
హీరో ఫ్లాష్ ఎల్ఎక్స్.. ప్రపంచంలో అతి పెద్ద ద్విచక్ర వాహన ఉత్పత్తిదారుల్లో ఒకటైన హీరో ఎలక్ట్రిక్ పలు రకాల విద్యుత్ స్కూటర్లను లాంచ్ చేస్తోంది. అందులో అత్యంత చవకైన ఎలక్ట్రిక్ స్కూటర్ హీరో ఫ్లాష్ ఎల్ఎక్స్. ఇది సింగిల్ చార్జ్ పై 85 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. దీనిలో 52.1V/30Ah రిమూవబుల్ బ్యాటరీ ఉంటుంది. 250 వాట్ల సామర్థ్యంతో ఎలక్ట్రిక్ మోటార ఉంటుంది. ఇది గరిష్టంగా గంటకు 25 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది. దీని ధర రూ. 59,640(ఎక్స్ షోరూం) ఉంటుంది.

ఒకాయా క్లాస్ ఐక్యూ ప్లస్.. ఈ మోడల్ ఎలక్ట్రిక్ స్కూటర్లో 1.4కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 250 వాట్ల బీఎల్డీసీ హబ్ మోటర్ తో శక్తిని పొందుతుంది. సింగిల్ చార్జ్ పై 70 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఇది ఫుల్ గా చార్జ్ అవడానికి నాలుగు నుంచి ఐదు గంటలు పడుతుంది. ఎల్ఈడీ హెడ్ లైట్లు, డేటైం రన్నింగ్ లైట్లు, డిజిటల్ డిస్ ప్లే ఉంటుంది. దీని ధర రూ. 74,499(ఎక్స్ షోరూం) ఉంటుంది.

జాయ్ జెన్ నెక్ట్స్ నాను ప్లస్.. జాయ్ కంపెనీ నుంచి వస్తున్న ఈ బైక్ లో 60V/36.4Ah డిటాచ్బుల్ బ్యాటరీ ప్యాక్ ఉంటుంది. 1500 వాట్ల సామర్థ్యంతో మోటార్ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 100కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. గరిష్టంగా గంటకు 55కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. దీనిలో 4.3 అంగుళాల కలర్ డిస్ ప్లే ఉంటుంది. మూడు రైడింగ్ మోడ్లు, యూఎస్బీ చార్జర్, బ్లూటూత్ కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి. దీని ధర రూ. 77,400 ఉంటుంది.

హాప్ లియో ఎల్ఎస్.. హాప్ స్టార్టప్ నుంచి వస్తున్న ఈ స్కూటర్ ధర రూ. 84,360(ఎక్స్ షోరూం)గా ఉంది. ఇది సింగిల్ చార్జ్ పై 95కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. 90ఎన్ఎం గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేసే ఎలక్ట్రిక్ మోటార్ ఉంటుంది. గరిష్ట వేగం గంటకు 25కిలోమీటర్లు. బ్యాటరీ ఫుల్ చార్జ్ అవడానికి మూడున్నర గంటలు సమయం పడుతుంది.

గోదావరి ఇబ్లూ ఫియో.. గతంతో ఎలక్ట్రిక్ త్రీ వీలర్లకే పరిమితమైన ఈ కంపెనీ ఇటీవల ద్విచక్రవాహనాలు కూడా తయారు చేస్తోంది. ప్రారంభ ధర రూ. 99,999(ఎక్స్ షోరూం)గా ఉంది. దీనిలో 2.52కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ఉంటుంది. ఇది సింగిల్ చార్జ్ పై 110 కిలోమీటర్ల రేంజ్ ఇస్తుంది. ఫుల్ చార్జింగ్ అవడానికి ఐదు గంటల 25 నిమిషాల టైం తీసుకుంటుంది. ఈ స్కూటర్ గంటకు 60కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలుగుతుంది.