
ఆధార్ కార్డులో పేరు, మొబైల్ నెంబర్, అడ్రస్ లేదా ఇతర వివరాలు అప్డేట్ చేసుకోవాలా..? లేదా కొత్త ఆధార్ పొందాలనుకుంటున్నారా..? అయితే మీరు గంటలకొద్ది ఆధార్ సేవా కేంద్రాల్లో వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. చాలామంది ఆధార్ సర్వీస్ కేంద్రాల్లో గంటల పాటు ఎదురుచూస్తూ ఉంటారు. జనం రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు తమ పని త్వరగా పూర్తి కాక చిరాకు పడుతూ ఉంటారు. ప్రజలకు ఈ ఇబ్బందులు తొలగించేందుకు యూఐడీఏఐ ఓ సదుపాయం కల్పిస్తోంది. అదే ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుకింగ్. ముందుగానే మీరు ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ బుక్ చేసుకుని, ఆ సమాయానికి ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లి సేవలు పొందవచ్చు. ఎలా బుక్ చేసుకోవాలి..? ఏయే సేవలు పొందవచ్చు? అనే విషయాలు చూద్దాం.
యూఐడీఏఐ ఆన్‌లైన్‌లో అపాయింట్‌మెంట్ సేవలను ప్రవేశపెట్టింది. మీరు మీ సమీపంలోని ఆధార్ సేవా కేంద్రానికి వెళ్లాలనుకున్నప్పుడు యూఐడీఏఐ వెబ్ సైట్ లేదా ఆధార్ యాప్ ద్వారా ముందుగానే అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. మీరు ఏ సమయంలో సందర్శించాలనుకుంటున్నారో సమయం ఎంచుకోవాలి. ఆ సమయానికి నేరుగా ఆధార్ సెంటర్‌కు వెళ్లి సేవలు పొందవచ్చు. దీని వల్ల మీరు క్యూలైన్లో నిల్చోవాల్సిన పని ఉండడు. మీరు ఎంచుకున్న సమాయానికి వెళ్లి సేవలు పొందవచ్చు. ఇందుకోసం మీరు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన పని లేదు. యూఐడీఏఐ వెబ్‌సైట్లోకి వెళ్లి ఉచితంగా అపాయింట్‌మెంట్ బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీ ఆధార్‌తో మీ మొబైల్ నెంబర్ లింక్ అయి ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఒక వ్యక్తి నెలకు రెండు అపాయింట్‌మెంట్లు మాత్రమే బుక్ చేసుకోవడానికి వీలు ఉంటుంది. మీ కుటుంబసభ్యుల కోసం కూడా మీరు అపాయింట్‌మెంట్ బుక్ చేయవచ్చు.
ప్రతీ పట్టణం, నగరాల్లో ఆధార్ సేవా కేంద్రాలను యూఐడీఏఐ అందుబాటులోకి తీసుకొచ్చింది. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు ఓపెన్ చేసి ఉంటాయి. వారంలో ఏడు రోజుల పాటు ఇవి అందుబాటులో ఉంటాయి. నేరుగా వచ్చేవారికి ఒక టోకెన్ విధానం అందుబాటులో ఉండగా.. ఆన్‌లైన్లో అపాయింట్‌మెంట్లకు మరో టోకెన్ విధానం అమల్లో ఉంది. ప్రతీ కేంద్రంలో ఒక ఆపరేషన్స్ మేనేజర్, సెంటర్ మేనేజర్ ఉంటారు. ఈ కేంద్రాల్లో ఏసీ, త్రాగునీరు సౌకర్యంతో పాటు దివ్యాంగుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. కొత్తగా ఆధార్ తీసుకోవాలన్నా, ఆధార్ వివరాల్లో మార్పులు చేసుకోవాలన్నా సేవా కేంద్రానికి వెళ్లి చేసుకోవచ్చు.
आधार सेवाओं के लिए पहले से ऑनलाइन अपॉइंटमेंट बुक करें और बिना टोकन की लाइन में प्रतीक्षा के आधार सेवा केंद्र में सीधे प्रवेश पाएँ। अपॉइंटमेंट बुक करने के लिए क्लिक करें – https://t.co/c77Y4goj6k #EaseofLiving #AadhaarServices #AadhaarSevaKendra #BookAppointment pic.twitter.com/evDElOsHeR
— Aadhaar (@UIDAI) August 2, 2026