
టీవీఎస్ కంపెనీ ఎంట్రీ-లెవల్ కమ్యూటర్ బైక్ అయిన స్పోర్ట్ కు కొత్త అప్డేట్ ఇచ్చి 2025 స్పోర్ట్ ఈఎస్ ప్లస్ వేరియంట్‌ను విడుదల చేసింది. ఈ కొత్త మోడల్ ధర రూ.59,881 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. ఈ బైక్ డిజైన్ గురించి చెప్పాలంటే మోడల్ పెద్దగా మారలేదు. అయితే ఈఎస్ ప్లస్ అపేడేట్ వెర్షన్ స్పోర్టియర్ గ్రాఫిక్స్‌తో పాటు కొత్త రంగు ఎంపికలతో ఆకట్టుకుంటుంది. గ్రే రెడ్, బ్లాక్ నియాన్ రంగులతో లాంచ్ చేసింది. “స్పోర్ట్” బ్రాండింగ్ వెనుక వైపు ప్యానెల్‌లో బోల్డ్ ఫాంట్లో స్పష్టంగా ఆకట్టుకుంటుంది.
టీవీఎస్ స్పోర్ట్ ఇంజిన్‌ను 110 సీసీతోనే లాంచ్ చేసింది. అంటే 2025 స్పోర్ట్ ఈఎస్ ప్లస్ బైక్‌కు శక్తినివ్వడానికి సుపరిచితమైన 109.7 సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్‌తో లాంచ్ చేశారు. అందువల్ల ఈ బైక్ 8 హెచ్‌పీ పవర్ అవుట్ పుట్‌తో పాటు 8.7 ఎన్ఎం పీక్ టార్క్ న్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ బైక్ ఓబీడీ-2బీ కంప్లైంట్, తాజా ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఈ బైక్ ఫోర్ స్పీడ్ గేర్‌బాక్స్‌తో అనుసంధానం చేసి వస్తుంది. ఈ బైక్‌పై గంటకు 90 కిలోమీటర్ల గరిష్ట వేగంతో దూసుకుపోవచ్చు.
టీవీఎస్ స్పోర్ట్ ఈఎస్ ప్లస్ బైక్ సస్పెన్షన్ విధులను నిర్వహించేందుకు ముందు భాగంలో టెలిస్కోపిక్ ఫోర్కులు, వెనుక భాగంలో ట్విన్ షాక్ అబ్జార్బర్లను అందిస్తుంది. ఈ బైక్ ట్యూబ్స్ టైర్లతో కూడిన 5-స్పోక్ అల్లాయ్ వీల్‌పై నడుస్తుంది. బ్రేకింగ్ విధుల కోసం ముందు, వెనుక డ్రమ్ బ్రేక్‌లను ఇచ్చారు. స్పోర్ట్ శ్రేణిలో ఇప్పుడు మూడు వేరియంట్లు ఉన్నాయి: సెల్ఫ్ స్టార్ట్ ఈఎస్, సెల్ఫ్ స్టార్ట్ ఎస్ ప్లస్, సెల్ఫ్ స్టార్ట్ ఈఎల్ఎస్. ఈ బైక్స్ ధరలు రూ. 59,881 నుంచి రూ. 71,785 వరకు ఉన్నాయి.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి