AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Driving Tips: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ యాప్‌ను ఆన్‌లో ఉంచండి.. మీకు ఎటువంటి చలాన్‌ పడదు!

Driving Tips: రాడార్‌బాట్ అనేది iOS వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఒక ప్రసిద్ధ యాప్. ఈ యాప్ GPS ద్వారా పనిచేస్తుంది. అలాగే రోడ్డుపై స్పీడ్ కెమెరా కనిపించే ముందు హెచ్చరికను పంపుతుంది. ఇది రెడ్ లైట్ కెమెరాలు, సగటు వేగం గురించి సమాచారాన్ని కూడా అందిస్తుంది..

Driving Tips: డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఈ యాప్‌ను ఆన్‌లో ఉంచండి.. మీకు ఎటువంటి చలాన్‌ పడదు!
Subhash Goud
|

Updated on: May 28, 2025 | 8:49 PM

Share

నేటి వేగవంతమైన జీవితంలో చాలా మంది డ్రైవింగ్ చేసేటప్పుడు వేగ పరిమితిని పట్టించుకోరు. అటువంటప్పుడు అతివేగం చలాన్‌కు దారితీయడమే కాకుండా రోడ్డు ప్రమాదాలకు కూడా కారణం అవుతుంది. దేశంలోని చాలా పెద్ద నగరాల్లో, ట్రాఫిక్ పోలీసులు రోడ్లపై స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఇవి నిర్దేశించిన వేగ పరిమితికి మించి ప్రయాణించే వాహనాల ఫోటోలను తీసి వెంటనే చలాన్లు జారీ చేస్తాయి. ఇప్పుడు అలాంటి పరిస్థితిలో మీరు అతివేగం కారణంగా మీ చలాన్ కట్‌ కాకూడదనుకుంటే కొన్ని మొబైల్ యాప్‌లు మీకు సహాయపడతాయి. ఈ యాప్‌లు మీ వాహనం వేగాన్ని గమనించడమే కాకుండా ముందు ఎక్కడ స్పీడ్ కెమెరా ఇన్‌స్టాల్ చేయబడిందో లేదో తెలియజేస్తాయి.

రాడార్‌బాట్ (Radarbot) యాప్:

రాడార్‌బాట్ అనేది iOS (iPhone) వినియోగదారులకు అందుబాటులో ఉన్న ఒక ప్రసిద్ధ యాప్. ఈ యాప్ GPS ద్వారా పనిచేస్తుంది. అలాగే రోడ్డుపై స్పీడ్ కెమెరా కనిపించే ముందు హెచ్చరికను పంపుతుంది. ఇది రెడ్ లైట్ కెమెరాలు, సగటు వేగం గురించి సమాచారాన్ని కూడా అందిస్తుంది. ఈ యాప్‌ను ఏ దేశంలోనైనా ఉపయోగించవచ్చని, అంటే మీరు విదేశాలకు వెళుతుంటే, ఈ యాప్ మీకు అక్కడ కూడా సహాయపడుతుందని కంపెనీ పేర్కొంది.

వేజ్ (Waze) యాప్:

వేజ్ అనేది మ్యాప్‌లు, ట్రాఫిక్, స్పీడ్ కెమెరా లొకేషన్‌లను అందించే నావిగేషన్ యాప్. ఈ యాప్ గూగుల్, iOS ప్లాట్‌ఫామ్‌లలో అందుబాటులో ఉంది. మార్గంలో ట్రాఫిక్, రోడ్ బ్లాక్‌లు, స్పీడ్ కెమెరాల గురించి వినియోగదారులకు ముందస్తు నోటిఫికేషన్లు అందుతాయి. ఈ యాప్ పూర్తిగా ఉచితం. లక్షలాది మంది దీనిని డౌన్‌లోడ్ చేసుకున్నారు.

ఈ యాప్‌లు చలాన్‌ను నివారించడంలో ఖచ్చితంగా సహాయపడతాయి. కానీ వాటి ఉద్దేశ్యం నియమాలను ఉల్లంఘించడం కాదు. జాగ్రత్తగా డ్రైవ్ చేయడం. రోడ్డు ప్రమాదాలు తగ్గడానికి, ప్రజలు నియమాలను పాటించడానికి ట్రాఫిక్ పోలీసులు స్పీడ్ కెమెరాలను ఏర్పాటు చేస్తారు. ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో రోడ్డు ప్రమాదాలు అతివేగం కారణంగా జరుగుతున్నాయి. అందువల్ల మనం సాంకేతికతను భద్రత, అప్రమత్తత కోసం ఉపయోగించడం ముఖ్యం. కేవలం చలాన్‌ను నివారించడానికి కాదు.

ఇది కూడా చదవండి: ATM Pin: ఏటీఎంలో Cancel బటన్ రెండు సార్లు నొక్కితే పిన్‌ దొంగతనాన్ని నివారించవచ్చా

ఇది కూడా చదవండి: Best Savings Scheme: ఇందులో ఒకేసారి ఇన్వెస్ట్‌ చేస్తే ఐదేళ్లలో రూ.22 లక్షలు.. అద్భుతమైన ప్రభుత్వ స్కీమ్‌!

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయం