Business Idea: తిరుగులేని వ్యాపారం.. ఎప్పటికీ తగ్గని డిమాండ్‌..

వ్యాపారం చేయాలనే ఆలోచనలో ప్రతీ ఒక్కరికీ ఉంటుంది. ముఖ్యంగా తాము సంపాదిస్తూనే మరి కొందరికి ఉపాధి కల్పించాలనే లక్ష్యంతో ఉంటారు. అలాంటి వారికోసం ఒక బిజినెస్‌ ఐడియా గురించి ఇప్పుడు తెలుసుకుందాం. మెడికల్‌ ఇండస్ట్రీ వేగంగా పెరుగుతోన్న ప్రస్తుత తరుణంలో సర్జికల్ కాటన్‌ ఇండస్ట్రీ వేగంగా పెరుగుతోది. ఇలాంటి వ్యాపారం మొదలు పెడితే భారీగా లాభాలు ఆర్జించవచ్చు..

Business Idea: తిరుగులేని వ్యాపారం.. ఎప్పటికీ తగ్గని డిమాండ్‌..
Business Idea

Updated on: Nov 11, 2024 | 12:28 PM

ఆహారం, వస్త్రాలు, వైద్యం.. ఈ మూడు మనిషికి ఎంతో ముఖ్యమని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే ఈ మూడు రంగాల్లో వ్యాపారాలు చేసే వారికి నష్టాలు చాలా తక్కువగా ఉంటాయి. ప్రతీ మనిషి ఈ మూడు లేకుండా జీవించలేడు. కాబట్టి ఇలాంటి వాటిలో వస్తున్న మార్పులకు అనుగుణంగా కొత్తగా ఆలోచించి వ్యాపారం మొదలు పెడితే లాభాల పంట పండడం ఖాయమని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. అలాంటి ఓ బెస్ట్‌ బిజినెస్‌ గురించి ఈరోజు తెలుసుకుందాం.

మెడికల్‌ ఫీల్డ్‌లో కచ్చితంగా అవసరపడే వస్తువుల్లో సర్జికల్‌ కాటన్‌ ఒకటి. రోజురోజుకీ పెరుగుతోన్న జనాభా, శస్త్రచికిత్సల నేపథ్యంలో సర్జికల్‌ కాటన్‌ను ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి మార్కెట్లో ఉన్న ఈ డిమాండ్‌కు అనుగుణంగా కాటన్‌ తయారీ బిజినెస్‌ను ప్రారంభిస్తే భారీగా లాభాలు పొందొచ్చు. ఇంతకీ బిజినెస్‌ను ఎలా ప్రారంభించాలి.? ఎంత ఖర్చు అవుతుంది.? లాంటి వివరాలు మీకోసం..

ఈ కాటన్‌ తయారీ బిజినెస్‌ను తయారు చేసేందుకు హోల్‌సేల్‌లో పత్తిని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. ఇక కొనుగోలు చేసిన పత్తిలో కొన్ని కెమెకిల్స్‌ వేసి వాషింగ్ చేస్తారు. అనంతరం శుభ్రం చేసిన పత్తిని సర్జికల్ కాటన్‌గా తయారు చేసేందుకు పలు రకాల మిషిన్స్‌ కావాల్సి ఉంటుంది. చివరిగా పత్తిని రౌండ్ షేప్‌లో ప్యాకింగ్ చేస్తారు. చివరిగా వీటిని రకరకాల బరువుల్లో విక్రయిస్తారు. మీ సొంత బ్రాండింగ్‌తో ఈ కాటన్‌ను మార్కెటింగ్ చేసుకోవచ్చు.

అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలంటే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. తక్కువలో తక్కువ ఈ వ్యాపారానికి అవసరమైన మిషిన్స్‌ ధర రూ. 70 లక్షల వరకు ఉంటుంది. ఇక రా మెటిరీయల్స్‌ కోసం రూ. 15 లక్షల వరకు అవసరపడుతుంది. అయితే పెట్టుబడికి తగ్గట్లుగానే లాభాలు కూడా ఉంటాయి. నెలకు రూ. లక్షల్లో ఆదాయం ఆర్జించడం ఖాయం. ఈ బిజినెస్‌కు సంబంధించి యూట్యూబ్‌లో కూడా ఎన్నో వీడియోలు ఉన్నాయి.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం క్లిక్ చేయండి..