SBI Mutual Funds: ఈ లెక్క చూస్తే మతిపోతోంది.. రూ. 20వేలతో రూ. 32.61లక్షల సంపాదన.. అది కూడా ఐదేళ్లలోనే..

|

Jun 03, 2024 | 4:22 PM

మన దేశంలో ప్రముఖ బ్యాంకు అయిన ఎస్బీఐ అనేక రకాల మ్యూచువల్ ఫండ్స్ ను అందిస్తోంది. ఇది మన దేశంలో అతి పెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)గా ఉంది. ఇది అనేక రకాల మ్యూచువల్ ఫండ్స్ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో కొన్నిఎస్ఐపీలు గత కొన్నేళ్లుగా అధిక మొత్తంలో రిటర్న్‌లు ఇచ్చాయి. గత ఐదేళ్ల పనితీరును పరిశీలిస్తే, ఎస్బీఐ పీఎస్‌యూ ఫండ్, ఎస్బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఎస్బీఐ కాంట్రా ఫండ్ టాప్ పెర్ఫార్మర్స్‌గా ఉన్నాయి.

SBI Mutual Funds: ఈ లెక్క చూస్తే మతిపోతోంది.. రూ. 20వేలతో రూ. 32.61లక్షల సంపాదన.. అది కూడా ఐదేళ్లలోనే..
Mutual Fund
Follow us on

ఇటీవల కాలంలో మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడులు పెట్టే వారి సంఖ్య బాగా పెరుగుతోంది. వాటిల్లో రిస్క్ ఉందని తెలిసినా అందరూ వీటిల్లో పెట్టుబడులు పెడుతున్నారు. అందుకు ప్రధాన కారణం మ్యూచువల్ ఫండ్స్ వచ్చే అధిక రాబడే. మ్యూచువల్ ఫండ్స్ లో చాలా రకాలు అందుబాటులో ఉన్నా.. ఎక్కువగా రిస్క్ తక్కువ ఉండే సిస్టమాటిక్ ఇన్వెస్ట్ మెంట్ ప్లాన్(ఎస్ఐపీ)లోనే ఎక్కువ మంది పెట్టుబడులు పెడుతున్నారు. ఈ ఎస్ఐపీల్లో కూడా వందల రకాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. వాటిల్లో ఏది బెస్ట్? ఏది అధిక రాబడినిస్తుంది? అనేది అంచనా వేయడం అంత సులభం కాదు. అయితే మార్కెట్ పై అవగాహన ఉన్న వారికి ఇది అర్థమవుతుంది. అయితే మన దేశంలో ప్రముఖ బ్యాంకు అయిన ఎస్బీఐ అనేక రకాల మ్యూచువల్ ఫండ్స్ ను అందిస్తోంది. ఇది మన దేశంలో అతి పెద్ద అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ(ఏఎంసీ)గా ఉంది. ఇది అనేక రకాల మ్యూచువల్ ఫండ్స్ పథకాలను అమలు చేస్తోంది. వాటిలో కొన్నిఎస్ఐపీలు గత కొన్నేళ్లుగా అధిక మొత్తంలో రిటర్న్‌లు ఇచ్చాయి. గత ఐదేళ్ల పనితీరును పరిశీలిస్తే, ఎస్బీఐ పీఎస్‌యూ ఫండ్, ఎస్బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్, ఎస్బీఐ కాంట్రా ఫండ్ టాప్ పెర్ఫార్మర్స్‌గా ఉన్నాయి. ఈ మూడు ఫండ్లలో రూ. 10,000, రూ. 20,000 నెలవారీ సిప్(ఎస్ఐపీ) చేయడం ద్వారా ఎంత మొత్తం రాబడి వస్తుందో తెలుసుకుందాం..

ఎస్బీఐ పీఎస్‌యూ ఫండ్..

ఈ థీమాటిక్ ఈక్విటీ పీఎస్‌యూ ఫండ్ ఐదేళ్లలో 41.30 శాతం వార్షిక రిటర్న్‌(XIRR) లను ఇచ్చింది. ఈ ఫండ్ అసెట్ అండర్ మేనేజ్మెంట్ రూ. 2,352 కోట్లు, దాని నికర ఆస్తి విలువ రూ. 35.09. జనవరి 2013లో ప్రారంభమైన ఈ ఫండ్‌లో కనీస ఎస్ఐపీ పెట్టుబడి రూ. 500 కాగా ఈ ఫండ్‌లో కనీస మొత్తం పెట్టుబడి రూ. 5,000గా ఉంది. లార్జ్ క్యాప్స్‌లో 44.68 శాతం, మిడ్ క్యాప్స్‌లో 24.78, స్మాల్ క్యాప్స్‌లో 21.14 శాతంతో ఈక్విటీల్లో 90.60 శాతం పెట్టుబడిని కలిగి ఉంది. ఎస్బీఐ, పవర్ గ్రిడ్, ఎన్టీపీసీ, హిందుస్థాన్ కాపర్ దీని పోర్ట్‌ఫోలియోలో అగ్ర స్టాక్‌లుగా ఉన్నాయి. ఈ ఫండ్‌ ప్రతి నెల రూ. 10,000 చొప్పున సిప్ చేస్తే ఐదేళ్లలో మొత్తం రూ. 6 లక్షల పెట్టుబడి అయ్యింది. దీనికి రాబడి ఏకంగా రూ.16.30 లక్షలు వచ్చింది. అలాగే ప్రతి నెల రూ. 20,000 సిప్ చేస్తే ఐదేళ్లలో మొత్తం పెట్టుబడి ఐదేళ్లలో రూ. 12 లక్షలు కాగా మొత్తం రాబడి రూ. 32.61 లక్షలు ఇచ్చింది.

ఎస్బీఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఫండ్..

ఈ ఫండ్ సెక్టోరల్ ఇన్‌ఫ్రా ఫండ్, ఇది ఐదేళ్ల కాలంలో 34.77 శాతం వార్షిక ఎస్ఐపీ రిటర్న్‌లను ఇచ్చింది.దీని అసెట్ అండర్ మేనేజ్మెంట్(ఏయూఎం) రూ. 2,794 కోట్లు కాగా, దాని ఎన్ఏవీ విలువ రూ. 51.76. ఈ ఫండ్‌లో కనీస ఎస్ఐపీ పెట్టుబడి రూ. 500 ఉండగా, దాని కనీస మొత్తం రాబడి రూ. 5,000 ఉంటుంది. ఫండ్ కు సంబంధించిన 88.85 శాతం పెట్టుబడులు ఆర్‌ఐఎల్, భారతీ ఎయిర్‌టెల్, లార్సెన్ అండ్ టర్బోతో ఈక్విటీలో ఉన్నాయి. ఈ ఫండ్‌లో ప్రతి నెల రూ. 10,000 చొప్పున సిప్ చేస్తే ఐదేళ్లలో రూ. 14.02 లక్షలు వచ్చింది. అదే రూ. 20,000 చొప్పున సిప్ చేస్తే ఐదేళ్లలో రూ. 28.05లక్షలు రాబడి వచ్చింది.

ఎస్బీఐ కాంట్రా ఫండ్..

కాంట్రా థీమ్‌లో పెట్టుబడి పెట్టే ఫండ్ ఐదేళ్ల కాలంలో 34.45 శాతం వార్షిక రాబడిని ఇచ్చింది.
ఈ ఫండ్ కు సంబంధించిన 88.87 శాతం పెట్టుబడులు ఈక్విటీలలో, 44.52 శాతం లార్జ్ క్యాప్స్‌లో.. 29.25 శాతం మిడ్ క్యాప్స్‌లో, 15.09 శాతం స్మాల్ క్యాప్స్‌లో ఉన్నాయి. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, గెయిల్ (ఇండియా), ఎస్‌బీఐ, నిఫ్టీ బ్యాంక్ దీని టాప్ హోల్డింగ్‌లు. ఈ ఫండ్ లో రూ. 10వేల చొప్పున ప్రతి నెలా ఎస్ఐపీ చేస్తే ఐదేళ్లలో రూ. 13.92లక్షలు వచ్చింది. అలాగే రూ. 20వేల చొప్పున ప్రతి నెలా సిప్ చేస్తే ఐదేళ్లలో రూ. 27.84లక్షలు వస్తుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..