వందే భారత్ స్లీపర్‌ రైళ్లలో కొత్త ఫుడ్ మెనూ.. అవన్నీ కట్.. రైల్వేశాఖ బిగ్ డెసిషన్..

Indian Railways: ఐఆర్‌సీటీసీ వందే భారత్ స్లీపర్ రైళ్లలో కాంపాక్ట్ ఫుడ్ మెనూను ప్రవేశపెట్టింది. గతంలో అనేక రకాల వంటకాలతో కూడిన మెనూ స్థానంలో.. ఇప్పుడు తక్కువ ఐటెమ్స్‌తో కూడిన, నాణ్యతకు ప్రాధాన్యతనిచ్చే భోజనం అందిస్తున్నారు. ప్రత్యేక క్లౌడ్ కిచెన్‌ల ద్వారా ఈ భోజనాన్ని తయారు చేస్తున్నారు.

వందే భారత్ స్లీపర్‌ రైళ్లలో కొత్త ఫుడ్ మెనూ.. అవన్నీ కట్.. రైల్వేశాఖ బిగ్ డెసిషన్..
Food

Updated on: Nov 27, 2026 | 8:49 AM

వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో ప్రయాణించేవారికి బిగ్ అలర్ట్. ఫుడ్ మెనూ పూర్తిగా మారింది. గతంలో చాలా ఆహార పదార్థాలు ఉండగా.. ఇప్పుడు వాటిని తగ్గించింది. ఇక నుంచి తక్కువ రకాల వంటకాలను మరింత నాణ్యతతో అందించనున్నారు. ఎక్కువ వంటకాల బదులు ప్రత్యేక కిచెన్లలో తయారుచేసిన నాణ్యమైన ఆహారంతో కొత్త మెనూను ఐఆర్‌సీటీసీ ప్రవేశపెడుతూ నిర్ణయం తీసుకుంది. విమానం తరహాలోనే క్యాటరింగ్ నమూనాన్ని ప్రవేశపెట్టింది. వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో వడ్డించే ఆహార పదార్థాలపై ఇటీవల వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో చర్యలు చేపట్టిన ఐఆర్‌సీటీసీ ఫుడ్ మెనూలో మార్పులు చేసిది. ఎక్కువ వంటకాలకు బదులు తక్కువ వంటకాలను తయారు చేయనుంది. దీని వల్ల క్యాటరింగ్ టీమ్‌లకు తయారీ, ప్యాకేజింగ్, పంపిణీ నిర్వహణ మరింత సులభతరం కానుంది.

ఫుడ్ మెనూ ఇదే..

బ్రేక్‌ఫాస్ట్‌గా చట్నీ, సాంబార్ ఇడ్లీ, వడ లేదా పోహా, ఉప్మా అందిస్తారు. ఇక మధ్యాహ్నం లంచ్‌లో చపాతీ, అన్నం, పప్పు, ఒక ప్రధాన వంటకం ఉంటుంది. ప్రధాన వంటకంలో వెజ్ లేదా నాన్‌వెజ్ వంటకం ఎంచుకునే వీలుంది. ఇక డిన్నర్ నుంచి పెరుగు, సలాడ్, ఊరగాయ, పొడి కూరగాయలు, స్వీట్లు తొలగించారు. ప్రస్తుతం ముంబై-బెంగళూరు, హౌరా-కామాఖ్య, ఢిల్లీ-వారణాసి వందే భారత్ స్లీపర్ రైళ్లల్లో వీటిని ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్నారు. విమానయాన సంస్థలు, హోటళ్లకు భోజనం సరఫరా చేసే కంపెనీల సహకారంతో ఐఆర్‌సీటీసీ ఈ ఫుడ్ మెనూను అమలు చేయనుంది. ప్రస్తుతం ప్రయోగాత్మక పద్దతిలో ఈ ఫుడ్ మెనూను అమలు చేస్తున్నారు. ప్రయాణికుల నుంచి అభిప్రాయాలను తీసుకుంటోంది. ఈ ఫీడ్ బ్యాక్ తర్వాత విస్తృతంగా అమలు చేయడంపై నిర్ణయం తీసుకోనుంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మూడు వందే భారత్ స్లీపర్ రైళ్లు నడుస్తున్నాయి. ముంబై-బెంగళూరు, హౌరా-కామాఖ్య, ఢిల్లీ-వారణాసి మార్గాల్లో వందే భారత్ స్లీపర్ ట్రైన్లు సర్వీసులు అందిస్తున్నాయి. రాత్రిపూట మెరుగైన సౌకర్యాన్ని అందించేందుకు ఇవి ఉపయోగపడుతున్నాయి.

గతంలో అల్పాహారంలో సూప్, ఆమ్లెట్, శాండ్‌విచ్, మజ్జిగ, చాక్లెట్ వంటి అదనపు ఐటెమ్‌లను అందించేవారు. ఇప్పుడు వాటిని తొలగించారు. ఈ మార్పుల వల్ల భోజనం మొత్తం బరువు గణనీయంగా తగ్గింది. గతంలో ఒక మీల్ సుమారు 700-750 గ్రాములు ఉండగా.. ఇప్పుడు అది 450-500 గ్రాములకు తగ్గింది. అయితే ఐఆర్‌సీటీసీ అధికారులు ఇచ్చిన నివేదిక ప్రకారం ప్రధాన వంటకాల పరిమాణంలో ఎలాంటి మార్పు లేదు. తక్కువ ఐటెమ్‌లను అందించడం వల్లనే మొత్తం భోజనం బరువు తగ్గిందని అధికారులు స్పష్టం చేశారు. ఈ కొత్త ఫుడ్ మోనూతో రైలు ప్రయాణంలో ఆహార నాణ్యత, పరిశుభ్రతను మెరుగుపరచడమే కాకుండా.. క్యాటరింగ్ సేవలను మరింత సరళతరం చేయాలని ఐఆర్‌సీటీసీ లక్ష్యంగా పెట్టుకుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us