మార్కెట్లో కొత్త కొత్త కార్లు విడుదల అవుతున్నాయి. సాంకేతికను ఉపయోగించుకుని అత్యాధునిక ఫీచర్స్‌ను జోడిస్తూ కార్లను అందుబాటులోకి తీసుకువస్తున్నాయి కార్ల తయారీ కంపెనీలు. ఇక టాటా మోటార్స్ గురువారం 2023 నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌ను విడుదల చేసింది. దీని ధర రూ. 8.1 లక్షల ఎక్స్-షోరూమ్ ఉండనుంది. కంపెనీ కొత్త ఫీచర్లు, ఫ్యూచరిస్టిక్ డిజైన్, కొత్త ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లతో కారును అప్‌డేట్ చేసింది కంపెనీ. రిఫ్రెష్ చేయబడిన నెక్సాన్ స్మార్ట్, ప్యూర్, క్రియేటివ్, ఫియర్‌లెస్ అనే నాలుగు వేరియంట్‌లలో వస్తుంది.
టాటా మోటార్స్ ఇప్పటికే సెప్టెంబర్ 4న కారు కోసం ప్రీ-బుకింగ్‌లను ప్రారంభించింది. అదే కార్యక్రమంలో కంపెనీ నెక్సాన్ ఎలక్ట్రిక్ వెహికల్స్ ఫేస్‌లిఫ్ట్‌ను కూడా ఆవిష్కరించింది. దీనికి సంబంధించిన టీజర్ సోషల్ మీడియాలో విడుదల చేసింది టాటా కంపెనీ ఈ వాహనం విభిన్న రంగల్లో అందుబాటలోకి తీసుకురానున్నట్లు తెలుస్తోంది. దీని రేటు 13 లక్షల రూపాయల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని కంపెనీ గురువారం ప్రకటించింది. అయితే ఈ వాహనాల్లో కంపెనీ అత్యాధునిక ఫీచర్స్‌ను వినియోగించింది. అద్భుతమైన ప్రయాణ అనుభూతిని అందించేలా రూపొందించింది. ఇప్పటికే టాటా నుంచి వచ్చిన అన్ని వాహనాలకు జనాల్లో మంచి ఆదరణ ఉంది.
నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌కు శక్తినిచ్చే 1.2 లీటర్స్ టర్బో ఛార్జ్ ఇంజన్ 118బీహెచ్పీ శక్తి, అలాగే 170 ఎన్ఎం టర్క్ గరిష్టంగా డెవలప్ చేయగలు. అలాగే 113 బీహెచ్పీ పవర్ ఉత్పత్తి చేసే 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో కూడిన మరో ఎంపిక కూడా ఈరోజు వెల్లడించింది కంపెనీ. కొత్త నెక్సాన్ డీజిటల్ సిస్టమ్ తో రూపొందించింది. అంతే కాకుండా ఇందులో టచ్ స్క్రీన్ కూడా అద్భుతంగా తీర్చిదిద్దింది. స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, అలాగే వాయిస్-ఆపరేటెడ్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్‌ను కూడా పొందుతుంది. 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ అందించింది.
“నెక్సాన్ వరుసగా రెండేళ్లుగా భారతదేశపు నంబర్ 1 ఎస్‌యూవీగా ఉంది. టాటా మోటార్స్ ఇప్పటివరకు 5.5 లక్షల యూనిట్లకు పైగా కార్లను విక్రయించింది” అని టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ లిమిటెడ్, టాటా ప్యాసింజర్ ఎలక్ట్రిక్ మొబిలిటీ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్ శైలేష్ చంద్ర తెలిపారు. నూతన మోడల్ లో 6 ఎయిర్ బ్యాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ఈఎస్సీ)తో పాటు అన్ని సీటర్స్ కు సీట్ బెల్ట్ సదుపాయాన్ని కూడా ఈ వాహనంలో పొందు పర్చింది టాటా కంపెనీ. నెక్సాన్ 2014లో జరిగిన ఆటో ఎక్స్‌పోలో తొలిసారిగా ప్రారంభమైంది. ఇది టాటా మోటార్స్ నుంచి వచ్చిన మొదటి క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీ, భారతదేశంలో సబ్-4 మీటర్ల క్రాస్‌ఓవర్ ఎస్‌యూవీ సెగ్మెంట్ స్థానాన్ని ఆక్రమించింది.
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి