February 1st: ఇవి గమనించారా.? ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్‌ ఇవే..

ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక అంశాలకు సంబంధించిన ఈ నెలలో కీలక మార్పులు ఉండనున్నాయి. ఈ మధ్యంతర బడ్జెట్‌ వల్ల ప్రజల ఫైనాన్షియల్ అంశాలపై ప్రభావం చూపుతుంది. అలాగే.. పలు బ్యాంకులు ప్రకటించిన పథకాలకు కూడా..

February 1st: ఇవి గమనించారా.? ఫిబ్రవరి 1 నుంచి మారనున్న రూల్స్‌ ఇవే..
February 1st

Updated on: Jan 28, 2024 | 2:52 PM

ఆర్థిక లావాదేవీలకు సంబంధించి ప్రతీ నెల మార్పులు చేర్పులు కచ్చితంగా ఉంటాయి. బ్యాంకుల వడ్డీ రేట్లలో మార్పులు మొదలు, పథకాల అమలు వరకు కొత్త నెలలో కొన్ని మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అయితే అన్ని నెలలతో పోల్చితే వచ్చే నెలలో చాలా ప్రత్యేకంగా మారనుంది. ఫిబ్రవరి నెల ఫైనాన్స్‌కు సంబంధించి ఎంతో కీలకమని చెప్పాలి. దీనికి ప్రధాన కారణం కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెడుతుండడమే.

ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ప్రభుత్వం మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనున్న విషయం తెలిసిందే. దీంతో ఆర్థిక అంశాలకు సంబంధించిన ఈ నెలలో కీలక మార్పులు ఉండనున్నాయి. ఈ మధ్యంతర బడ్జెట్‌ వల్ల ప్రజల ఫైనాన్షియల్ అంశాలపై ప్రభావం చూపుతుంది. అలాగే.. పలు బ్యాంకులు ప్రకటించిన పథకాలకు కూడా జనవరి 30తో గడువు ముగియనుంది. ఇంతకీ ఫిబ్రవరి 1వ తేదీ నుంచి ఎలాంటి అంశాల్లో మార్పులు రానున్నాయో ఇప్పుడు చూద్దాం..

* జాతీయ రహదారులపై ఉండే టోల్‌ గేట్స్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కైవేసీ లేని ఫాస్టాగ్‌లు జనవరి 31వ తేదీ తర్వాత డీయాక్టివేట్ కానున్నాయి. ఈ నేపథ్యంలోనే ఫాస్టాగ్‌లన్నింటికీ కేవైపీ చేసుకోవాలని అధికారులు తెలిపారు. ప్రస్తుతం అధికారిక లెక్కల ప్రకారం 1.2 కోట్ల డూప్లికేట్ ఫాస్టాగ్‌లు ఉన్నట్లు తెలుస్తోంది. వీటిని గుర్గించడానికే కేవైసీని తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

* ఫిబ్రవరి నెల నుంచి మారనున్న మరో రూల్ సావరిన్‌ గోల్డ్‌ బాండ్‌కు సంబంధించినది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2023-24 ఆర్థిక సంవత్సరంలో సావరిన్ గోల్డ్ బాండ్ చివరి విడతను ఫిబ్రవరిలో విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి ఎస్‌జీబీ 2023-24 సిరీస్‌4 ఫిబ్రవరి 12వ తేదీన ఓపెన్‌ కానుంది.

* నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ కింద పెట్టుబడిగా పెట్టిన నిధులను పాక్షికంగా ఉపసంహరించుకోవడానికి మార్గదర్శకాలను నిర్దేశిస్తూ పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ జనవరిలో మాస్టర్ సర్క్యులర్‌ను జారీ చేసింది. ఈ నిబంధనలు ఫిబ్రవరి 1వ తేదీ నుంచి అమల్లోకి రానుంది. మొదటి ఇళ్లు కొనుగోలు లేదా నిర్మాణం కోసం మాత్రమే చందాదారులు పాక్షిక ఉపసంహరణలు చేసుకోవచ్చని పెన్షన్ బాడీ స్పష్టం చేసింది.

* స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా హోమ్‌ లోన్‌పై ప్రాసెసింగ్ ఫీజు, రాయితీలకు జనవరి 31వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. ఈ రాయితీ ఫ్లెక్సీపై, ఎన్‌ఆర్‌ఐ, నాన్‌ లైఫ్‌, ప్రివిలేజ్‌ వంటి వారికి వర్తిస్తుంది. ఇదిలా ఎస్‌బీఐ హోమ్‌ లోన్స్‌పై భారీగా రాయితీలను అందిస్తోంది. 65 bps కంటే తక్కువ వడ్డీ రేట్లకు గృహ రుణాలను అందిస్తోన్న విషయం తెలిసిందే.

* పంజాబ్‌ అండ్‌ సింధ్‌ బ్యాంక్‌ ”ధన్ లక్ష్మి 444 డేస్’ పేరుతో తీసుకొచ్చిన ప్రత్యేక ఫిక్స్‌డ్ డిపాజిట్ పథకానికి జనవరి 31, 2024ని చివరి తేదీగా నిర్ణయించారు. అంతకు ముందు నవంబర్ 30, 2023 వరకే చివరి తేదీ ఉండగా.. దానిని జనవరి 31, 2024 వరకు పొడిగించింది. ఈ పథకంలో భాగంగా పెట్టుబడి పెట్టేవారికి 7.4%, సూపర్ సీనియర్లకు ఇది 8.05% చొప్పు వడ్డీ రేటు అందిస్తోంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..