ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఇండియన్ యాప్ “చింగారి”

| Edited By: Pardhasaradhi Peri

Jun 23, 2020 | 11:18 AM

టిక్ టాక్ కు పోటీగా ఇండియన్ యాప్ వచ్చేసింది. రావడంతోనే ఈ “చింగారి” యాప్ దూసుకుపోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చూసిన ఈ యాప్ కు మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాదు.. “చింగారి” యాప్ మార్కెట్లో సెన్సేష‌న్‌గా మారిపోయింది. “బైకాట్ చైనా” నినాదం త‌ర్వాత “చింగారి” యాప్‌కు మ‌రింత ప్రాచుర్యం ల‌భించింది. గ‌డిచిన మూడు రోజుల్లోనే దీన్ని 5 ల‌క్ష‌ల మంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో […]

ట్రెండింగ్‌లో దూసుకుపోతున్న ఇండియన్ యాప్ చింగారి
Follow us on

టిక్ టాక్ కు పోటీగా ఇండియన్ యాప్ వచ్చేసింది. రావడంతోనే ఈ “చింగారి” యాప్ దూసుకుపోతోంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చూసిన ఈ యాప్ కు మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాదు.. “చింగారి” యాప్ మార్కెట్లో సెన్సేష‌న్‌గా మారిపోయింది.

“బైకాట్ చైనా” నినాదం త‌ర్వాత “చింగారి” యాప్‌కు మ‌రింత ప్రాచుర్యం ల‌భించింది. గ‌డిచిన మూడు రోజుల్లోనే దీన్ని 5 ల‌క్ష‌ల మంది గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకున్నారు. దీంతో గూగుల్ ప్లే స్టోర్‌లో “చింగారి” ట్రెండింగ్‌లోకి నిలిచింది.

ట్రెండింగ్ లోకి రావడంపై “చింగారి” యాప్ స‌హ వ్య‌వ‌స్థాప‌కుడు బిశ్వాత్మ నాయ‌క్ ఆనందాన్ని వ్యక్తం చేశారు. భార‌తీయులు ఇప్పుడు టిక్‌టాక్‌కు ప్ర‌త్యామ్నాయం వెతుకుతున్నారని.. అయితే మేము అందరి అంచ‌నాల‌కు మించి “చింగారి”ను రూపొందించామని ప్రకటించారు. ఇందులో చాలా అంశాలను జోడించినట్లుగా తెలిపారు.

గతంలో.. టిక్‌టాక్‌కు పోటీగా వ‌చ్చిన మిట్రాన్ ఎన్నో రోజులు నిల‌బ‌డ‌లేదు. డౌన్‌లోడ్ల‌తో దూసుకుపోతున్న ఆ యాప్‌ను గ‌తంలో గూగుల్ ప్లే స్టోర్ నుంచి తొల‌గించిన విష‌యం తెలిసిందే.