Telugu News Business These are the mistakes that should avoid to save big on taxes, check details in telugu
Tax Saving Tips: చివరి నిమిషంలో ఈ తప్పులు అస్సలు చేయకండి.. ట్యాక్స్ పేయర్స్ అలర్ట్‌గా ఉండాల్సిందే..
పన్ను చెల్లింపు, డబ్బును ఆదా చేసుకోవడానికి దూరదృష్టితో వ్యవహరించాలి. ఇందుకోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తద్వారా మీకు పన్ను ఆదా అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా సెక్షన్ 80సీ ప్రయోజనాలు, విభిన్న పెట్టుబడి మార్గాలు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఎంచుకోవడం ద్వారా మీకు మెరుగైన ప్రతిఫలాలు లభిస్తాయి. సాధారణంగా పన్ను చెల్లింపుల విషయంలో అందరూ కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి.
2023-24 ఆర్థిక సంవత్సం మార్చి 31తో ముగియనుంది. ఈ నేపథ్యంలో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపుల గురించి చెల్లింపుదారులు హడావుడి పడుతూ ఉంటారు. కొన్ని అంశాలను జాగ్రత్తగా పరిశీలించడం వల్ల పన్నును ఆదా చేసుకోవచ్చు. చివరి నిమిషంలో కంగారుగా లెక్కలు వేయడం వల్ల లేనిపోని తప్పులు జరగవచ్చు. అందుకు ప్రణాళికాబద్ధంగా వ్యవహరించాలి. పన్ను చెల్లింపు, డబ్బును ఆదా చేసుకోవడానికి దూరదృష్టితో వ్యవహరించాలి. ఇందుకోసం ముందుగానే ప్రణాళిక సిద్ధం చేసుకోవాలి. తద్వారా మీకు పన్ను ఆదా అవకాశాలు పెరుగుతాయి. ముఖ్యంగా సెక్షన్ 80సీ ప్రయోజనాలు, విభిన్న పెట్టుబడి మార్గాలు, దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలను ఎంచుకోవడం ద్వారా మీకు మెరుగైన ప్రతిఫలాలు లభిస్తాయి. సాధారణంగా పన్ను చెల్లింపుల విషయంలో అందరూ కొన్ని తప్పులు చేస్తుంటారు. వాటిని నివారించడానికి కొన్ని జాగ్రత్తలు పాటించాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం..
పన్నుచెల్లింపునకు చివరి నిమిషం వరకు వేచి ఉండటం సరికాదు. దానివల్ల కంగారుగా నిర్ణయాలు తీసుకుంటారు. ఆదా అవకాశాలను కోల్పోతారు. కాబట్టి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలోనే పన్ను ప్రణాళిక ప్రారంభించాలి.
ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 80సీ కింద మినహాయింపులు ఉంటాయి. ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్ (ఈఎల్ఎస్ఎస్), పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (పీపీఎఫ్), నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ (ఎన్ ఎస్ సీ) వంటి వాటిలో పెట్టుబడులకు పన్ను మినహాయింపు ఉంటుంది. సెక్షన్ 80సీ కింద రూ. 1.5 లక్షల వరకూ పరిమితి ఉంది. ఈ సెక్షన్ కింద పన్ను పొదుపులను పెంచుకోవాలి.
పన్ను ఆదా చేసే పెట్టుబడులకు అవసరమైన అన్ని పత్రాలు సిద్ధంగా ఉంచుకోవాలి. పెట్టుబడి రశీదులు, ప్రీమియం చెల్లింపులు, రుణ పత్రాలు మొదలైనవి చాలా ముఖ్యం. అసంపూర్ణ డాక్యుమెంటేషన్ కారణంగా పన్ను మినహాయింపులు కోల్పోయే ప్రమాదం ఉంది.
పన్నును ఆదా చేయడానికి సెక్షన్ 80 సీతో పాటు మరికొన్ని మార్గాలు కూడా ఉన్నాయి. 80డీ (ఆరోగ్య బీమా ప్రీమియాలు), 80 ఈ (విద్యా రుణాల వడ్డీ), 80 జి (నిర్దిష్ట నిధులకు విరాళాలు) వంటి వాటిని కూడా పరిశీలించాలి.
మీ దీర్ఘకాలిక ఆర్థిక లక్ష్యాలకు అనుగుణంగా పన్ను ఆదా చేసే పెట్టుబడులు ఉండాలి. కేవలం పన్ను ఆదా చేయడం కోసమే పెట్టుబడులు పెట్టకూడదు. ఈ విషయంలో తెలివిగా నిర్ణయం తీసుకోవాలి.
పీపీఎఫ్, ఎన్ఎస్ సీ వంటి పన్ను పొదుపు సాధనాలు అందరికీ తెలుసు. వీటితో పాటు అధిక రాబడి, అదనపు ప్రయోజనాల కోసం ఈఎల్ఎస్ఎస్, ఎన్ పీఎస్ (నేషనల్ పెన్షన్ సిస్టమ్), యూఎల్ఐపీఎస్ (యూనిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ ప్లాన్‌లు) వంటి వాటిని కూడా ఎంపిక చేసుకోవాలి.
నిర్ధిష్టంగా జీతం రాని వ్యక్తులకు కొన్ని ఆదా ప్రయోజనాలు ఉన్నాయి. అంటే ఫ్రీలాన్సర్లు, వ్యాపార యజమానులకు తమ వ్యాపార ఖర్చులు మొదలైన వాటికి పన్ను తగ్గింపు అవకాశాలు ఉన్నాయి. వాటినన్నింటినీ ఉపయోగించుకోవాలి.
పన్ను ఆదా చేయడానికి డబ్బంతా ఒకే చోట పెట్టుబడి పెట్టకూడదు. దాన్ని వివిధ మార్గాలకు కేటాయింపులు చేయాలి.
పన్ను ఆదా లక్ష్యాలను చేరుకోవడానికి అవసరమైన దానికంటే ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా పెట్టుబడి పెట్టండి.
. మీరు పెట్టుబడులను ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి. మరిన్ని ప్రయోజనాలు కలిగే అవకాశం ఉంటే, నిధులను తిరిగి కేటాయించవచ్చు.
. పన్ను సలహాదారుడు లేదా ఆర్థిక ప్రణాళికదారుడికి సంప్రదించడం చాలా అవసరం. స్నేహితుడు, కుటుంబ సభ్యుడు చేసే పనిని కాపీ చేయవద్దు. ఎందుకుంటే ఎవరి పన్ను ప్రణాళికా విధానం వారి బట్టే ఉంటుంది.