సాధారణంగా చాలా మందికి డబ్బు అవసరం ఉంటుంది. ఇంటి కొనుగోలు, ఇంటి నిర్మాణం కోసం బ్యాంకు నుంచి రుణం కోసం దరఖాస్తు చేసుకుంటాము. అయితే రుణం రావాలంటే కొన్నిఅర్హతలు తప్పనిసరి. అందుకు సిబిల్ స్కోర్ ఉండాల్సిందే. సిబిల్ లేకుంటే లోన్ రావడం కష్టం. అయితే కొన్ని సందర్భాలలో సిబిల్ లేకున్నా రుణాలు అందుతాయి. ఏదైనా రుణం పొందాలంటే బ్యాంకుల చుట్టూ తిరగాల్సి ఉండేది. ఇప్పుడు కాలం మారిపోయింది. రుణాలు పొందాలంటే సులభతరంగా పొందే సదుపాయాలు వచ్చేశాయి. ఒకప్పుడు రుణం కోసం బ్యాంకుకు వెళ్లి మేనేజర్‌ను సంప్రదించి తర్వాత బ్యాంకుల చుట్టు తిరగాల్సిన పరిస్థితి ఉండేది. ఇప్పుడు ఆన్లైన్లో కూడా రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చే. అయితే కొన్ని రుణాలు మరి సులభంగా వచ్చే అవకాశాలున్నాయి.
బ్యాంకు వెళ్లాల్సిన పని లేకుండా ఎక్కువ డాక్యుమెంటేషన్ లేకుండా కొంత మందికి బ్యాంకులు వ్యక్తిగత రుణాలను ఇస్తుంటాయి. వాటిని ప్రీ అఫ్రూవ్డ్ లోన్స్ అంటారు. అంటే ముందుగా ఆమోదించిన వ్యక్తిగత రుణం అని అర్థం. ఇలాంటి లోన్ మీకూ మంజూరు అయ్యిందంటూ… బ్యాంక్ ఎగ్జిక్యూటివ్‌ల నుంచి మెసేజ్‌లు, కాల్స్ వస్తుంటాయి. మీకూ ఇలాంటి లోన్లకు సంబంధించిన కాల్స్, మెసేజ్‌లు గతంలో వచ్చే ఉంటాయి. అసలేంటీ ప్రీ అప్రూవ్డ్ లోన్స్, వాటిని తీసుకోవడం మంచిదేలా..? ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుసుకుందాం.
రుణదాత మీకు కాల్ చేసి, ముందుగా ఆమోదించిన రుణం లేదా తక్షణ ఆమోదం పొందిన రుణానికి మీరు అర్హులని చెప్పారంటే, దాని అర్ధం వారు మీ ప్రొఫైల్ సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని మీకు రుణం ఇవ్వడానికి ముందుకొచ్చారని అర్థం. అంటే మీ ఆదాయం, చెల్లింపుల చరిత్ర, బ్యాంకు ఖాతాకు సంబంధించిన డెబిట్ / క్రెడిట్లు, సిబిల్ స్కోర్ తదితర విషయాలను పరిగణలోకి తీసుకొని మీకు రుణం ఇవ్వాలని అనుకుంటే లోన్ ఆఫర్ చేస్తారు. ఇలా ముందుగా ఆమోదించిన రుణాలకు చాలావరకు సెక్యూరిటీ ఉండదు. మంచి క్రెడిట్ స్కోరు ఉన్న వారికి.. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీ లేదా ఫిన్‌టెక్ లెండర్లు రుణాలను మంజూరు చేస్తారు.
ఒకవేళ మీకు ఇలాంటి ఫోన్‌కాల్స్ వచ్చినట్లయితే మీ అవసరాన్ని బట్టి రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. మీకు ఫోన్ కాల్ వచ్చినంత మాత్రాన ఖచ్చితంగా రుణం పొందుతారని అనుకోవద్దు. అప్పు తీసుకోవడంలో కేవలం మొదటి స్టెప్ మాత్రమే పూర్తి చేసినట్లు అని గుర్తించాలి. ఇంకో విషయం గమనించాల్సింది ఏమింటంటే.. ముందుగా ఆమోదించిన రుణానికి సమయ పరిమితి ఉంటుంది. ఒకవేళ ఇలా మీరు రుణం తీసుకున్నట్లయితే దానిని కేవలం కొన్ని నెలల్లోగా చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఎక్కువగా ఆరు నెలలుగా ఉంటుంది. అలాగే ముందుగానే ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.
ఆన్‌లైన్‌లోనూ దరఖాస్తు చేస్తుకోవచ్చు
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి