
సామాన్యులకు బ్యాడ్ న్యూస్. కూరగాయల ధరలు ఎప్పటికప్పుడు మారుతూ ఉంటాయి. దిగుబడి, సరఫరా, డిమాండ్ను ఏ రోజుకు ఆ రోజు ధరల్లో మార్పులు చోటుచేసుకుంటూ ఉంటాయి. ఎల్నివో ప్రభావం, వర్షాభావ పరిస్థితుల క్రమంలో దాదాపు అన్ని కూరగాయల ధరలు పెరుగుతుండటంతో సామాన్యుల నెలవారీ ఇంటి బడ్జెట్ పెరుగుతోంది. అసలే వరుస పండుగల క్రమంలో ఇంటి ఖర్చులు పెరగనుండగా.. ఇప్పుడు కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతుండటం సామాన్య, మధ్యరగతి ప్రజలపై పెను భారం పడినట్లయింది. పెరిగిన నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలతో ఆందోళనలకు గురికాక తప్పడం లేదు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వివిధ కూరగాయల ధరలు ఎలా ఉన్నాయనేది తెలుసుకుందాం.
కూకట్పల్లి మోడ్రన్ అండ్ మోడల్ రైతు బజారులో అక్టోబర్ 16వ తేదీన కూరగాయలు ధరలు చూస్తే.. కిలో టమాట రూ.23, వంకాయ రూ.23, బెండకాయ రూ.40, పచ్చిమిర్చి రూ.50, బజ్జి మిర్చి రూ.82, కేజీ క్యాబేజీ రూ.13, బీన్స్ రూ.45, క్యారెట్ రూ.40, గోబీపువ్వు రూ.30, కాకరకాయ కిలో రూ.32, బీరకాయ రూ.35, దొండకాయ రూ.23, చిక్కుడుకాయ రూ.55, గోరుచిక్కుడు కేజీ రూ.35. బంగాళాదుంప రూ.20, బీట్రూట్ రూ.28, కంద రూ.28, చామగడ్డ రూ.35, చిలగడ దుంప రూ.40 పలుకుతున్నాయి. ఇక క్యాప్సికం కిలో రూ.60, సొరకాయ రూ.20, పొట్లకాయ రూ.23, దోసకాయ కేజీ రూ.28కి లభిస్తుండగా.. కీర దోస లోకల్ రకం కిలో రూ.23, కీరదోస ఇటాలియన్ రకం రూ.35కు దొరుకుతున్నాయి. ఉల్లిగడ్డ కిలో రూ.40, ఉల్లిపొరక రూ.55, పల్లికాయ కిలో రూ.60కు లభిస్తున్నాయి. పాత అల్లం కిలో రూ.180, కొత్త అల్లం రూ.120, వెల్లుల్లి రూ.260, ఎండుమిర్చి రూ.280, పండుమిర్చి రూ.80కు లభిస్తున్నాయి.
ఇక విజయవాడలోని రైతు బజార్లలో టమాట కిలో రూ.31, వంగ రూ.30, బెండకాయ రూ.18, పచ్చిమిర్చి రూ.52, కాకరకాయ రూ.42, క్యాబేజీ రూ.24, క్యారెరట్ రూ.48, దొండకాయ రూ.22, బంగాళదుంప రూ.25, ఉల్లిపాయలు రూ.35. గోరుచిక్కుడు రూ.34, దోసకాయ రూ.34, సారకాయ రూ.19, చిక్కుళ్లు రూ.70, బీరకాయ రూ.36, చామదుంప రూ.34, బీట్ రూట్ రూ.38, కీరదోస రూ.54, బీన్స్ రూ.95, క్యాప్చికం రూ.68, చిలకడదుంప రూ.44కు విక్రయిస్తున్నారు. ముఖ్యంగా ఉల్లిపాయలు ధరలు పెరిగాయి. గతంలో కిలో రూ.20కే లభింగా.. ఇప్పుడు రూ.40 నుంచి రూ.50కి చేరాయి. ఇక బయట రూ.70 వరకు కూడా కొంతమంది వ్యాపారులు విక్రయిస్తున్నారు.