UPI Charges: యూపీఐ ద్వారా రూ.2 వేల కంటే ఎక్కువ పంపుతున్నారా..? మూడ్రోజులే టైమ్.. రెడీగా ఉండండి..

యూపీఐ నిబంధనలలో అక్టోబర్ 15 నుండి కీలక మార్పులు అమల్లోకి రానున్నాయి. ఇప్పటివరకు దాదాపు ఉచితంగా కొనసాగిన పర్సన్ టు మర్చంట్ (P2M) యూపీఐ చెల్లింపులపై కొన్ని ఛార్జీలు వర్తించనున్నాయి. ఈ చార్జీల విధింపును జనవరికి వాయిదా వేస్తారనే ప్రచారం జరిగింది. కానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

UPI Charges: యూపీఐ ద్వారా రూ.2 వేల కంటే ఎక్కువ పంపుతున్నారా..? మూడ్రోజులే టైమ్.. రెడీగా ఉండండి..
Upi Charges

Updated on: Oct 11, 2026 | 12:05 PM

యూపీఐ చెల్లింపులు అనేవి మన దైనందిన జీవితంలో ఒక అంతర్భాగంగా మారాయి. జేబులో నగదు లేకపోయినా, కార్డు లేకపోయినా సరే.. టీ కొట్టు నుండి పెద్ద పెద్ద షాపింగ్ మాల్ వరకు ఎక్కడైనా  స్మార్ట్‌ఫోనే మన పర్స్‌గా మారింది. ఇప్పటివరకు వ్యాపారస్తులకు ఉచితంగా యూపీఐ లావాదేవీలు వినియోగించుకుంటే సౌకర్యం ఉండేది. అయితే మరో మూడు రోజుల్లో అక్టోబర్ 15 నుండి యూపీఐ నిబంధనలలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ఈ మార్పులు ముఖ్యంగా వ్యాపారులపై ప్రభావాన్ని చూపనున్నాయి. కస్టమర్ నుంచి రూ.2 వేలుపైబడి స్వీకరించే యూపీఐ చెల్లింపులపై వ్యాపారులకు 0.4 శాతం ఎండీఆర్ చార్జీలు అమలు చేయనున్నారు. ఈ ఛార్జ్ గరిష్టంగా ఒక్కొ లావాదేవీకి రూ.300 వరకు ఉంటుంది. అంటే మీరు ఒక వ్యాపారికి రూ.75 వేలు చెల్లిస్తే.. వ్యాపారికి రూ.74,700 మాత్రమే చేరుతుంది, రూ.300 ఎండీఆర్ ఛార్జీల కింద కట్ అవుతాయన్నమాట. రూ.లక్ష చెల్లించినా గరిష్టంగా రూ.300 మాత్రమే చార్జీ కట్ అవుతుంది.

అయితే ఈ ఛార్జీల వల్ల వినియోగదారులపై ఎలాంటి ప్రభావం పడదు. యూపీఐ లావాదేవీల ఛార్జీలను వ్యాపారులే భరించాల్సి ఉంటుంది.  ఇక  వ్యక్తుల మధ్య జరిగే యూపీఐ బదిలీలకు ఎటువంటి ఛార్జీలు పడవు. ఎప్పటిలాగే వీటిని ఉచితంగానే నిర్వహించుకోవచ్చు. ఇక  కస్టమర్ రూ.2 వేలకంటే తక్కువ పేమెంట్ చేస్తే వ్యాపారికి ఎలాంటి యూపీఐ చార్జీలు పడవు. రూ.2,000  జరిగే ప్రతి  లావాదేవీకి 0.4 శాతం ఎండీఆర్ ఛార్జ్ వ్యాపారులకు పడుతుంది. రూ.2,001 చెల్లిస్తే.. వ్యాపారికి రూ.1,993 మాత్రమే చేరుతుంది. రూ.5,000 చెల్లిస్తే.. వ్యాపారికి రూ.4,980 చేరుతుంది. ఇక రూ.10,000 చెల్లిస్తే వ్యాపారికి రూ.9,960 చేరుతుంది. రూ.25,000 చెల్లిస్తే.. వ్యాపారికి రూ.24,900 చేరుతుంది. ఇక రూ.75,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తాలకు గరిష్టంగా రూ.300 కట్ అవుతుంది.

కొన్ని వర్గాలకు ఈ ఛార్జీల నుండి మినహాయింపులు కల్పించారు.  యూపీఐ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లింపులు స్వీకరించే చిన్న వ్యాపారులకు జీరో ఎండీఆర్ విధానం కొనసాగుతుంది. టీ స్టాల్స్, చిన్న కిరాణా దుకాణాలు వంటి చోట్ల రూ.2,500 వంటి మొత్తాలు చెల్లించినా వారికి 0.4 శాతం ఛార్జ్ వర్తించదు. ఇక రైల్వే, టెలికాం, ఇన్సూరెన్స్, ఫ్యూయల్, విద్యుత్, వాటర్, పైప్‌డ్ గ్యాస్ వంటి కొన్ని కేటగిరీలలో రూ.2,000 దాటిన చెల్లింపులకు ఫ్లాట్ రూ.5 ఎండీఆర్ మాత్రమే వర్తిస్తుంది.  అయితే ఈ చార్జీలు వ్యాపారులకు భారంగా మారనున్నాయి. కొంతమంది వ్యాపారులు వస్తువుల ధరలను పరోక్షంగా పెంచడం లేదా హిడెన్ ఛార్జీలను జోడించడం ద్వారా దీనిని భర్తీ చేసుకోవడానికి ప్రయత్నించవచ్చు. ఇలా జరిగితే పెరిగిన ధరల రూపంలో పరోక్షంగా వినియోగదారుడిపైనే భారం పడుతుంది.

Loading...
Unable to load recommendations.
Follow Us