State Bank Of India: సొంతింటి కల నెరవేర్చుకోవాలని అనుకుంటున్నవారికి గుడ్ న్యూస్. ముఖ్యంగా మగువలకు సొంతంగా ఇల్లు కలిగి ఉండాలని కోరుకుంటారు. వారికి మహిళా దినోత్సవం వేళ ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా శుభవార్తను అందించింది. హోం లోన్ తీసుకునే మహిళలకు వడ్డీ రేటులో 5 బేసిక్ పాయింట్లను తగ్గిస్తున్నట్లు తెలిపింది. గృహ రుణాలపై వడ్డీ రేటును 6.70 శాతంగా నిర్ణయించింది. మహిళా దినోత్సవం సందర్భంగా మగువలకు ఈ ఆఫర్ అందిస్తున్నట్లు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెల్లడించింది. ఈ అవకాశాన్ని మహిళలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించింది.
కాగా, మహిళా దినోత్సవం సందర్భంగా దేశ మహిళలందరికి రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ ట్విట్టర్ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ”దేశంలోని మహిళలు సాధిస్తున్న విజయాలు చూసి ఎల్లప్పుడూ గర్వపడుతున్నామని.. అన్ని రంగాల్లోనూ మహిళలు సాధికారత సాధించేందుకు ప్రభుత్వం పని చేస్తుందని” ప్రధాని మోదీ పేర్కొన్నారు.
కన్న కొడుకు కోసం తండ్రి పోరాటం.. మొసలి పొట్ట కోసి బాలుడిని బయటికి తీశాడు.. కానీ.!
కోతిని అమాంతం మింగేసిన రాకాసి బల్లి.! ఒళ్లుగగుర్పొడిచే వీడియో.. నెట్టింట్లో వైరల్.!
Your Dream Home. Our Goal. ??
On #WomensDay, we make it special with an additional concession of 5 bps* to women borrowers and interest starting at 6.70%* onwards.
To know more, visit: https://t.co/L7SN4HqGFg pic.twitter.com/CuXWtvBhxD— State Bank of India (@TheOfficialSBI) March 8, 2021