TRAI: ఉపయోగించని సిమ్‌కార్డులపై జరిమానా.? కస్టమర్లపై భారం తప్పదా..

చాలా మంది ఒక సిమ్‌ కార్డులో రీఛార్జ్‌ చేస్తూ మరో సిమ్‌ కార్డును అలంకరణ ప్రాయంగా మార్చారు. దీంతో రీఛార్జ్‌ చేయని సిమ్‌లకు ఇన్‌కమింగ్ కాల్స్‌ను నిలిపివేస్తున్నాయి టెలికం కంపెనీలు. టెలికం ఆపరేటర్లు తమ వినియోగదారులను సంఖ్యను కాపాడడం కోసం రీఛార్జ్‌ చేయని నెంబర్లను రద్దు చేయడం లేదు. అయితే ఇకపై ఇలాంటి ఉపయోగంలో...

TRAI: ఉపయోగించని సిమ్‌కార్డులపై జరిమానా.? కస్టమర్లపై భారం తప్పదా..
TRAI

Updated on: Jun 14, 2024 | 6:47 AM

ప్రస్తుతం ఎవరి చేతిలో చూసినా స్మార్ట్‌ ఫోన్‌ దర్శనమిస్తోంది. డ్యూయల్‌ సిమ్‌ ఫోన్‌లు అనివార్యంగా మారాయి. దీంతో చాలా మంది రెండు సిమ్‌లను ఉపయోగిస్తూ వచ్చారు. అయితే మొదట్లో అన్‌లిమిటెడ్ ఇన్‌కమింగ్ కాల్స్‌తో ఆపరేట్‌ చేసిన టెలికం సంస్థలు ఇప్పుడు ఇన్‌కమింగ్ కాల్స్‌ రావాలన్నా రీఛార్జ్‌ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.

చాలా మంది ఒక సిమ్‌ కార్డులో రీఛార్జ్‌ చేస్తూ మరో సిమ్‌ కార్డును అలంకరణ ప్రాయంగా మార్చారు. దీంతో రీఛార్జ్‌ చేయని సిమ్‌లకు ఇన్‌కమింగ్ కాల్స్‌ను నిలిపివేస్తున్నాయి టెలికం కంపెనీలు. టెలికం ఆపరేటర్లు తమ వినియోగదారులను సంఖ్యను కాపాడడం కోసం రీఛార్జ్‌ చేయని నెంబర్లను రద్దు చేయడం లేదు. అయితే ఇకపై ఇలాంటి ఉపయోగంలో లేని సిమ్‌ కార్డులపై టెలికం సంస్థల నుంచి జరిమానా విధించాలని ట్రాయ్‌ భావిస్తోంది. దీంతో కంపెనీలు సహజంగానే ఈ భారాన్ని యూజర్లపై వేస్తాయి.

అంతేకాకుండా ప్రతీ మొబైల్ నెంబర్‌కూ ఛార్జీ వసూలు చేయాలని ట్రాయ్‌ భావిస్తున్నట్లు సమాచారం. నంబరింగ్‌ వనరుల నియంత్రణపై వచ్చిన ప్రతిపాదనతోనే, ట్రాయ్‌ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ మేరకు ‘రివిజన్‌ ఆఫ్‌ నేషనల్‌ నంబరింగ్‌ ప్లాన్‌’ పేరిట ఒక చర్చాపత్రం విడుదల చేసి, వివిధ వర్గాల అభిప్రాయాలను కోరింది. టెలికం ఆపరేటర్ల నుంచి ఈ ఛార్జీలు వసూలు చేయాలని ట్రాయ్‌ భావిస్తోంది. దీంతో ఈ భారం కూడా వినియోగదారులపై పడే అవకాశం ఉంది.

ఈ లెక్కన రీఛార్జ్‌లతో పాటు, నెంబర్‌ కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించక తప్పని పరిస్థితి వచ్చే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఇలా ఫోన్ నెంబర్లపై ఛార్జీలను ఇప్పటికే పలు దేశాల్లో అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఆస్ట్రేలియా, సింగపూర్, బెల్జియం, ఫిన్లాండ్, బ్రిటన్, గ్రీస్, హాంకాంగ్, బల్గేరియా, కువైట్, నెదర్లాండ్స్, స్విట్జర్లాండ్, పోలాండ్, నైజీరియా, దక్షిణాఫ్రికా, డెన్మార్క్‌ దేశాల్ ఫోన్‌ నెంబర్లపై ఛార్జీలను వసూలు చేస్తున్నారు.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..