
సంపాదించిన దాంట్లో ఎంతో కొంత పొదుపు చేసుకోవాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. వారి వారి ఆదాయాలకు అనుగుణంగా పొదుపు చేస్తుంటారు. అయితే ప్రతీ ఒక్కరూ తమ పెట్టుబడికి రక్షణతో పాటు మంచి ఆదాయం రావాలని ఆశిస్తుంటారు. రిస్క్ లేని పెట్టుబడుల కోసం అన్వేషిస్తుంటారు. అలాంటి వారి కోసమే కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అందుబాటులోకి తీసుకొచ్చింది.
మరీ ముఖ్యంగా మహిళల కోసం ప్రత్యేకంగా ఎన్నో రకాల పథకాలు అందుబాటులో ఉన్నాయి. పురుషులతో సమానంగా మహిళలు ఆర్థికంగా ఎదుగుతున్న ప్రస్తుత తరుణంలో తాము సంపాదించిన మొత్తాన్ని ఇన్వెస్ట్ చేయాలనే ఆలోచనలో ప్రతీ ఒక్కరిలో పెరుగుతోంది. మరి మహిళల కోసం ప్రత్యేకంగా అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ స్కీమ్స్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
మహిళల కోసం ప్రత్యేకంగా తీసుకొచ్చిన మహిళా సమ్మాన్ సేవింగ్ సర్టిఫికెట్ ఒకటి. ఈ పథకం ఫిక్స్‌డ్ డిపాజిట్‌లాగా పనిచేస్తుంది. కేంద్ర ప్రభుత్వం 2023లో మహిళల కోసం ఈ పథకాన్ని తీసుకొచ్చింది. ఈ పథకం కింద మహిళలకు పెట్టుబడులపై 7.50 శాతం చక్రవడ్డీ లభిస్తుంది. మహిళలు రూ.1000 నుంచి పెట్టుబడిని ప్రారంభించి రూ.2 లక్షల వరకు డిపాజిట్ చేయవచ్చు. ఉదాహరణకు, మీరు ఈ పథకంలో 50 వేల రూపాయలు పెట్టుబడి పెడితే, 2 సంవత్సరాల తర్వాత మీరు 58,011 రూపాయలు పొందుతారు.
మహిళల కోసం తీసుకొచ్చిన మరో అద్భుతమైన పథకం సుకన్య సమృద్ధి యోజన.. రూ. 250లతో ఏదైనా పోస్టాఫీస్ లేదా బ్యాంకులో ఖాతాను ఓపెన్ చేయొచ్చు. ఈ పథకంలో పన్ను రాయితీ కూడా అందుబాటులో ఉంటుంది. వడ్డీ రేటు సంవత్సరానికి 8.2 శాతంగా ఉంటుంది. 10 ఏళ్లలోపు ఆడబిడ్డలకు ఈ పథకంలో చేరొచ్చు. చిన్నారికి 20-21 ఏళ్లు నిండినప్పుడు ఈ మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవచ్చు.
కేంద్ర ప్రభుత్వం అందిస్తోన్న మరో అద్భుత పథకం పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్.. ఫిక్స్‌డ్ డిపాజిట్లతో పోలిస్తే ఈ పథకంలో ఎక్కువ వడ్డీఇన పొందుతారు. ప్రస్తుతం, ఈ పథకం సంవత్సరానికి 7.1 శాతం వడ్డీని చెల్లిస్తోంది. మీరు ఈ పథకంలో కనీసం రూ. 500 పెట్టుబడి పెట్టవచ్చు. పెట్టుబడి పరిమితి 1.5 లక్షల రూపాయల వరకు పెట్టొచ్చు. రూ. 1.5 లక్ష వరకు పన్ను రాయితీని పొందుతారు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..