
ఇప్పటిరోజుల్లో ప్రతీ పనికి ఆధార్ కార్డు అనేది తప్పనిసరి అయింది. అందులో ఏమైనా తప్పులు ఉంటే కేవైసీ ప్రక్రియలో ఇబ్బందులు ఎదురవుతాయి. అందుకే ఆధార్ కార్డులో వివరాలు కరెక్ట్‌గా ఉంచుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే మార్చుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆధార్ కార్డు అప్డేట్ రూల్స్‌ను యూఐడీఏఐ సులభతరం చేసింది. ఆన్‌లైన్ ద్వారా సులువుగా మార్చుకునే అవకాశం కల్పిస్తోంది. ఈ క్రమంలో ఆధార్ కార్డులో తండ్రి పేరు తప్పుగా ఉంటే ఎలా అప్డేట్ చేసుకోవాలి..? ఆన్‌లైన్ లేదా ఆఫ్‌లైన్ ద్వారా ఎలా ఛేంజ్ చేసుకోవాలి? అనే విషయాలు చూద్దాం.
-యూఐడీఏఐ అధికారిక పోర్టల్ https://uidai.gov.in వెబ్‌సైట్ ఓపెన్ చేయండి
-మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి ఓటీపీతో లాగిన్ అవ్వండి
-జనాభా వివరాలు అప్డేట్ అనే ఆప్షన్ ఎంచుకోండి
-ఆ తర్వాత ఆధార్ అప్డేట్ విభాగాన్ని వెళ్లండి
-ఆధార్ వివరాలు అప్డేట్(ఆన్‌లైన్) అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి
-అధికారిక గుర్తింపు పత్రాల్లో ఉన్నట్లుగా తండ్రి పేరు ఎంటర్ చేయండి
-డేట్ ఆఫ్ బర్త్, పాన్ కార్డ్, పాస్ పోర్ట్ వంటి గుర్తింపు డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయండి
-అన్ని వివరాలు చూసుకున్నాక సబ్మిట్ చేయండి
సమీపంలోని ఆధార్ సెంటర్‌కు వెళ్లి అప్డేట్ ఫారం పూర్తి చేయండి. ఆ తర్వాత అవసరమైన పత్రాలను జత చేయండి. అక్కడి అపరేటర్లు మీ వివరాలను అప్డేట్ చేస్తారు. దీనికి కొంత సర్వీస్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.
మీు రిక్వెస్ట్ సబ్మిట్ చేశాక యూఆర్‌ఎన్ నెంబర్ వస్తుంది. ఆ నెంబర్ ఆధారంగా స్టేటస్ చెక్ చేసుకోవచ్చు. వివరాలు అప్డేట్ అవ్వడానికి 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. వివరాలు అప్డేట్ అయ్యాక మీకు మెస్సేజ్ రూపంలో సమాచారం అందిస్తారు. అలాగే కొత్త కార్డు మీకు పోస్ట్ ద్వారా ఇంటిక పంపిస్తారు. అవసరమైతే ఆన్ లైన్ ద్వారా ఈ-ఆధార్ డౌన్ లోడ్ చేసుకుని ఉపయోగించుకోవచ్చు. ఇలా సులభంగా ఆధార్ కార్డులోని తండ్రి పేరును అప్డేట్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డులో తండ్రి పేరు తప్పు ఉన్నా లేదా అక్షర దోషాలు ఉన్నా పాన్ కార్డు, పాస్ పోర్ట్ లాంటి ఇతర డాక్యుమెంట్స్ పత్రాలు పొందటంలో సమస్యలు ఎదురుకావొచ్చు. ఇక కేవైసీ వెరిఫికేషన్ సమయంలో కూడా ఇబ్బందులు వస్తాయి. కేవైసీ పూర్తి చేయడంలో టెక్నికల్ సమస్యలకు గురి అవుతారు. దీంతో ఆధార్ కార్డులోని వివరాలన్నీ కరెక్ట్‌గా ఉండేలా చేసుకోవడం ఎంతో మంచిదని చెప్పవచ్చు.