UPI Transaction: ఇంటర్నెట్ లేకుండా యూపీఐ లావాదేవీ చేయొచ్చు.. ఎలాగంటే..

|

Nov 12, 2024 | 4:08 PM

UPI: ఏవైనా లావాదేవీలు చేయాలంటే ముందుగా ఇంటర్నెట్‌ కావాలి. సిగ్నల్ సరిగ్గా లేకుంటే పేమెంట్‌ జరగదు. అలాంటి సమయంలో ఇబ్బందులు పడాల్సి ఉంటుంది. దేశంలో యూపీఐ లావాదేవీలు పెరిగిపోయాయి. ఇంటర్నెట్‌ లేకున్నా యూపీఐ ద్వారా డబ్బులు పంపవచ్చన్న విషయం మీకు తెలుసా..?

UPI Transaction: ఇంటర్నెట్ లేకుండా యూపీఐ లావాదేవీ చేయొచ్చు.. ఎలాగంటే..
Follow us on

యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UPI) డిజిటల్ విప్లవాన్ని తీసుకొచ్చింది. కానీ నేటికీ చాలా మంది ఇంటర్నెట్‌ లేక చెల్లింపులు చేయలేకపోతున్నారు. స్మార్ట్‌ఫోన్ కొనలేని స్థితిలో చాలా మంది ఉన్నారు. కానీ ఇంటర్నెట్ లేకుండా కూడా UPI ద్వారా చెల్లింపు చేయవచ్చు. ఇది మాత్రమే కాదు UPI సాధారణ కీప్యాడ్ ఫోన్ ద్వారా కూడా చెల్లింపులు చేయవచ్చు. దీని కోసం ఒక ప్రత్యేక USSD కోడ్ అవసరం.

నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) *99# సేవను ప్రారంభించింది. దీని ద్వారా మీరు ఇంటర్నెట్ లేకుండా బ్యాంకింగ్ సేవలను ఉపయోగించవచ్చు. ఈ సేవ కింద మీరు మీ బ్యాంక్ ఖాతాకు డబ్బు పంపవచ్చు. చెల్లింపును కూడా స్వీకరించవచ్చు. ఇది కాకుండా, బ్యాలెన్స్‌ని చెక్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. యూపీఐ పిన్‌ని సెట్ చేయడం ద్వారా ఈ లావాదేవీలు చేయవచ్చు.

ఇంటర్నెట్ లేకుండా యూపీఐ ద్వారా డబ్బు పంపడానికి సులభమైన మార్గం:

1. మీ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడిన రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ నుండి *99# డయల్ చేయండి.

2. బ్యాంకింగ్ సేవల మెను స్క్రీన్‌పై కనిపిస్తుంది. ఇక్కడ కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి.

Send Money

Request Money

Check Balance

My Profile

Pending Request

Transactions

UPI Pin (UPI)

3. డబ్బు పంపడానికి, ‘1’ అని టైప్ చేసి నొక్కండి.

4. డబ్బు పంపే పద్ధతిని ఎంచుకోండి – మొబైల్ నంబర్, UPI ID, సేవ్ చేయబడిన లబ్ధిదారు మొదలైనవి. సంబంధిత నంబర్‌ని టైప్ చేసి పంపు ఆప్షన్‌పై నొక్కండి.

5: మీరు మొబైల్ నంబర్ ద్వారా బదిలీని ఎంచుకుంటే, డబ్బు పంపే వ్యక్తి UPIకి లింక్ చేయబడిన మొబైల్ నంబర్‌ను నమోదు చేయండి.

6: బదిలీ చేయడానికి మొత్తాన్ని నమోదు చేయండి.

7: మీకు కావాలంటే, మీరు చెల్లింపుతో పాటు ఏదైనా సందేశం కూడా రావచ్చు.

8: లావాదేవీని పూర్తి చేయడానికి మీ యూపీఐ పిన్‌ని నమోదు చేయండి.

9: ఇంటర్నెట్ లేకుండానే మీ యూపీఐ లావాదేవీ విజయవంతమవుతుంది.

ఇది కూడా చదవండి: Donkey- Camel Milk: గాడిద – ఒంటె పాలలో ఏది ఖరీదైనది.. వీటిలో ఔషధ గుణాలు ఏంటి?

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి