Fuel Quality: పెట్రోల్ బంకుల్లో మోసాలకు చెక్.. వైరల్ వీడియోలో ఎవ్వరికి తెలియని అసలు నిజాలు!

Fuel Quality and Quantity: చాలామంది వాహనదారులు ఒక నమ్మకంతో ఉంటారు. రూ.100, 200, 500 లాంటి రౌండ్ ఫిగర్ కాకుండా.. రూ. 110, 210, 310 లేదా 510 లాంటి 'ఆడ్ నంబర్ల'కు పెట్రోల్ కొట్టిస్తే మిషన్లలో సెట్ చేసిన..

Fuel Quality: పెట్రోల్ బంకుల్లో మోసాలకు చెక్.. వైరల్ వీడియోలో ఎవ్వరికి తెలియని అసలు నిజాలు!
Fuel Quality And Quantity

Updated on: Mar 26, 2026 | 12:26 PM

Fuel Quality and Quantity: భారతదేశంలో పెట్రోల్ లేదా డీజిల్ కొట్టించడం అనేది ఒక సాధారణ ప్రక్రియ అయినప్పటికీ, వినియోగదారుల మనసులో ఎప్పుడూ ఒక చిన్న అనుమానం ఉంటుంది. “మనం కొట్టించే ఇంధనం స్వచ్ఛమైనదేనా? మనం కట్టిన డబ్బుకు సరైన పరిమాణంలో వస్తోందా?” అనే ప్రశ్నలు ప్రతి వాహనదారుడిని వేధిస్తుంటాయి. ఈ క్రమంలో ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న ఒక వీడియో పెట్రోల్ బంకుల్లో మోసాలను ఎలా గుర్తించాలో వివరిస్తూ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

ఆడ్ నంబర్ల (Odd Numbers) వెనుక ఉన్న అపోహ:

చాలామంది వాహనదారులు ఒక నమ్మకంతో ఉంటారు. రూ.100, 200, 500 లాంటి రౌండ్ ఫిగర్ కాకుండా.. రూ. 110, 210, 310 లేదా 510 లాంటి ‘ఆడ్ నంబర్ల’కు పెట్రోల్ కొట్టిస్తే మిషన్లలో సెట్ చేసిన మోసాల నుండి తప్పించుకోవచ్చని భావిస్తారు. అయితే, వైరల్ వీడియోలోని పెట్రోల్ బంక్ ఉద్యోగి ఈ నమ్మకాన్ని కొట్టిపారేశారు. “ప్రజలు తాము చాలా తెలివైన వాళ్లమని ఇలాంటి నంబర్లను ఎంచుకుంటారు. కానీ దీనివల్ల ఎలాంటి తేడా ఉండదు” అని ఆయన స్పష్టం చేశారు. ఇంధన నాణ్యతను గుర్తించడానికి కేవలం రెండు విషయాలు గమనిస్తే సరిపోతుందని ఆయన సూచించారు.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: గ్యాస్ లీక్ అయితే ఏం చేయాలి? కంగారు పడకుండా ముందు ఈ పని చేయండి..!

1. డెన్సిటీ (సాంద్రత) – స్వచ్ఛతకు నిదర్శనం:

పెట్రోల్ స్వచ్ఛతను కొలవడానికి అత్యంత నమ్మదగిన మార్గం బంక్ మిషన్ మీద కనిపించే ‘డెన్సిటీ’ (Density) సంఖ్యను చూడటం.

  • పెట్రోల్: దీని డెన్సిటీ 720 నుండి 775 మధ్య ఉండాలి.
  • డీజిల్: దీని డెన్సిటీ 820 నుండి 860 మధ్య ఉండాలి.

ఒకవేళ మిషన్ మీద కనిపించే సంఖ్య ఈ పరిమితుల కంటే తక్కువగా లేదా ఎక్కువగా ఉంటే ఆ ఇంధనంలో కల్తీ జరిగిందని లేదా నాణ్యత లోపించిందని అర్థం చేసుకోవచ్చు. ప్రతిరోజూ బంక్ యజమానులు ఈ సాంద్రతను పరీక్షించి మిషన్లలో అప్‌డేట్ చేయాల్సి ఉంటుంది.

ఇది కూడా చదవండి: Energy Lockdown: ఎనర్జీ లాక్‌డౌన్ అంటే ఏమిటి? ఇప్పుడు ఇదే ట్రెండింగ్‌.. ప్రపంచాన్ని వణికిస్తోంది!

2. మీటర్ రీడింగ్ గమనించడం:

చాలామంది పెట్రోల్ కొట్టించేటప్పుడు మీటర్ ‘సున్నా’ (0) వద్ద ఉందో లేదో మాత్రమే చూస్తారు. కానీ సున్నా తర్వాత మీటర్ ఎలా మారుతుందో గమనించడం కూడా అంతే ముఖ్యం. మీటర్ రీడింగ్ క్రమ పద్ధతిలో (0, 1, 2, 3…) పెరగాలి. ఒకవేళ మీటర్ నేరుగా సున్నా నుండి 5కో లేదా 10కో జంప్ అయితే, ఆ మిషన్ సాఫ్ట్‌వేర్‌లో ఏదో తేడా ఉందని లేదా ట్యాంపరింగ్ జరిగిందని అనుమానించాలి.

వినియోగదారులు గుర్తుంచుకోవాల్సినవి:

పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు కొన్ని ప్రాథమిక హక్కులు ఉంటాయి. మీకు అనుమానం కలిగితే:

ఫిల్టర్ పేపర్ టెస్ట్: పెట్రోల్ నాణ్యతను పరీక్షించడానికి ఫిల్టర్ పేపర్ అడిగే హక్కు మీకు ఉంది.

5 లీటర్ల జార్ టెస్ట్: పరిమాణం సరిగ్గా ఉందో లేదో చూడటానికి ప్రభుత్వ ముద్ర ఉన్న 5 లీటర్ల కొలత పాత్రతో పరీక్షించమని అడగవచ్చు.

కేవలం అంకెలను మార్చి పెట్రోల్ కొట్టించడం వల్ల ప్రయోజనం ఉండదు. మిషన్ మీద ఉన్న డెన్సిటీని, మీటర్ వేగాన్ని గమనించడమే మోసపోకుండా ఉండటానికి సరైన మార్గం. వచ్చేసారి మీరు బంకుకు వెళ్లినప్పుడు ఈ చిన్న విషయాలను గమనించడం మర్చిపోకండి.

 

 

ఇది కూడా చదవండి: Gold Loan: గోల్డ్‌ లోన్‌ చెల్లించడంలో విఫలమైతే బ్యాంకు మీ బంగారాన్ని ఎప్పుడు వేలం వేస్తుంది?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us