SBI Doorstep Banking: ఇంటి వ‌ద్ద‌కే ఎస్‌బీఐ బ్యాంకు సేవలు.. ఎలా ఉప‌యోగించుకోవాలి, ఏ సేవ‌లున్నాయి..

SBI Doorstep Banking: క‌రోనాలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు అడుగుపెట్ట‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు. అయితే బ్యాంకింగ్ వంటి సేవ‌ల‌కు వెసులుబాటు క‌లిపించినా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికి...

SBI Doorstep Banking: ఇంటి వ‌ద్ద‌కే ఎస్‌బీఐ బ్యాంకు సేవలు.. ఎలా ఉప‌యోగించుకోవాలి, ఏ సేవ‌లున్నాయి..
Sbi Door Step

Updated on: May 31, 2021 | 3:08 PM

SBI Doorstep Banking: క‌రోనాలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో అత్య‌వ‌స‌ర‌మైతే త‌ప్ప బ‌య‌ట‌కు అడుగుపెట్ట‌వ‌ద్ద‌ని సూచిస్తున్నారు. అయితే బ్యాంకింగ్ వంటి సేవ‌ల‌కు వెసులుబాటు క‌లిపించినా ప్ర‌జ‌లు బ‌య‌ట‌కు రావ‌డానికి జంకుతున్నారు. దీంతో బ్యాంకుల‌కు రాలేని వినియోగ‌దారుల కోసం బ్యాంకునే ఇట్టి వ‌ద్ద‌కు తీసుకొస్తోంది భార‌త ప్ర‌భుత్వ రంగ దిగ్గ‌జ బ్యాంకు ఎస్‌బీఐ. ఇందులో భాగంగానే డోర్ స్టెప్ స‌ర్వీస్‌ను తీసుకొచ్చింది. మ‌రి ఈ సేవ‌ల‌ను ఎలా ఉప‌యోగించుకోవాలి, ఇందులో ఎలాంటి సేవ‌లు అందుబాటులో ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎస్‌బీఐ డోర్ స్టెప్ సేవ‌ల‌ను వినియోగించుకోవాలంటే 1800 1037 188 / 1800 1213 721 టోల్‌ఫ్రీ నెంబ‌ర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా psbdsb.in వెబ్‌సైట్ లేదా, డీసీబీ మోబైల్ యాప్ ద్వారా కూడా సేవ‌ల‌ను వినియోగించుకోవ‌చ్చు.
* ఇందులో భాగంగా పికప్ స‌ర్వీసెస్ విభాగంలో అందిస్తోన్న సేవ‌ల విష‌యానికొస్తే.. చెక్‌/డ్రాఫ్ట్స్‌/పే ఆర్డ‌ర్స్‌, కొత్త చెక్ బుక్ స్లిప్స్ అభ్య‌ర్థ‌న‌, ఐటీ చ‌లాన్‌.
* ఇంటి వ‌ద్ద అందించే సేవ‌ల వివ‌రాలు.. డ్రాఫ్ట్స్‌/పే ఆర్డ‌ర్స్‌, టర్మ్ డిపాజిట్ రిసిప్ట్స్‌, అకౌంట్ స్టేట్‌మెంట్‌, టీడీఎస్‌/ఫార్మ్ 16 స‌ర్టిఫికేట్‌, గిఫ్ట్ కార్డు సేవ‌ల‌ను అందుస్తున్నారు. కేవ‌లం ఇవే కాకుండా.. న‌గ‌దు విత్‌డ్రా, పెన్ష‌న‌ర్ల కోసం డిజిట‌ల్ లైఫ్ స‌ర్టికేట్ వంటి సేవ‌ల‌ను ఇంటి వ‌ద్దే అందించ‌నున్నారు. ఈ వివ‌రాల‌న్నింటినీ తెలుపుతూ.. ఎస్‌బీఐ ట్వీట్ చేసింది.

ఎస్‌బీఐ చేసిన ట్వీట్‌..

Also Read: Covid-19 from Wuhan lab: కృత్రిమంగానే వైరస్‌ సృష్టి.. వుహాన్‌ ల్యాబ్‌ నుంచే కరోనా.. ‘డైలీ మెయిల్‌’ కథనంలో సంచలన నిజాలు

Viral News: భర్త ఫోన్‌పై నిఘా పెట్టింది.. ఊహించని షాక్ తగిలింది.. చివరికి ఏం జరిగిందంటే.!

Arjun Kapoor: ప్రేయ‌సికి చేరువ‌కావ‌డం కోసం ఏకంగా రూ.20 కోట్లు ఖ‌ర్చు చేసిన‌ అర్జున్ క‌పూర్‌.. ఏం చేశాడంటే..

 

Follow Us