
ఐక్యరాజ్యసమితి నివేదికలో అనేక విషయాలను వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో భారత దేశ ఆర్థిక వృద్ధిని 6.3 శాతంగా అంచనా వేసింది. ఇది పెద్ద దేశాల ఆర్థిక వ్యవస్థ కంటే అత్యధికమని తెలిపింది. ఈ ప్రగతి 2026 వరకూ కొనసాగుతుందని, మొత్తానికి 6.4 శాతం వృద్ధి నమోదయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రపంచ ఆర్థిక వృద్ధి 2025లో 2.4 శాతానికి మందగిస్తుందని అంచనా వేసింది.
ప్రపంచ వ్యాప్తంగా వాణిజ్య ఉద్రిక్తతలు పెరుగుతున్నాయి. సరిహద్దు వివాదాలు ఎక్కువయ్యాయి. దేశాల విధానాల్లో మార్పులు సంభవించాయి. దీంతో పెట్టుబడుల్లో క్షీణత ఏర్పడింది. ఇదే సమయంలో భారత దేశంలో అభివృద్ధి గణాంకాలు ఆశాజనకంగా ఉన్నాయి. ఉత్సాహభరితమైన మూలధన మార్కెట్లు, మంచి ఉత్పత్తులు, రికార్డు స్థాయిలో ఎగుమతులు, బలమైన రక్షణరంగం దీనికి ప్రధాన కారణాలుగా చెబుతున్నారు.
మంచి విధాన ఎంపికలు, బలమైన దేశీయ డిమాండ్, స్థిరమైన ప్రభుత్వ వ్యయం కూడా మన ఆర్థిక వృద్ధికి కారణాలని చెప్పవచ్చు. వీటితో ప్రజలకు చక్కని ఉపాధి అవకాశాలు ఏర్పడుతున్నాయి. అలాగే ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి దోహదం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో 2025 నాటికి ద్రవ్యోల్బణం 4.3 శాతం తగ్గుతుందని అంచనా వేశారు.
మన ఆర్థిక మార్కెట్లు కూడా ప్రగతి పథంలో పయనిస్తున్నాయి. పెట్టుబడిదారులకు స్టాక్ లు లాభాలను ఆర్జించిపెడుతున్నాయి. అనుకూల విధానాలు, బయట డిమాండ్ కారణంగా తయారీ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. రక్షణ ఉత్పత్తి వంటి రంగాల్లో ఎగుమతులు పెరుగుతున్నాయి. వీటి ద్వారా మన ఆర్థిక వ్యవస్థ స్థిరంగా ఉండడమే కాకుండా ప్రపంచంలో మనకంటూ ప్రత్యేక గుర్తింపు లభిస్తోంది. దానికి ఈ కింద తెలిపిన గణాంకాలే నిదర్శనమని చెప్పవచ్చు.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..