FD Rates: సీనియర్ సిటిజన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ 4 బ్యాంకుల్లో FDలపై పెరిగిన వడ్డీ రేట్లు.. వివరాలివే!

|

Sep 07, 2022 | 9:46 AM

ఎక్కడొక చోట.. ఏదొక బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లను పెంచుతూపోతోంది. మరి సీనియర్ సిటిజన్స్‌కు గుడ్ న్యూస్ అందిస్తూ..

FD Rates: సీనియర్ సిటిజన్స్‌కు గుడ్ న్యూస్.. ఆ 4 బ్యాంకుల్లో FDలపై పెరిగిన వడ్డీ రేట్లు.. వివరాలివే!
Money
Follow us on

ఫిక్స్‌డ్ డిపాజిట్లపై(ఎఫ్‌డి) వడ్డీ రేటుపై రెపోరేటు పెంపు ప్రభావం గట్టిగానే పడింది. ఇటీవల ఎక్కడొక చోట.. ఏదొక బ్యాంక్ ఎఫ్‌డీ రేట్లను పెంచుతూపోతోంది. మరి సీనియర్ సిటిజన్స్‌కు గుడ్ న్యూస్ అందిస్తూ.. ఫిక్స్‌డ్ డిపాజిట్లపై వడ్డీ రేట్లను 4 బ్యాంకులు పెంచాయి. కరూర్ వైశ్యా బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, కర్ణాటక బ్యాంక్‌లు రూ.2 కోట్ల లోపు ఉన్న ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచుతున్నట్లు ప్రకటించాయి.

1. కరూర్ వైశ్యా బ్యాంక్

వారం నుంచి నెల రోజులలోపు మెచ్యూర్ అవుతున్న FDలపై 4 శాతం వడ్డీని కరూర్ వైశ్యా బ్యాంక్ ఇస్తుండగా.. 31 రోజుల నుంచి 90 రోజులలో మెచ్యూర్ అయ్యే ఎఫ్‌డీలపై 5.25 శాతం వడ్డీ, అదేవిధంగా, 91 నుంచి 120 రోజులలో మెచ్యూర్ అయ్యే FDలపై 5.5 శాతం వడ్డీని ఇస్తోంది. ఇక 120 నుంచి 180 రోజుల FDలపై వడ్డీ రేటు 5.50 శాతంగా ఫిక్స్ చేసింది కరూర్ వైశ్యా బ్యాంక్.

181 రోజుల నుంచి 270 రోజుల ఎఫ్‌డీలపై 5.75 శాతం వడ్డీ, 181 నుంచి 270 రోజుల ఎఫ్‌డీలపై 5.90 శాతం.. అలాగే సంవత్సరం నుంచి 3 సంవత్సరాల వరకు ఉన్న ఎఫ్‌డీలపై 6.10 శాతం వడ్డీని ఇస్తోంది. ఈ కొత్త వడ్డీ రేట్లు సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయని తెలిపింది.

2. కోటక్ మహీంద్రా బ్యాంక్

390 రోజుల నుంచి 23 నెలల మధ్య మెచ్యూర్ అయ్యే FDలపై కోటక్ మహీంద్రా బ్యాంక్ 6 శాతం వడ్డీని అందిస్తోంది. కొత్త రేట్లు సెప్టెంబర్ 6వ తేదీ నుంచి వర్తిస్తాయంది. అలాగే 23 నెలల నుంచి 2 సంవత్సరాల లోపు ఎఫ్‌డిలపై 6.10 శాతం.. 2 సంవత్సరాల నుంచి 10 ఏళ్ల లోపు ఎఫ్‌డీలపై 6 శాతం వడ్డీ ఇస్తోంది.

3. సిటీ యూనియన్ బ్యాంక్

రూ. 2 కోట్ల కంటే తక్కువ ఉన్న FDలపై వడ్డీ రేట్లలో మార్పు చేసింది సిటీ యూనియన్ బ్యాంక్. సాధారణ కస్టమర్లకు 4-6 శాతం వరకు వడ్డీ, సీనియర్ సిటిజన్లకు 4-6.25 శాతం వడ్డీని అందిస్తోంది సిటీ యూనియన్ బ్యాంక్. ఈ కొత్త రేట్లు సెప్టెంబర్ 1 నుంచి వర్తిస్తాయని చెప్పింది. మరోవైపు 400 రోజుల FDలపై 5.60 శాతం, 700 రోజుల FDలపై 5.75 శాతం, 3-10 సంవత్సరాల మధ్య కాలంలో మెచ్యూర్ అయ్యే FDలపై 5.75 శాతం, పన్ను ఆదా చేసే FDలపై 6 శాతం వడ్డీ అందుబాటులో ఉంచింది సిటీ యూనియన్ బ్యాంక్.

4. కర్ణాటక బ్యాంక్

కర్ణాటక బ్యాంక్ రూ.2 కోట్ల లోపు ఎఫ్‌డీలపై వడ్డీ రేట్లను పెంచింది. ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే FDలపై 6.20 శాతంగా వడ్డీ రేటును నిర్ణయించింది. అలాగే సీనియర్ సిటిజన్లకు 6.60 శాతం వడ్డీ రేటును ఇస్తోంది. కొత్త రేట్లు సెప్టెంబర్ 1 నుంచి వరిస్తాయని ప్రకటించింది. ఒక సంవత్సరంలో మెచ్యూర్ అయ్యే FDలపై 5.20 శాతం వడ్డీ, 1-2 సంవత్సరాల మధ్య ఉన్న ఎఫ్‌డీలపై 5.50 శాతం, 2 నుంచి 5 సంవత్సరాల FDలపై 5.65 శాతం, 5-10 సంవత్సరాలలో మెచ్యూర్ అయ్యే FDలపై 5.70 శాతం వడ్డీ రేట్లను కర్ణాటక బ్యాంక్ ఇస్తోంది.