Upcoming Two-Wheelers: ఆగస్టులో లాంచ్‌ కానున్న టాప్‌ బైక్‌లు, స్కూటర్లు ఇవే.. ఓ లుక్కేయండి..

|

Aug 04, 2023 | 4:00 PM

మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అగ్రశ్రేణి ద్విచక్ర వాహన తయారీదారులు కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అత్యాధునిక ఫీచర్లతో పాటు మెరుగైన ఇంజిన్‌ సామర్థ్యంతో సరికొత్తగా బైక్‌లు, స్కూటర్లను ఆవిష్కరించేందుకు సమాయత్తమవుతున్నాయి. వీటిల్లో విద్యుత్‌శ్రేణి వాహనాలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. ఈ నెలలో మార్కెట్లోకి రానున్న బెస్ట్‌ బైక్‌లు, స్కూటర్ల గురించి ఇప్పుడు చూద్దాం..

Upcoming Two-Wheelers: ఆగస్టులో లాంచ్‌ కానున్న టాప్‌ బైక్‌లు, స్కూటర్లు ఇవే.. ఓ లుక్కేయండి..
Royal Enfield Bullet 350
Follow us on

కొత్త సంవత్సరం నిన్నమొన్న వచ్చినట్లు ఉంది. కానీ 2023 సంవత్సరంలో ఏడు నెలలు గడిచిపోయాయి. ఆగస్టు నెలలో ప్రవేశించాం. ఈ నెలలో కొత్త లాంచ్‌ వాహనాల గురించి ఆటో రంగం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ముఖ్యంగా ద్విచక్రవాహనాలు ఎక్కువ సంఖ్యలోనే మార్కెట్లోకి రానున్నాయి. మారుతున్న వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా అగ్రశ్రేణి ద్విచక్ర వాహన తయారీదారులు కొత్త ఉత్పత్తులను లాంచ్‌ చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. అత్యాధునిక ఫీచర్లతో పాటు మెరుగైన ఇంజిన్‌ సామర్థ్యంతో సరికొత్తగా బైక్‌లు, స్కూటర్లను ఆవిష్కరించేందుకు సమాయత్తమవుతున్నాయి. వీటిల్లో విద్యుత్‌శ్రేణి వాహనాలు కూడా ఎక్కువగానే ఉండే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈ నెలలో మార్కెట్లోకి రానున్న బెస్ట్‌ మోడల్‌ బైక్‌లు, స్కూటర్ల గురించి ఇప్పుడు చూద్దాం.. వాటి స్పెసిఫికేషన్లు, ఫీచర్లను పరిశీలిద్దాం..

రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350..

యువతకు కలల బైక్‌ రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌. గ్లోబల్‌ వైడ్‌ ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ ఉన్న ఈ బ్రాండ్‌ నుంచి ఆగస్టులో ఓ కొత్త మోడల్‌ బైక్‌ లాంచ్‌ కానుంది. గత మోడళ్లకంటే మెరుగైన పనితీరుతో, అత్యాధునిక ఫీచర్లతో ఎన్‌ఫీల్డ్‌ బుల్లెట్‌ 350ని ప్యాక్‌ చేసినట్లు కంపెనీ ప్రకటించింది. ఈ రాయల్‌ ఎన్‌ ఫీల్డ్‌ బుల్లెత్‌ 350 ప్రారంభ ధర రూ. 1.80లక్షల నుంచి ఉండే అవకాశం ఉంది.

ఏథర్ 450ఎస్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

దేశీయ ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీదారైన ఏథర్‌ ఎనర్జీ తన కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్‌ను లాంచ్‌ చేసేందుకు ముహూర్తం ఫిక్స్‌ చేసింది. ఏథర్ 450ఎస్‌ పేరుతో ఈ బైక్‌ విడుదలయ్యే అవకాశం ఉంది. తక్కువ ధరలో అత్యుత్తమ ఫీచర్లు, స్పెసిఫికేషన్లతో ఏథర్‌ ఈ స్కూటర్‌ ను అందుబాటులోకి తెస్తోంది. దీనిలో 3kWh బ్యాటరీ ఉంటుంది. అంతేకాక ఎల్ఈడీ కన్సోల్‌, నావిగేషన్‌ సిస్టమ్‌ ఉంటుంది. మంచి రేంజ్‌ కూడా ఇస్తోందని కంపెనీ చెబుతోంది.

ఓలా ఎస్‌1 ప్రో క్లాసిక్ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌..

దేశంలోని అగ్రశ్రేణి ఎలక్ట్రిక్‌ స్కూటర్ల తయారీదారైన ఓలా ఎలక్ట్రిక్‌ నుంచి మరో స్కూటర్‌ ఈ నెలలో లాంచ్‌ అయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే రేంజ్‌, పనితీరు, ఫీచర్లలో దేశంలో టాప్‌ సెల్లర్‌ గా ఓలా స్కూటర్లు దూసుకుపోతున్నాయి. రాబోయే కొత్త స్కూటర్‌ పేరు ఓలా ఎస్‌1 ప్రో క్లాసిక్‌ గా నామకరణం చేశారు. దీనిలో 4 kWh బ్యాటరీ కెపాసిటీ ఉంటుందని ఇది సింగిల్‌ చార్జ్‌ పై ఏకంగా 181 కిలోమీటర్లు నాన్‌ స్టాప్‌గా ప్రయాణించగలుగుతుందని కంపెనీ ప్రకటించింది. దీనిలో 8500వాట్ల సామర్థ్యంతో కూడిన మోటార్‌ ఉంటుంది.

హోండా స్పోర్టీ 160సీసీ బైక్..

ఈ హోండా స్పోర్టీ 160సీసీ బైక్ ఆగస్ట్‌లో విడుదల కానుంది. అయితే, కచ్చితమైన తేదీని ఇంకా వెల్లడించలేదు. ఈ బైక్‌లో 162సీసీ ఎయిర్-కూల్డ్ ఇంజిన్ అమర్చారు. ఇది 7,500ఆర్‌పీఎం వద్ద 12.9 హెచ్‌పీ, 5,500ఆర్‌పీఎం వద్ద 14ఎన్‌ఎం టార్క్‌ని ఉత్పత్తిచేస్తుంది. ఇది గత మోడళ్లకంటే చాలా భిన్నంగా ఉంటుందని కంపెనీ పేర్కొంది. స్లైలిష్‌ డిజైన్‌ తో పాటు, అత్యాధునిక ఫీచర్లతో ఈ బైక్‌న ప్యాక్‌ చేసినట్లు కంపెనీ ప్రకటించింది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..