
ప్రస్తుతం భారతదేశంలో ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. ముఖ్యంగా ఈ రేట్లు మరింత పెరగవని నిపుణులు అంటున్నారు. అయితే ఆర్‌బీఐ వరుసగా రెండోసారి రెపో రేట్‌ను నిలిపివేసిన నేపథ్యంలో, బ్యాంకులు ఈ డిపాజిట్లపై వడ్డీ రేటును ఇకపై పెంచవని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. అలాగే కొన్ని బ్యాంకులైతే ఇప్పటికే ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను తగ్గిస్తున్నాయి. జూన్ 1, 2023న, పంజాబ్ నేషనల్ బ్యాంక్ (పీఎన్‌బీ) తన రేట్లను ఒక సంవత్సరం కాలపరిమితికి తగ్గించింది. గతేడాది ఏప్రిల్ నుంచి ఆర్‌బీఐ రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) పెంచి 6.5 శాతానికి పెంచింది. తదనుగుణంగా, ఎక్కువ మంది కస్టమర్లను ఆకర్షించడానికి బ్యాంకులు తమ రేట్లను పెంచాయి. అయితే ఈ వడ్డీ రేట్ల పెంపును ప్రత్యేకంగా కొన్ని పథకాల ద్వారా బ్యాంకులు అమలు చేస్తున్నాయి. జూన్ 30తో ఆ ప్రత్యేక పథకాల గడువు ముగుస్తుంది. ప్రత్యేక వడ్డీ రేట్లను అందించే ఆ మూడు పథకాలు ఏంటో ఓ సారి తెలుసుకుందాం.
దేశంలో అతిపెద్ద రుణదాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) అమృత్ కలశ్ ఎఫ్‌డీ రిటైల్ టర్మ్ డిపాజిట్ పథకం జూన్ చివరి వరకు చెల్లుబాటు అవుతుంది. ఎస్‌బీఐ అమృత్ కలశ్ ఎఫ్‌బీ స్కీమ్ 400 రోజుల ప్రత్యేక వ్యవధితో వస్తుంది. ఈ స్కీమ్ ద్వారా సాధారణ ప్రజలకు 7.10 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్‌లకు 7.60 శాతం వడ్డీ రేటు లభిస్తుంది. ఇది ప్రామాణిక వర్తించే రేటు కంటే 50 బీపీఎస్ ఎక్కువ. అయితే ఈ పథకంలో పెట్టుబడి పెట్టేందుకు జూన్ 30 వరక గడువు ఉన్నట్లు ఎస్‌బీఐ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.
ఇండియన్ బ్యాంక్ ఇండ్ సూపర్ 400 డేస్ పేరుతో తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకాన్ని జూన్ 30, 2023 వరకు పొడిగించింది. ఈ పథకం ద్వారా ఇండియన్ బ్యాంక్ ఇప్పుడు సాధారణ ప్రజలకు 7.25 శాతం వడ్డీ రేటును అలాగే సీనియర్ సిటిజన్‌లకు 7.75 శాతం వడ్డీ రేటును అందిస్తుంది.
ఎస్‌బీఐ వుయ్ కేర్ పథకం ముఖ్యంగా సీనియర్ సిటిజన్‌లకు మాత్రమే ఉద్దేశించిన తీసుకొచ్చారు. ఈ పథకం 5 సంవత్సరాల నుంచి 10 సంవత్సరాల కాల వ్యవధితో వస్తుంది. ఎస్‌బీఐ వుయ్ కేర్ ఎఫ్‌డీ జూన్ 30, 2023 వరకు పరిమిత కాల వ్యవధిలో సీనియర్ సిటిజన్‌లకు 7.50 శాతం వడ్డీ రేటును అందిస్తోంది. ఈ ప్రోగ్రామ్‌ను మే 2020లో ప్రారంభించారు. అనేక పొడిగింపుల తర్వాత జూన్ 30, 2023 వరకు ఈ పథకంలో చేరడానికి గడువుగా ఉంది.
మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం