Bullet Train: డైమండ్‌లా మెరిసిపోతుంది.. ఎయిర్‌పోర్టును మించి.. తొలి బుల్లెట్ స్టేషన్ ఇదిగో..

సూరత్ బుల్లెట్ స్టేషన్ పనులు తుది దశకు చేరుకున్నాయి. వచ్చే ఏడాది ఆగస్టులో తొలి బుల్లెట్ రైలును పరుగులు పెట్టించాలని కేంద్రం నిర్ణయం తీసుకున్న క్రమంలో.. స్టేషన్ పనులు ఊపందుకున్నాయి. సూరత్ బుల్లెట్ స్టేషన్‌ను అత్యాధునిక హంగులతో స్పెషల్ డిజైన్‌తో రూపొందిస్తున్నారు.

Bullet Train: డైమండ్‌లా మెరిసిపోతుంది.. ఎయిర్‌పోర్టును మించి.. తొలి బుల్లెట్ స్టేషన్ ఇదిగో..
Bullet Station

Updated on: Nov 28, 2026 | 1:18 PM

దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ ప్రారంభానికి వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇప్పటికే ట్రాక్, విద్యుత్ పనులు ముగియగా.. తాజాగా స్టేషన్ల నిర్మాణంపై కూడా కీలక అప్డేట్ వచ్చింది. సూరత్ బుల్లెట్ రైలు స్టేషన్ నిర్మాణం వేగవంతంగా జరుగుతోంది. ఈ స్టేషన్ పనులు తుది దశకు చేరుకోగా.. త్వరలో పనులన్నీ ముగియనున్నాయి. ఈ స్టేషన్‌కు అత్యాధునిక హంగులతో ప్రత్యేకంగా తీర్చిదిద్దుతున్నారు. ఒక ఒక ప్రత్యేకమైన వజ్రాకార థీమ్‌తో నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (NHSRCL) ఈ స్టేషన్ నిర్మిస్తోంది. ఆధునిక సాంకేతికత ఉపయోగించి ముస్తాబవుతున్న ఈ స్టేషన్‌లో ప్రయాణికులకు అనేక సౌకర్యాలు అందుబాటులో ఉండనున్నాయి. ఈ స్టేషన్ ప్రత్యేకతలు ఏంటో తెలుసుకుందాం.

బుల్లెట్ రైల్వే స్టేషన్ ప్రత్యేకతలు ఇవే..

మూడు అంతస్తుల్లో సూరత్ స్టేషన్ ఉంటుంది. గ్రౌండ్ ఫ్లోర్‌లో పార్కింగ్, పికప్ కోసం ప్రత్యేక సౌకర్యాలు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. కాన్‌కోర్స్ లెవల్‌లో వెయిటింగ్ లాంజ్‌లతో పాటు టికెట్ కౌంటర్లు, దుకాణాలు ఉంటాయి. ఒక ఎయిర్‌పోర్ట్ తరహా లుక్‌లో ఈ స్టేషన్ ఉంటుంది. బిజినెస్ క్లాస్ లాంచ్‌లు ప్రత్యేకంగా ఉండనుండగా.. పిల్లల సంరక్షణ కేంద్రాలు, రెస్ట్ రూమ్స్ కూడా ఉంటాయి. ప్రయాణికులు వివరాలు తెలుసుకునేందుకు డిజిటల్ డిస్‌ప్లే బోర్రడులు, సైనేజ్, సమాచార కియోస్క్, స్మార్ట్ పబ్లిక్ అనౌన్స్‌మెంట్ సిస్టంలు ఉంటాయి. అలాగే రిటైల్ అవుట్‌లెట్లు అందుబాటులో ఉంటాయి. ఒకరకంగా ఎయిర్‌పోర్టులను తలపించే విధంగా అత్యాధునిక హంగులతో బుల్లెట్ స్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇక వృద్దులు, వికలాంగుల కోసం ఎలివేటర్లు,ఎస్కలేటర్లు కూడా నిర్మిస్తున్నారు.

చెట్ల పెంపకం కూడా..

సూరత్ బుల్లెట్ స్టేషన్ పైకప్పు, గోడలపై ప్రత్యేక స్కైలైట్‌లను ఏర్పాటు చేశారు. ఇవి పగటిపూట స్టేషన్ మొత్తం సహజమైన కాంతిని, స్వచ్ఛమైన గాలిని అందిస్తూ విద్యుత్‌ను ఆదా చేస్తాయి. అలాగే స్టేషన్ ప్రాంగణంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు వర్షపు నీటి సేకరణ, చెట్ల పెంపకం కూడా చేపట్టారు.  ఇక స్టేషన్ ప్రాంగణంలో క్యాబ్‌లు, ఆటోల కోసం ట్యాక్సీ స్టాండ్‌లు ఉంటాయి. అలాగే సమీపంలో బీఆర్టీఎస్ బస్టాపులు ఏర్పాటు చేయనున్నారు. ప్రయాణికులకు లాస్ట్ మైల్ కనెక్టివిటీ కల్పించేందుకు వివిధ రవాణా మార్గాల నుంచి స్టేషన్‌ను అనుసంధానించనున్నారు. కాగా ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ బుల్లెట్ రైలు కారిడార్‌లో భాగంగా సూరత్-బిలిమోరా మధ్య తొలి బుల్లెట్ రైలు నడపనున్నారు. ఇప్పటికే ఈ మార్గంలో విద్యుత్ సరఫరా ప్రారంభమైంది. వచ్చే ఏడాది మార్చిలో బుల్లెట్ రైలు ట్రయల్ రన్ చేపట్టనున్నారు. అనంతరం ఆగస్ట్ 15న తొలి బుల్లెట్ రైలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.

Loading...
Unable to load recommendations.
Follow Us