TVS iQube: భారీ తగ్గింపు ధరకే బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..అసలైన ఆఫర్ ఇదే.!

ప్రస్తుతం మన దేశంలో ఎలక్ట్రిక్‌ స్కూటర్ల హవా నడుస్తోంది. ఎక్కడ చూసినా ఇ- స్కూటర్లు, ఇ- బైక్‌లు పరుగులు పెడుతున్నాయి. పల్లెల నుంచి పట్టణాల వరకూ వీటి వినియోగం పెరిగింది. ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడానికి ప్రజలు ఎంతో ఆసక్తి చూపుతున్నారు. ప్రముఖ కంపెనీలన్నీ ఇ-విభాగంలో ద్విచక్ర వాహనాలను విడుదల చేస్తున్నాయి.

TVS iQube: భారీ తగ్గింపు ధరకే బెస్ట్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..అసలైన ఆఫర్ ఇదే.!
Tvs Iqube

Updated on: May 20, 2025 | 2:43 PM

మారుతున్న కాలానికి అనుగుణంగా ఈవీ స్కూటర్స్‌లో అనేక ఫీచర్లను ప్రవేశపెడుతున్నాయి. ఈ నేపథ్యంలో టీవీఎస్‌ కూడా తన ఎలక్ట్రిక్‌ వాహనాలను విస్తరించుకుంటూ పోతోంది. మార్కెట్‌లో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకోవడానికి కృషి చేస్తోంది. ముఖ్యంగా తన ఐక్యూబ్‌ పోర్టుపోలియోను విస్తరించుకుంటూ పోతోంది. దానిలో కొత్త వేరియంట్లను విడుదల చేస్తోంది. అలాగే ధరలను తగ్గించి కొనుగోలుదారులకు మరింత అందుబాటులోకి తీసుకువస్తోంది.

ప్రయాణ అవసరాల కోసం ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ను కొనుగోలు చేయాలనుకుంటున్నారా, అందుబాటు ధరలో ఉండే స్కూటర్‌ కోసం ఎదురు చూస్తున్నారా, ఏమైనా తగ్గింపు లభిస్తే బాగుంటుందని భావిస్తున్నారా.. అయితే మీ నిరీక్షణకు తెర దింపేయ్యండి. వెంటనే స్కూటర్‌ కొనుగోలుకు ముహూర్తం పెట్టేసుకోండి. ఎందుకంటే ప్రముఖ ద్విచక్ర వాహన తయారీ సంస్థ టీవీఎస్‌ తన ఐక్యూబ్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్లపై భారీ తగ్గింపును ప్రకటించింది. అత్యంత తక్కువ ధరకు బెస్ట్‌ బ్రాండ్‌ ఈవీ కొనుగోలు చేయాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఈ నేపథ్యంలో ఐక్యూబ్‌పై అందిస్తున్న తగ్గింపు ధరలను తెలుసుకుందాం.

  • టీవీఎస్‌ ఐక్యూబ్‌ స్కూటర్‌కు మన దేశంలో మంచి డిమాండ్‌ ఉంది. ప్రముఖ బ్రాండ్‌ కావడంతో విక్రయాలు జోరుగా సాగుతున్నాయి.
  • ఈ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ ఐదు వేర్వేరు ట్రిమ్‌ లెవెల్స్‌లో అందుబాటులో ఉంది. 2.2 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌ తో వచ్చే స్కూటర్‌ను బేసిక్‌ వేరియంట్‌ అంటారు. అయితే దీని ధరలో కంపెనీ ఎలాంటి మార్పు చేయలేదు.
  • 3.5 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ప్యాక్‌తో వస్తున్న ఐక్యూబ్‌ ఐ వేరియంట్‌ ధర రూ.1.56 లక్షల నుంచి రూ.1.40 లక్షలకు తగ్గింది.
  • 3.5 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ కలిగిన ఐక్యూబ్‌ ఎస్‌టీ వేరియంట్‌ రూ.1.50 లక్షలకు అందుబాటులోకి వచ్చింది. గతంలో రూ.1.65 లక్షలు ఉండేది.
  • ఐక్యూబ్‌ ఎస్‌టీ (5.3 కేడబ్ల్యూహెచ్‌) వేరియంట్‌ బ్యాటరీ సామర్థ్యం పెరిగింది. గతంలో 5.1 కేడబ్ల్యూహెచ్‌ బ్యాటరీ ఉండేది. అలాగే ధర రూ.1.85 లక్షల నుంచి రూ.1.59 లక్షలకు తగ్గింది. సింగిల్‌ చార్జింగ్‌పై సుమారు 212 కిలోమీటర్లు పరుగులు తీస్తుంది.
  •  పైన తెలిపినవన్నీ ఎక్స్‌ షోరూమ్‌ ధరలు. ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌పై రాష్ట్ర ప్రభుత్వాల ఇచ్చే సబ్సిడీ కారణగా వివిధ నగరాల్లో ధరలు మారే అవకాశం ఉంది.