Gold Trading: దీనిలో ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి ‘బంగారమే’.. నష్టం అనేది ఉండదు.. స్థిరమైన ఆదాయం పక్కా..

ప్రపంచంలో జరిగే అనేక భౌగోళిక, రాజకీయ సంఘటనలు కూడా బంగారం కొనుగోళ్లు పెరగడానికి దోహదపడతాయి. మిగిలిన వాటితో పోల్చితే సుస్థిరమైన, సురక్షితమైన ఆస్తిగా దీనిని భావిస్తారు. ఆ అంచనాల కారణంగా తరచూ బంగారం ధరలు పెరుగుతాయి. ఆరు నెలలుగా జరుగుతున్న ఇజ్రాయేల్ - హమాస్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో అస్థిరత పెరిగింది. చాలా మంది పెట్టుబడిదారులను బంగారంలో పెట్టుబడులు పెట్టడాన్ని ప్రోత్సహించింది.

Gold Trading: దీనిలో ఇన్వెస్ట్ చేస్తే మీ పెట్టుబడి ‘బంగారమే’.. నష్టం అనేది ఉండదు.. స్థిరమైన ఆదాయం పక్కా..
Invest In Gold

Updated on: Apr 30, 2024 | 6:57 AM

మన దేశంలో బంగారానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. తరతరాలుగా ఇది మన హోదాగా చిరునామాగా నిలుస్తోంది. బంగారం కొనడం , దానిని దాచుకోవడాన్ని ప్రజలు గొప్పగా భావిస్తారు. ఎప్పటి నుంచో తన విలువను కాపాడుకుంటూ వస్తుంది. ఇటీవల ఈక్విటీలు ప్రముఖ పెట్టుబడి మార్గాలుగా మారినప్పటికీ, వాటి వెనుకే బంగారం లో పెట్టుబడులు పరుగెడుతున్నాయి. ఈ నేపథ్యంలో బంగారంలో పెట్టుబడులు, గోల్డ్ ఫ్యూచర్ ట్రేడింగ్ వంటి వాటి వివరాలను తెలుసుకుందాం.

పెరిగిన పెట్టుబడులు..

మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్‌ ఫోలియో మేనేజ్‌మెంట్ స్కీమ్‌లు, బహుళ కంపెనీలలో ప్రత్యక్ష పెట్టుబడి తదితర మార్గాలలో పెట్టుబడులు విపరీతంగా పెరిగాయి. అయినప్పటికీ ఈక్విటీ రాబడికి బంగారం పోటీదారుగా నిలిచింది. 2020లో ఈక్విటీ మార్కెట్‌లో గందరగోళం ఉన్నా, బంగారం సానుకూల రాబడిని అందించింది, సురక్షితమైన ఆస్తిగా మారి ప్రయోజనం కల్పించింది.. అయితే ఈక్విటీ మార్కెట్ జోరుగా సాగిన సమయంలో బంగారం నుండి ఈక్విటీలకు నిధులు మళ్లించారు.

రాబడి ఇలా..

దాదాపు 20 సంవత్సరాలుగా ఈక్విటీ, బంగారం నుంచి వచ్చిన రాబడిని పరిశీలిస్తే క్రింది విధంగా ఉన్నాయి. బంగారం 11.96 శాతం రాబడిని ఇస్తే, నిఫ్టీ 12.72 శాతం కంటే కొంచెం తక్కువగా వచ్చిందని వెల్లడైంది. అయితే నిఫ్టీ 12.78 శాతంతో పోలిస్తే గత దశాబ్దంలో బంగారం 8.88 శాతం తిరిగి వచ్చింది. ఐదేళ్ల వ్యవధిలో బంగారం 16.21 శాతం, నిఫ్టీ రాబడులు 13.95 శాతంగా ఉన్నాయి.

ఆర్థిక వనరుల మధ్య వ్యత్సాసం..

ఈ రెండు ప్రధాన ఆర్థిక వనరుల మధ్య వ్యత్సాసం వాటి స్థిరమైన సానుకూల ఆదాయంలో ఉంది. రెండూ ఒకేసారి ప్రతికూల రాబడిని అప్పుడప్పుడూ ఇస్తాయి. ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉన్నప్పుడు ఈక్విటీల నుంచి రాబడి చాలా బాగుంటుంది. అయితే అనిశ్చితి సమయంలో బంగారం మంచి పెట్టుబడి మార్గంగా మారుతుంది. ఒక పెట్టుబడిదారుడు తప్పనిసరిగా రెండింటిని ఎంచుకోవాల్సి వస్తే, సాంకేతిక విశ్లేషణ సమాచారాన్ని పరిశీలించి నిర్ణయం తీసుకోవాలి.

పెరుగుతున్న బంగారం నిల్వలు..

టర్కీ, చైనా, భారతదేశంతో పాటు ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు తమ బంగారు నిల్వలను పెంచుకుంటున్నాయి. పీపుల్స్ బ్యాంక్ ఆఫ్ చైనా 17 నెలల వరుస కొనుగోళ్లలో రికార్డు సాధించింది. సెంట్రల్ బ్యాంకులలో అతిపెద్ద కొనుగోలుదారుగా స్థిరపడింది. ఈ ధోరణి కరెన్సీ తరుగుదలకు వ్యతిరేకంగా, రక్షణగా పనిచేస్తుంది.

చైనాలో తారస్థాయికి..

బంగారాన్ని ఎక్కువగా కొనుగోలు చేసే దేశాల్లో చైనా, భారత దేశం చాలా ముఖ్యమైనవి. అయితే చైనాలో బంగారం వినియోగం తారస్థాయికి చేరుకుంది. చైనాలో జరిగే లూనార్ న్యూ ఇయర్ దీనికి కారణం. ఇది బంగారం డిమాండ్‌ను గణనీయంగా పెంచింది. నివేదికల ప్రకారం చైనా బంగారు ఆభరణాలకు డిమాండ్ దాదాపు పదిశాతం పెరిగింది. బంగారు కడ్డీలు, నాణేలపై పెట్టుబడులు గత ఏడాది కంటే 28 శాతం పెరిగాయి. ఇటీవల డాలర్‌ బలపడినప్పటికీ సెంట్రల్‌ బ్యాంకులు బంగారం కొనుగోళ్లను పెంచడంతో బంగారం ధరలు గణనీయంగా పెరిగాయి.

ప్రపంచంలో అనిశ్చితి..

ప్రపంచంలో జరిగే అనేక భౌగోళిక, రాజకీయ సంఘటనలు కూడా బంగారం కొనుగోళ్లు పెరగడానికి దోహదపడతాయి. మిగిలిన వాటితో పోల్చితే సుస్థిరమైన, సురక్షితమైన ఆస్తిగా దీనిని భావిస్తారు. ఆ అంచనాల కారణంగా తరచూ బంగారం ధరలు పెరుగుతాయి. ఆరు నెలలుగా జరుగుతున్న ఇజ్రాయేల్ – హమాస్ యుద్ధం కారణంగా మధ్యప్రాచ్యంలో అస్థిరత పెరిగింది. చాలా మంది పెట్టుబడిదారులను బంగారంలో పెట్టుబడులు పెట్టడాన్ని ప్రోత్సహించింది.

వ్యాపారం చేసే విధానం..

బంగారాన్ని ప్రపంచ వ్యాప్తంగా అనేక మంది ఇష్టపడతారు. తమ భవిష్యత్తుకు ఉపయోగపడేలా దీనిని కొనుగోలు చేస్తారు. అంటే భౌతికంగా దీనిని కొనుగోలు చేయాల్సిన అవసరం లేదు. వివిధ మార్గాల ద్వారా కొనుగోలు చేయవచ్చు, వాటితో వ్యాపారం చేసుకోవచ్చు. గోల్డ్ ఫ్యూచర్స్ అనేది గోల్డ్ ను ట్రేడ్ చేసే ఒక మార్గం. ఇది దేశంలో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది. ఉదాహరణకు మనకు బంగారం కొనుగోలు చేయాలనే ఆసక్తి ఉంది. మన పొదుపులో కొంత భాగాన్ని పెట్టుబడి పెట్టాలను కున్నాం. ఫ్యూచర్ మార్కెట్ నుంచి పది గ్రాముల బంగారాన్ని అప్పటి రేటు ప్రకారం రూ.5600కు కొనుగోలు చేశాం. నాలుగు నెలల తర్వాత అనంతరం బంగారాన్ని డెలివరీ చేసినప్పుడు దాని ధర రూ.5675 గా ఉంది. అప్పుడు మీకు లాభం వస్తుంది. మీరు బంగారం ధరలలో పెరుగుదలను ఊహినట్లయితే, మీరు బంగారు ఫ్యూచర్లను విక్రయించవచ్చు, ఒకవేళ క్షీణతను అంచనా వేసినా అదే చేయవచ్చు.

రక్షణ మార్గం

గోల్డ్ ఫ్యూచర్ అంటే వ్యక్తులు లేదా వ్యాపారులు భవిష్యత్తులో తేదీకి అంగీకరించిన ధరకు నిర్ధిష్ట మొత్తంలో బంగారాన్ని కొనుగోలు చేయడానికి, విక్రయించడానికి అనుమతించే ఆర్థిక ఒప్పందం. ఇవి బంగారం అస్థిరతకు వ్యతిరేకంగా రక్షణ కల్పించడానికి వీలు కల్పిస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..