
శ్రావణమాసం, వరుస సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులు సంఖ్య పెరిగింది. ఇప్పటికే శ్రీవారి కొండ భక్తులతో కిటకిటలాడుతోంది. అయినా ఇంకా తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు వెళ్తూనే ఉన్నారు. దీంతో ట్రైన్‌లు కూడా భక్తులలో కిక్కిరిసి ప్రయాణిస్తున్నాయి. ఈ ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రెండు నగరాల మధ్య రెండు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు తెలిపింది. ఈ మేరకు ఆదివారం, సోమవారం( 17, 18 తేదీల్లో) ఈ ప్రత్యేక సర్వీసులు అందుబాటులో ఉంటాయని పేర్కొంది.
తిరుపతి నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే (07097) నెంబర్ గల ప్రత్యేక రైలు ఆదివారం తిరుపతి నుండి బయల్దేరి సికింద్రాబాద్‌కు చేరుకుంటుంది. అలాగే, సికింద్రాబాద్ నుంచి తిరుపతి మధ్య నడిచే (07098) నెంబర్ గల మరో ప్రత్యేక రైలు ఆగస్ట్ 18 సోమవారం అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్రత్యేక రైళ్లలో ఫస్ట్ క్లాస్ AC, 2AC, 3AC, ఎకానమీ, స్లీపర్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు అందుబాటులో ఉంటాయని రైల్వేశాఖ అధికారులు తెలిపారు.
సికింద్రాబాద్- తిరుపతి మధ్య నడిచే ఈ ప్రత్యేక రైళ్లు మార్గమధ్యంలో రేణిగుంట, రాజంపేట, కడప, యర్రగుంట్ల, తాడిపత్రి, గుంతకల్, ఆదోని, మంత్రాలయం రోడ్, రాయచూర్, కృష్ణ, యాద్గిర్, తాండూర్, వికారాబాద్, లింగంపల్లి, బేగంపేట్ స్టేషన్లలో ఆగుతాయని అధికారులు తెలిపారు. ఈ మార్గంలో ప్రయాణించే ప్రాయణికులు ఈ సౌకర్యాన్ని వినియోగించుకోవాలని సౌత్ సెంట్రల్ రైల్వే అధికారులు సూచించారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.