Nps vastalya: పిల్లలకూ పెన్షన్.. అవసరం లేదంటున్న నిపుణులు.. కారణమిదే..

|

Oct 14, 2024 | 5:22 PM

ఎన్ పీఎస్ వాత్సల్య పేరుతో రూపొందించిన ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే తల్లిదండ్రులకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని ఆమె తెలిపారు. అయితే దీనికి ఆదరణ అంతగా లభించలేదు. పిల్లల కోసం ఇది మంచి పెట్టుబడి పథకం కాదని పలువురు నిపుణులు చెబుతున్నారు.

Nps vastalya: పిల్లలకూ పెన్షన్.. అవసరం లేదంటున్న నిపుణులు.. కారణమిదే..
Nps Vatsalya Scheme
Follow us on

పిల్లల బంగారు భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అనేక జాగ్రత్తలు తీసుకుంటారు. వారికి ఉన్నత చదువులు చెప్పించడంతో పాటు ఆర్థికంగా భరోసా ఇచ్చే వివిధ పథకాలలో పెట్టుబడులు పెడతారు. తద్వారా వారికి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా ఉండటానికి ప్రణాళికలు రూపొందిస్తారు. అయితే కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన యూనియన్ బడ్జెట్ లో పిల్లల కోసం కొత్త పథకాన్ని తీసుకువచ్చింది. ఎన్ పీఎస్ వాత్సల్య పేరుతో రూపొందించిన ఈ పథకాన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రారంభించారు. పిల్లల భవిష్యత్తు కోసం దీర్ఘకాలం పెట్టుబడి పెట్టాలనుకునే తల్లిదండ్రులకు ఇది చాలా ఉపయోగంగా ఉంటుందని ఆమె తెలిపారు. అయితే దీనికి ఆదరణ అంతగా లభించలేదు. పిల్లల కోసం ఇది మంచి పెట్టుబడి పథకం కాదని పలువురు నిపుణులు చెబుతున్నారు. దానికి గల ఏడు కారణాలను తెలుసుకుందాం.

తక్కువ మొత్తంలో ఈక్విటీ..

ఎన్ పీఎస్ వాత్సల్య పథకంలో ఆటో, క్రియాశీల ఎంపిక విధానాలు ఉంటాయి. వీటికి కింద ఈక్విటీకి గరిష్టంగా 75 శాతం సహకారం అందిస్తారు. 18 ఏళ్ల వరకూ లాక్ ఇన్ ఉండడంతో పెట్టుబడి ఎంపికకు ఈక్విటీ కేటాయింపు తక్కువగా ఉంటుంది. దీని వల్ల తక్కువ కార్పస్ కు దారి తీయవచ్చు.

పింఛన్..

వాత్సల్య పథకంలో పిల్లల వయసు 18 ఏళ్ల వచ్చినప్పుడు రెండు రకాల ఎంపికలు చేసుకోవచ్చు. ఒక దాని ప్రకారం పింఛన్ పథకం నుంచి బయటకు రావచ్చు. లేదా పెన్షన్ ఖాతాను సాధారణ ఎన్ పీఎస్ టైర్ 1 ఖాతాగా మార్చుకోవచ్చు. పథకం నుంచి బయటకు వచ్చేవారికి 20 శాతం ఏకమొత్తంగా చెల్లిస్తారు. మిగిలిన 80 శాతం యాన్యూటీని కొనుగోలు చేయడానికి ఉపయోగిస్తారు. అలాగే పిల్లవాడిని పెన్షన్ (యాన్యుటీ) 18 ఏళ్ల నుంచి ప్రారంభమవుతుంది. అయితే పిల్లల విద్యాఖర్చుల కోసం ఈ సమయంలో పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమవుతాయి. 18 ఏళ్ల వయసులో పింఛన్ ఇవ్వడం వల్ల దీర్ఘకాలిన పొదుపు లక్ష్యం దెబ్బతింటుంది.

పాక్షిక ఉపసంహరణలు..

పెన్షన్ పథకం నిబంధనల ప్రకారం పాక్షిక ఉపసంహరణకు మూడుసార్లు అవకాశం ఉంటుంది. అంటే బాలుడికి 18 ఏళ్లు వచ్చే లోపు దీన్ని ఉపయోగించుకోవచ్చు. అంటే ఉన్నత చదువులకు డబ్బు అవసరమైనప్పుడు ఉపసంహరణకు వీలుండదు. చాలా మంది తల్లిదండ్రులకు ఆ సమయంలోనే డబ్బులు అవసరమవుతాయి.

విత్ డ్రా పరిమితి..

వాత్సల్య పథకం మెచ్యురిటీ సమయంలో కార్బస్ ఫండ్ రూ.2.5 లక్షల కంటే తక్కువగా ఉంటేనే ఏక కాలంలో మొత్తం విత్ డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. అంతకంటే ఎక్కువ ఉంటే వీలు కాదు. ఉదాహరణకు ఎన్ పీఎస్ కార్బస్ గా రూ.3 లక్షలున్న బాలుడు, దానిలో కేవలం రూ.60 వేలు మాత్రమే విత్ డ్రా చేసుకోగలడు. మిగిలిన రూ.2.40 లక్షలతో యాన్యుటీ కొనుగోలు చేయాలి.

సుధీర్ఘ లాక్ పిరియడ్..

పిల్లవాడికి 18 ఏళ్లు వచ్చే వరకూ లాక్ ఇన్ పిరియడ్ కొనసాగుతుంది. అనంతరం అతడు టైర్ 1 ఎన్పీఎస్ ఖాతాకు మారాలంటే సాధారణ ఎన్పీఎస్ ఖాతా లాక్ ఇన్ వ్యవధి కొనసాగుతుంది. 60 ఏళ్ల వరకూ పింఛన్ ప్రయోజనాల కోసం ఈ పథకాన్ని ఎంచుకున్న వారికి జీవితకాల లాన్ ఇన్ కొనసాగుతుంది.

పింఛన్ పథకం..

పిల్లలు 18 ఏళ్లు నిండిన తర్వాత ఉన్నత చదువులకు వెళతారు. ఆ సమయంలో తల్లిదండ్రులకు ఖర్చులు పెరుగుతాయి. కానీ వాత్సల్య పథకం ద్వారా ఆ సమయంలో డబ్బులు లభించవు, ఎందుకంటే ఇది ఫించన్ కోసం ఉద్దేశించిన స్కీమ్.

స్పష్టత కరువు..

ఎన్పీఎస్ వాత్సల్య పథకంలో పెట్టుబడులు పెడితే లభించే ఆదాయపు పన్ను మినహాయింపులపై సరైన స్పష్టత లేదు. ఇది పన్ను చెల్లింపుదారులకు ఇబ్బంది కలిగించే అంశం.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..