Tejas Express: తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై కీలక అప్డేట్.. వామ్మో.. ఆదాయం ఎంత వచ్చిందంటే..? రికార్డ్ స్థాయిలో..

తేజస్ ఎక్స్‌ప్రెస్ రైలుకు ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఇప్పటికే పూర్తి ఆక్సుపెన్సీతో ఇవి నడుస్తున్నాయి. ప్రస్తుతం దేశంలో రెండు రైళ్లు ఈ తరహాలో నడుస్తున్నాయి. ఐఆర్‌సీటీసీ ఆధ్వర్యంలోనే ఈ రైళ్లు నడపబడుతున్నాయి. ఈ సెమీ హైస్పీడ్ రైళ్లల్లో అత్యాధునిక సౌకర్యాలు అందుబాటులో ఉంటున్నాయి.

Tejas Express: తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లపై కీలక అప్డేట్.. వామ్మో.. ఆదాయం ఎంత వచ్చిందంటే..? రికార్డ్ స్థాయిలో..
Tejas Trains

Updated on: Feb 22, 2026 | 2:47 PM

దేశంలో మొట్టమొదటి ప్రైవేట్ రైలుగా పేరు పొందిన తేజస్ ఎక్స్‌ప్రెస్ సేవలను ప్రయాణికుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దేందుకు ఇండియన్ రైల్వే ప్రణాళికలు రచిస్తోంది. 2019లో దేశంలో తొలి ప్రైవేట్ రైలును ప్రారంభించారు. ప్రస్తుతం రెండు రైళ్లు ఇలాంటివి నడుస్తున్నాయి. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్(IRCTC) ద్వారా నడపడుతున్నాయి. అత్యంత రద్దీగా ఉండే రైల్వే కారిడార్ అయిన న్యూఢిల్లీ-లక్నో మధ్య తేజస్ రైలును తొలుత ప్రారంభించారు. ఇది విజయవంతంగా నడవడంతో అహ్మదాబాద్-ముంబై మధ్య రెండో ప్రీమియం తేజస్ రైలు ప్రవేశపెట్టారు.

ప్రయాణికుల నుంచి అద్బుత స్పందన

తేజస్ రైళ్లకు  2025-26 ఆర్ధిక సంవత్సరం మూడో త్రైమాసికంలో రూ.50 కోట్ల ఆదాయ వచ్చింది. ఢిల్లీ-లక్నో తేజస్ రైలులో ప్రయాణికుల ఆక్సుపెన్సీ 69 శాతంగా ఉండగా.. అహ్మదాబాద్-ముంబై రైలుకు 109 శాతం ఆక్సుపెన్సీ ఉంది.

తేజస్ రైళ్ల ప్రత్యేకతలు

తేజస్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు ఆధునిక ఆన్ బోర్డ్ సౌకర్యాలను కలిగి ఉంటుంది. దీనిని సెమీ హైస్పీడ్ రైలుగా పిలుస్తారు. కపుర్తలాలోని రైల్ కోచ్ ఫ్యాక్టరీలో వీటి కోచ్‌లను తయారు చేస్తారు. గంటకు 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే సామర్థ్యం వీటికి ఉంది. కానీ ట్రాకుల సామర్థ్యం కారణంగా ప్రస్తుతం గంటకు 160 కిలోమీటర్ల వేగంతో ఇవి ప్రయాణిస్తోన్నాయి. స్టీల్ బ్రేక్ డిస్క్, సింటర్డ్ ప్యాడ్, ఎలక్ట్రో న్యూమాటిక్ బ్రేక్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఈ రైలుకు ఉన్నాయి. వేగవంతంగా గమ్యస్థానానికి చేరుకునే అవకాశం ఉండటం, మెరుగైన సౌకర్యాలు వంటి అత్యాధునిక ఫీచర్లు ఉండటం వల్ల ఈ రైళ్లలో ప్రయాణికుల ఆక్సుపెన్సీ అధిక శాతంలో ఉంటుంది. రాబోయే రోజుల్లో ప్రయాణికుల అవసరాలను తీర్చందుకు ఇలాంటి రైళ్లను మరిన్ని అందుబాాటులోకి తెచ్చే అవకాశముంటుందని చెప్పవచ్చు.  ఇటీవల వందే భారత్, వందే భారత్ స్లీపర్ లాంటి సెమీ హైస్పీడ్ రైళ్లను భారత రైల్వే ప్రవేశపెడుతోంది. గత నెలలో హౌరా-గువహతి మధ్య తొలి వందే భారత్ స్లీపర్ రైలును తీసుకురాగా.. త్వరలో మరో రెండు రైళ్లు అందుబాటులోకి రానున్నాయి. రాత్రుల్లో సౌకర్యవంతమైన ప్రయాణం అందించేందుకు ఇవి ఉపయోగపడనున్నాయి. ఇక 2027 చివరి నాటికి బుల్లెట్ రైళ్లను కూడా ప్రవేశపెట్టేందుకు రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. ఇటీవల బడ్జెట్‌లో దేశంలో 7 హైస్పీడ్ బుల్లెట్ కారిడార్లను కేంద్ర ప్రకటించిన విషయం తెలిసిందే. హైదరాబాద్-చెన్నై, హైదరాబాద్-బెంగళూరు, హైదరాబాద్-పుణె మధ్య బుల్లెట్ రైళ్లు రానన్న కొన్నేళ్లల్లో రానున్నాయని చెప్పవచ్చు.

 

Follow Us