Home Loan: గృహ రుణంపై వడ్డీ ఆదా చేసే టిప్స్‌ ఇవి.. జస్ట్‌ ఫాలో అయిపోండి చాలు..

|

Jul 15, 2024 | 5:17 PM

తక్కువ వడ్డీతో, ఎక్కువ కాల వ్యవధితో అనువైన ఈఎంఐతో ఈ లోన్లు మంజూరవుతుండటంతో అందరూ వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ లోన్‌ తీసుకునే ముందు కొన్ని ప్రాథమిక అంశాలపై కనీస అవగాహన అవసరం. వాటిల్లో ప్రధానమైనది టెన్యూర్‌. అంటే లోన్‌ కాలవ్యవధి. దీనిలో కనీస కాల వ్యవధి, గరిష్ట కాల వ్యవధులు ఉంటాయి. వీటిల్లో మీరు ఎంచుకునే ఆప్షన్‌ బట్టి మీకు చెల్లించే వడ్డీ తగ్గడమా? పెరగడమా? అనేది ఆధారపడి ఉంటుంది.

Home Loan: గృహ రుణంపై వడ్డీ ఆదా చేసే టిప్స్‌ ఇవి.. జస్ట్‌ ఫాలో అయిపోండి చాలు..
Home Loan
Follow us on

ఇటీవల కాలంలో ఎవరూ ఇల్లు కొనాలన్నా.. లేదా నిర్మించుకోవాలన్నా.. లేదా రెనోవేట్‌ చేసుకోవాలన్నా అందరూ గృహరుణాలను ఆశ్రయిస్తున్నారు. తక్కువ వడ్డీతో, ఎక్కువ కాల వ్యవధితో అనువైన ఈఎంఐతో ఈ లోన్లు మంజూరవుతుండటంతో అందరూ వీటి వైపు మొగ్గుచూపుతున్నారు. అయితే ఈ లోన్‌ తీసుకునే ముందు కొన్ని ప్రాథమిక అంశాలపై కనీస అవగాహన అవసరం. వాటిల్లో ప్రధానమైనది టెన్యూర్‌. అంటే లోన్‌ కాలవ్యవధి. దీనిలో కనీస కాల వ్యవధి, గరిష్ట కాల వ్యవధులు ఉంటాయి. వీటిల్లో మీరు ఎంచుకునే ఆప్షన్‌ బట్టి మీకు చెల్లించే వడ్డీ తగ్గడమా? పెరగడమా? అనేది ఆధారపడి ఉంటుంది.

ఇది చూడండి..

ఉదాహరణకు మీరు ఇల్లు కొనడానికి రూ. 25లక్షల లోన్‌ అవసరం అనుకుందాం.. మీరు 8శాతం వడ్డీతో ఐదేళ్లలో రుణాలన్ని తిరిగి చెల్లించాలని ఎంచుకుంటే.. ఈఎంఐ దాదాపు రూ.50,000 అవుతుంది. అదే వ్యవధిని 15 సంవత్సరాలకు పొడిగిస్తే? మీరు ఈఎంఐ సుమారు 24,000అవుతుంది. అంటే దాదాపు సగం కన్నా తక్కువకే వస్తుంది. అయితే ఇలా అధిక టెన్యూర్‌ పెట్టుకోవడం వల్ల ఆర్థిక వెసులుబాటు కలగడంతో పాటు కొన్ని నష్టాలు కూడా ఉంటాయి. వీటికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం..

హెూమ్ లోన్ కాలపరిమితి అంటే..

హెూమ్ లోన్ కాల వ్యవధి అంటే మొత్తం లోన్ తిరిగి చెల్లించే వ్యవధి. ఈ కాల వ్యవధిలో మీ మొత్తం లోన్ అసలు, వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. సాధారణంగా, కనిష్ట గృహ రుణ కాల వ్యవధి 2 సంవత్సరాలు, గరిష్ట కాలవ్యవధి 30 సంవత్సరాల వరకు ఉంటుంది. ఉదాహరణకు, యాక్సిస్ హోమ్ లోన్ ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో గరిష్టంగా 30 సంవత్సరాల కాలవ్యవధితో రూ. 75 కోట్ల వరకు అందిస్తుంది. మీరు ప్రాధాన్యత ప్రకారం ఫిక్స్‌డ్‌ లేదా ఫ్లోటింగ్‌ ఇంటెరెస్ట్‌ను ఎంచుకోవచ్చు. మీ ఈఎంఐ, వడ్డీ రేట్లు రెండూ లోన్ కాల వ్యవధిని బట్టి మారుతాయి. లోన్ కాలపరిమితి.. మీ అవసరాలు అలాగే మీ పదవీ విరమణ వయస్సు, ఆదాయం వంటి ఇతర అంశాలపై కూడా ఆధారపడి ఉంటుంది.

గరిష్ట హోమ్ లోన్ కాలపరిమితి..

మీ హోమ్ లోన్ పై సుదీర్ఘ రీపేమెంట్ వ్యవధి 30 సంవత్సరాల వరకు పొడిగించవచ్చు. సుదీర్ఘ కాల పరిమితి అంటే మీరు తక్కువ మొత్తంలో ఈఎంఐలను చెల్లిస్తారు. గరిష్ట లోన్ వ్యవధిని ఎంచుకోవడం వల్ల కలిగే ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, మీ నెలవారీ బడ్జెట్ పై తక్కువ ఒత్తిడి ఉంటుంది. ఇది మీకు ఆర్థిక స్వేచ్ఛను అందిస్తుంది. గరిష్ట రుణ టర్మ్ మీకు పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తుంది. అయితే ఎక్కువ కాలం చెల్లిస్తూ ఉండటం వల్ల వడ్డీలు ఎక్కువగా చెల్లించినట్లు అవుతుంది.

కనీస హోమ్ లోన్ కాలపరిమితి..

కనీస గృహ రుణ కాల వ్యవధి సాధారణంగా 2 సంవత్సరాలు. మీ హోమ్ లోన్ పై తక్కువ కాల పరిమితిని ఎంచుకోవడం వల్ల ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, మీరు త్వరగా రుణ విముక్తి పొందవచ్చు. లోన్ తక్కువ వ్యవధిలో పూర్తవుతుంది. అదే సమయంలో చెల్లించే ఈఎంఐల మొత్తం ఎక్కువగా ఉంటుంది. అలాగే, బ్యాంకులు స్వల్పకాలిక గృహరుణాలపై అధిక వడ్డీ రేటును వసూలు చేస్తాయి. కనీస రుణ కాలపరిమితిని ఉంచుతాయి. అయితే మీరు చెల్లించే మొత్తం వడ్డీ తగ్గుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..