AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోండి.. విజయవంతుల సీక్రెట్స్ ఇవే!

Crorepati Habits: జీవితంలో సంపన్నులు కావడం కేవలం అదృష్టంపై ఆధారపడదు. దీనికి సరైన అలవాట్లు మీకు ఆభరణాలుగా ఉండాలి. అప్పుడే మీరు కోటీశ్వరులు కాగలరు. సేవింగ్స్‌, సరైన పెట్టుబడులు, టైమ్ మేనేజ్‌మెంట్‌, క్రమశిక్షణ వంటి అలవాట్లు సంపదను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. విజయవంతమైన వ్యక్తులు పాటించే ఈ అలవాట్లు సాధారణ వ్యక్తినీ ఆర్థికంగా ఉన్నత స్థాయికి తీసుకెళ్లగలవు.

కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోండి.. విజయవంతుల సీక్రెట్స్ ఇవే!
Habits To Become Crorepati
Janardhan Veluru
|

Updated on: May 07, 2026 | 3:15 PM

Share

జీవితంలో ఆర్థిక స్వాతంత్ర్యం సాధించాలని, కోటీశ్వరులుగా ఎదగాలని ప్రతి ఒక్కరూ కలలు కంటుంటారు. అయితే కేవలం ఎక్కువ డబ్బు సంపాదించడం వల్ల మాత్రమే సంపన్నులు కాలేరని గ్రహించాలి. సంపాదించడం ఓ ఎత్తైతే.. ఆ సంపదను నిలబెట్టుకోవడం, దాన్ని పెంచుకోవడం మరో ఎత్తు. దీని కోసం కొన్ని ప్రత్యేకమైన అలవాట్లు అవసరం. ప్రపంచంలోని విజయవంతమైన వ్యాపారవేత్తలు, పెట్టుబడిదారులు పాటించే కొన్ని సాధారణ అలవాట్లే వారిని కోటీశ్వరులుగా నిలబెట్టాయి.

  1. డబ్బును సేవ్‌ చేసే అలవాటు: సంపన్నులు కావాలంటే మొదటగా సేవింగ్స్ అలవాటు చాలా ముఖ్యం. ఎంత ఆదాయం వచ్చినా అందులో కొంత మొత్తాన్ని భవిష్యత్తు కోసం దాచుకోవాలి. ఆదాయం పెరిగేకొద్దీ ఖర్చులు కూడా పెంచుకుంటూ పోవడం చాలామంది చేసే పొరపాటు. కానీ కోటీశ్వరులు అవసరమైన ఖర్చులకే ప్రాధాన్యం ఇస్తారు. అనవసర ఖర్చుల జోలికి వెళ్లరు.
  2. ఇన్వెస్ట్‌మెంట్స్‌పై అవగాహన: సంపన్నులు కావాలంటే పెట్టుబడులపై స్పష్టమైన అవగాహన చాలా కీలకం. డబ్బును బ్యాంకులో మాత్రమే ఉంచకుండా, స్టాక్స్‌, మ్యూచువల్ ఫండ్స్‌, రియల్ ఎస్టేట్‌, బిజినెస్‌లలో పెట్టుబడులు పెట్టడం ద్వారా సంపద పెంచుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులే ఎక్కువ లాభాలను ఇస్తాయని నమ్ముతారు.
  3. టైమ్‌ను విలువైనదిగా చూడటం: సంపన్నులైన వ్యక్తుల్లో మరో ముఖ్యమైన అలవాటు టైమ్ మేనేజ్‌మెంట్. వారు ప్రతి రోజును ప్లాన్‌ చేసుకుని పని చేస్తారు. సమయాన్ని వృథా చేయకుండా తమ లక్ష్య సాధన కోసం కష్టపడతారు. కోటీశ్వరులు ప్రతి నిమిషాన్ని ప్లాన్‌ చేసుకుని సద్వినియోగం చేసుకుంటారు.
  4. కొత్త విషయాలు నేర్చుకునే అలవాటు: జీవితంలో సంపన్నులు కావాలంటే మీకు ఉండాల్సిన మరో లక్షణం కొత్త విషయాలను నేర్చుకునే అలవాటు. రోజూ కొత్త విషయాలు నేర్చుకోవడం, పుస్తకాలు చదవడం, కొత్త నైపుణ్యాలు సాధించడం జీవితంలో ఎదిగేందుకు కారణం అవుతుంది.
  5. రిస్క్ తీసుకునే ధైర్యం: ఇది కోటీశ్వరుల్లో కనిపించే ప్రధాన లక్షణం. ప్రతి అవకాశాన్ని పరిశీలించి సరైన సమయంలో నిర్ణయాలు తీసుకుంటారు. విఫలమైతే భయపడకుండా మళ్లీ ప్రయత్నిస్తారు. అవకాశాలు వచ్చినప్పుడు భయపడకుండా నిర్ణయాలు తీసుకోవడం ఎంతో కీలకం.
  6. ఖర్చులపై నియంత్రణ: జీవితంలో సంపన్నులుగా ఎదగాలంటే ఖర్చులపై నియంత్రణ కలిగి ఉండటం ఎంతో ముఖ్యం.
  7. ఈ అలవాట్లూ కీలకం: ఆరోగ్యాన్ని కాపాడుకోవడం, క్రమశిక్షణ, సహనం, పాజిటివ్ మైండ్‌సెట్‌, సరైన వ్యక్తులతో పరిచయాలు, స్పష్టమైన లక్ష్యం కూడా ఆర్థిక విజయానికి కీలకంగా మారుతాయి. సరైన అలవాట్లు పెంచుకుంటే సాధారణ వ్యక్తి కూడా భవిష్యత్తులో కోటీశ్వరుడిగా ఎదగొచ్చు.

Follow Us
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
కోటీశ్వరులు కావాలంటే అలవాట్లు మార్చుకోవాలి.. విజయవంతుల సీక్రెట్స్
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
విజయ్-త్రిషల పెళ్లి రూమర్లు.. వీరిద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎంతంటే?
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే
హైవేపై వరుసగా ప్రమాదాలు.. కట్ చేస్తే
ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
ఇంకా కొన్ని రోజుల్లోనే ఈ రాశులకు డబుల్ జాక్‌పాట్.. డబ్బే డబ్బు!
లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు
లక్నోను ఇంటికి పంపేందుకు సిద్ధమైన బెంగళూరు కుర్రాళ్లు
గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?
గృహ వినియోగం నుండి వాణిజ్యం వరకు.. ఏ సిలిండర్ ఎంత ధర ఉందో తెలుసా?
ఎలుకల ద్వారా వచ్చే వైరస్ ఓడలో ఎలా?
ఎలుకల ద్వారా వచ్చే వైరస్ ఓడలో ఎలా?
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
Polycet 2026లో టాప్‌లేపిన గోదారోళ్లు.. 16మందికి 120కి 120మార్కులు
Polycet 2026లో టాప్‌లేపిన గోదారోళ్లు.. 16మందికి 120కి 120మార్కులు
కమిన్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'.. కెప్టెన్ ఎందుకు షాకయ్యాడు ?
కమిన్స్‌కు 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్'.. కెప్టెన్ ఎందుకు షాకయ్యాడు ?