
సాధారణ ఇనుప సిలిండర్ల స్థానంలో ఇప్పుడు కాంపోజిట్ సిలిండర్లు అందుబాటులోకి వచ్చాయి. ఇవి మూడు పొరల ప్రత్యేకమైన ఫైబర్ గ్లాస్, హై-డెన్సిటీ పాలిథిలిన్ (HDPE) పదార్థంతో తయారవుతాయి. దీనివల్ల ఇవి సాధారణ సిలిండర్ల కంటే 50శాతం తక్కువ బరువు ఉంటాయి. ఉదాహరణకు, ఖాళీ ఇనుప సిలిండర్ 15-16 కేజీలు ఉంటే, కాంపోజిట్ సిలిండర్ కేవలం 5-7 కేజీల బరువు మాత్రమే ఉంటుంది. దీనిలోని ప్రధాన ప్రయోజనం ఏమిటంటే, ఇది పాక్షికంగా పారదర్శకంగా (Translucent) ఉంటుంది. దీనివల్ల లోపల ఎంత గ్యాస్ మిగిలి ఉందో బయటి నుండే స్పష్టంగా చూడవచ్చు. అదేలాగంటే…
కాంపోజిట్ సిలిండర్ ప్రత్యేకతలు:
అత్యంత తేలికైనవి: ఈ సిలిండర్లు స్టీల్ లేదా ఇనుముతో కాకుండా ఫైబర్‌తో తయారవుతాయి. సాధారణ సిలిండర్ కంటే ఇవి సగం బరువు తక్కువగా ఉంటాయి. మహిళలు లేదా వృద్ధులు కూడా వీటిని సులభంగా తరలించవచ్చు.
పారదర్శకత (Transparency): కాంపోజిట్ సిలిండర్ బాడీ కొంచెం పారదర్శకంగా ఉంటుంది. కాంతిని ఉపయోగించి సిలిండర్‌లో గ్యాస్ ఏ స్థాయిలో ఉందో మనం గమనించవచ్చు. దీనివల్ల గ్యాస్ అయిపోక ముందే రీఫిల్ బుక్ చేసుకోవడం వీలవుతుంది.
తుప్పు పట్టదు (Rust-free): ఇనుప సిలిండర్లు తడి తగిలితే తుప్పు పట్టి నేలపై మరకలు పడతాయి. కానీ కాంపోజిట్ సిలిండర్లు ఫైబర్‌తో తయారవ్వడం వల్ల వీటికి తుప్పు పట్టే ప్రసక్తే లేదు, దీనివల్ల వంటగది శుభ్రంగా ఉంటుంది.
ఎక్కువ సేఫ్: ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నా, ఇవి పేలవు. అధిక ఉష్ణోగ్రత వద్ద ఈ ఫైబర్ కరిగిపోయి గ్యాస్ మెల్లగా బయటకు వస్తుంది తప్ప, ప్రెజర్ పెరిగి సిలిండర్ ముక్కలు ముక్కలుగా చెల్లాచెదురు కాదు.
ఆకర్షణీయమైన డిజైన్: ఇవి చూడటానికి చాలా స్టైలిష్‌గా, ఆధునిక రంగుల్లో ఉంటాయి. 5 కేజీలు, 10 కేజీల పరిమాణాల్లో ఇవి లభిస్తాయి. చిన్న కుటుంబాలకు లేదా బ్యాచిలర్లకు ఇవి ఎంతో అనుకూలమైనవి.
కాంపోజిట్ సిలిండర్ల సెక్యూరిటీ డిపాజిట్ సాధారణ సిలిండర్ల కంటే కొంచెం ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటికున్న భద్రత, సౌకర్యాల దృష్ట్యా ఇది ఒక మంచి పెట్టుబడి. మీరు కూడా పాత సిలిండర్‌ను మార్చుకుని ఈ కొత్త టెక్నాలజీని పొందవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి