్‌ ఫ్రూప్‌లా పని చేస్తాయి. బ్యాంకులు నీటిలో పడిపోయినా అవి మునిగిపోకుండా పైకి తేలుతాయి. అంతేకాదు ఆ బ్యాంకులు తడిసిపోకుండా ఉంటాయి. అంతేకాదు.. ఆ బ్యాంకుకు కింది భాగంలో ప్రత్యేకంగా లాకింగ్‌ సిస్టమ్‌ ఉంటుంది.

ఇది కూడా చదవండి: LPG Subsidy: గ్యాస్ వినియోగదారులకు అలర్ట్.. ఈ పని చేయకుంటే సిలిండర్‌పై సబ్సిడీ నిలిచిపోతుంది?

Maruti Cars: రూ.10 లక్షల లోపు 5 బెస్ట్‌ మారుతి కార్లు.. అద్భుతమైన మైలేజీ, ఫీచర్స్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us