Hero Bikes: బైక్ కొనే ప్లాన్‌ ఉందా? కేవలం రూ. 22 వేలకే ఇంటికి తెచ్చుకోవచ్చు! వివరాలు ఇవిగో..

ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలంటే.. దాదాపుగా రూ. 70 - 80 వేల వరకు ఖర్చవుతుంది. అయితే..

Hero Bikes:  బైక్ కొనే ప్లాన్‌ ఉందా? కేవలం రూ. 22 వేలకే ఇంటికి తెచ్చుకోవచ్చు! వివరాలు ఇవిగో..
Hero Splendor

Updated on: Feb 18, 2023 | 8:00 PM

ఇప్పుడున్న పరిస్థితుల్లో కొత్త ద్విచక్ర వాహనం కొనుగోలు చేయాలంటే.. దాదాపుగా రూ. 70 – 80 వేల వరకు ఖర్చవుతుంది. అయితే మీ ఫేవరెట్ బైక్‌ను కొనేందుకు అంత పెద్ద బడ్జెట్ పెట్టాల్సిన పనిలేదు. ఎన్నో అద్భుతమైన ఆఫర్లు అందుబాటులోకి వచ్చేశాయ్. అలాగే సెకండ్ హ్యాండ్ బైక్‌లు విక్రయించే పలు ప్రముఖ వెబ్‌సైట్‌లలోనూ మంచి కండీషన్‌లో ఉన్న ద్విచక్ర వాహనాలను అమ్మకానికి ఉంచారు. మరి మీరు ఒకవేళ సెకండ్ హ్యాండ్ బైక్‌ను కొనే ప్లాన్‌లో ఉన్నట్లయితే.. ఈ ఆఫర్ మీకోసమే..? వివరాలు ఏంటో తెలుసుకుందామా.?

కేవలం రూ. 22 వేలకే హీరో స్ప్లెండర్ ప్లస్ బైక్‌ను.. ప్రముఖ ఆన్‌లైన్ వెబ్‌సైట్ Bikewale అందుబాటులో ఉంచింది. ఇది మూడు నెలల ఓల్డ్ బైక్ కాగా.. ఫస్ట్ ఓనర్ అమ్మకానికి ఉంచారు. హర్యానా రిజిస్ట్రేషన్‌తో లభించే ఈ బైక్‌కు 9.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ అమర్చబడి ఉంది. ఇది లీటర్ పెట్రోల్‌కు 70 కిలోమీటర్లు ఇస్తుంది. అలాగే కొనుగోలుదారుడికి వెహికల్ ఇన్సూరెన్స్‌తో పాటు ఒరిజినల్ డాక్యుమెంట్స్, ఎక్ససరీస్ దొరుకుతాయి. కాగా, సెకండ్ హ్యాండ్ బైక్‌లు లేదా కార్లు కొనేటప్పుడు బైక్ యజమానిని కలవకుండా, దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ స్వయంగా ధృవీకరించకుండా ఆర్ధిక లావాదేవీలు చేయకండి. పైన సమాచారం కేవలం సదరు వెబ్‌సైట్‌లోని వివరాల మేరకు ఇచ్చినది మాత్రమే.