Bike Maintenance: మీ బైక్ ఎప్పుడూ కొత్తగా మెరుస్తూ ఉండాలా? ఈ టిప్స్ పాటించండి చాలు..

|

Jul 19, 2024 | 3:44 PM

సాధారణంగా బైక్ ను వాటర్ వాష్ చేస్తుంటాం. అయితే బండికి ఎప్పుడూ కొత్తగా ఉంచాలంటే కేవలం వాష్ ఒకటి మాత్రమే సరిపోదు. పాలిష్ చేస్తుండాలి. వ్యాక్స్ అప్లై చేస్తూ ఉండాలి. దీని వల్ల బండి పెయింట్ పై ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుంది. దీంతో పాటు దుమ్మూ ధూళి నుంచి రక్షణ లభించడంతో పాటు యూవీ కిరణాలను కూడా సంరక్షించగలిగే కండీషనర్లు వినియోగించాలి.

Bike Maintenance: మీ బైక్ ఎప్పుడూ కొత్తగా మెరుస్తూ ఉండాలా? ఈ టిప్స్ పాటించండి చాలు..
Bike Cleaning
Follow us on

కొత్త బైక్ కొనడం ఒక ఎత్తు అయితే దానిని మెయింటేన్ చేయడం మరో ఎత్తు. దానిని ఎక్కువ కాలం కొత్తగా ఉంచుకోవాలని చాలా తాపత్రయపడుతుంటాం. ఏ చిన్న మచ్చా పడకుండా కాపాడుకుంటూ ఉంటాం. అయితే అధిక ఎండ, వర్షం, చలి కాలాల్లో బండి బయటే ఉండిపోతూ ఉంటే దాని రంగు త్వరగా ఫేడ్ అవుట్ అయిపోతూ ఉంటుంది. మరి బండిని ఎక్కువ కాలం కొత్తగా ఉంచుకోవాలంటే ఎలా? అందుకోసం మీకు ఉపయోగపడే టిప్స్ అందిస్తున్నాం. ఎటువంటి కష్టం లేకుండా సులభంగా చేయగలిగే టిప్స్ మీకు ఇవి.

బైక్ మెయింటెనెన్స్ టిప్స్..

సాధారణంగా బైక్ ను వాటర్ వాష్ చేస్తుంటాం. అయితే బండికి ఎప్పుడూ కొత్తగా ఉంచాలంటే కేవలం వాష్ ఒకటి మాత్రమే సరిపోదు. పాలిష్ చేస్తుండాలి. వ్యాక్స్ అప్లై చేస్తూ ఉండాలి. దీని వల్ల బండి పెయింట్ పై ప్రొటెక్టివ్ లేయర్ ఏర్పడుతుంది. దీంతో పాటు దుమ్మూ ధూళి నుంచి రక్షణ లభించడంతో పాటు యూవీ కిరణాలను కూడా సంరక్షించగలిగే కండీషనర్లు వినియోగించాలి.

బైక్ షెల్టర్..

మీరు బైక్ పార్కింగ్ విషయంలో జాగ్రత్త వహించాలి. ఎందుకంటే బండిని ఎండలో, లేదా వర్షంలో మరీ ముఖ్యంగా శీతాకాలంలో బయట ఎటువంటి కవర్ లేకుండా వదిలేస్తే పెయింట్ డల్ అయిపోతుంది. అంతే కాక ఐరన్ తుప్పు పట్టే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకే బండిని పార్క్ చేసేటప్పుడు తప్పనిసరిగా ఓ షెల్టర్ ను చూసుకోవాలి. లేదా పైనా కవర్ అయినా ఏర్పాటు చేసుకోవాలి.

మళ్లీ పెయింట్ వేయండి..

మీ బైక్ లుక్ నిర్ధేశించేది పెయింటే. కొన్ని సంవత్సరాలు వినియోగించిన తర్వాత అది సాధారణంగానే ఫేడ్ అవుట్ అయిపోతుంది. అందుకే అవకాశం ఉంటే బండిని రీపెయింట్ చేయడానికి ప్రయత్నించాలి. లేదా కనీసం కనీసం టచ్-అప్ పెయింట్ అయినా వేయించాలి. కొన్ని కొన్ని ప్రదేశాల్లో మాత్రమే అయితనా రీ పెయింట్ వేసేలా చూసుకోవాలి.

సూర్యరశ్మి నుంచి కాపాడేందుకు..

పెయింట్, వ్యాక్స్ వాడుతున్నప్పటికీ.. మీ బండిపై సూర్యరశ్మి చాలా త్వరగా పెయింట్ ఫేడ్ అవుట్ చేసేస్తుంది. అధిక శక్తితో నేల మీదకు వచ్చే యూవీ కిరణాల వల్ల బండి లుక్ దెబ్బతింటుంది. దీనికి యూవీ ప్రొటెక్టెంట్ స్ప్రేలు ఒక పరిష్కారాన్ని అందిస్తాయి. ఇది సూర్యరశ్మి వల్ల ప్లాస్టిక్ దెబ్బతినకుండా చేస్తుంది. సుమారు రూ.200 ఖరీదు చేసే బాటిల్ను గేజ్లు, విండ్ స్క్రీన్లు, ఏదైనా ఇతర ప్లాస్టిక్ బిట్ల పై ఉపయోగించవచ్చు.

లెదర్ సీట్ల కోసం..

బైక్ డార్క్ లెదర్ సీటు బీ బండి లుక్ ను పూర్తిగా మార్చేస్తుంది. ఇది సౌకర్యవంతంగా ఉండటమే కాకుండా మన్నికగా కూడా ఉంటుంది. అయితే దానిని సక్రమంగా మెయింటేన్ చేయాల్సి ఉంటుంది. నిర్లక్ష్యంగా ఉంటే అది ఎండిపోయి దాని మన్నిక దెబ్బతింటుంది. దానిని శుభ్రం చేయడానికి కేవలం నీరు మాత్రమే సరిపోదు. డీప్ క్లీనింగ్ సొల్యూషన్స్ వినియోగించాలి. ఇవి వల్ల మురికి, ధూళిని తొలగిస్తాయి. తరువాత కండీషనర్ వినియోగించాలి. దీని వల్ల తేమ తిరిగి చేరుతుంది. తోలును మృదువుగా ఉంచుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..