6 Airbags Rule: కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ విషయంలో ప్రభుత్వ ప్రణాళిక మారింది.. నితిన్ గడ్కరీ కొత్త ప్రకటన

|

Sep 14, 2023 | 5:45 PM

రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండటం కారణంగా ప్రాణాల నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుందని, అలాగే డ్రైవర్‌ సీటుతో పాటు సైడ్‌కు కూర్చునే వ్యక్తి, అలాగే వెనుకాల కూర్చునే ప్రయాణికులకు కూడా ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని త్వరలో వాహనాల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయనున్నారనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ..

6 Airbags Rule: కారులో 6 ఎయిర్‌బ్యాగ్స్‌ విషయంలో ప్రభుత్వ ప్రణాళిక మారింది.. నితిన్ గడ్కరీ కొత్త ప్రకటన
Nitin Gadkari
Follow us on

దేశంలో రోడ్డు ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో కార్లకు ఎయిర్‌ బ్యాగ్స్‌ తప్పని సరి ఉండాలని కేంద్ర ప్రభుత్వం గతంలోనే కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే. రోడ్డు ప్రమాదాలు జరిగిన సమయంలో ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండటం కారణంగా ప్రాణాల నుంచి రక్షించుకునే అవకాశం ఉంటుందని, అలాగే డ్రైవర్‌ సీటుతో పాటు సైడ్‌కు కూర్చునే వ్యక్తి, అలాగే వెనుకాల కూర్చునే ప్రయాణికులకు కూడా ఎయిర్‌ బ్యాగ్స్‌ ఉండాలని నిర్ణయం తీసుకుంది. ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని త్వరలో వాహనాల్లో 6 ఎయిర్‌బ్యాగ్‌లను తప్పనిసరి చేయనున్నారనే చర్చ చాలా కాలంగా జరుగుతోంది. అయితే ఇప్పుడు ఈ విషయంలో కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పెద్ద ప్రకటన చేశారు. వాహనాల్లో 6 ఎయిర్‌ బ్యాగ్‌లను ప్రభుత్వం తప్పనిసరి చేయదని నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.

గత సంవత్సరం ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకుని అక్టోబర్ 2023 నుంచి ప్రతి కారుకు 6 ఎయిర్‌ బ్యాగ్‌లను తప్పనిసరి చేయాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. ఇది మాత్రమే కాదు.. గత సంవత్సరం రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ కూడా ఒక ప్రకటనను విడుదల చేసింది. ఇందులో వాహనాలలో ప్రజల భద్రతను పెంచడానికి, సెంట్రల్ మోటారు వాహనాల నిబంధనల ప్రకారం భద్రతా లక్షణాలను పెంచడానికి నిర్ణయం తీసుకున్నట్లు ప్రస్తావించబడింది. ఈ నిర్ణయం 1989 సంవత్సరంలో తీసుకున్నారు.

రోడ్డు ప్రమాదాల కారణంగా వాహన ప్రయాణికులకు కలిగే నష్టాన్ని తగ్గించడానికి దేశంలో విక్రయించే వాహనాల ముందు భాగంలో రెండు ఎయిర్‌బ్యాగ్‌లు ఏప్రిల్ 1, 2021 నుంచి తప్పనిసరి చేసింది. అంటే అన్ని కార్లు స్టాండర్డ్ 2 ఎయిర్‌బ్యాగ్‌లను కలిగి ఉండటం తప్పనిసరి.

ఇవి కూడా చదవండి

ఇటీవల నిర్వహించిన ఓ కార్యక్రమంలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విషయాన్ని వెల్లడించారు. ఇప్పుడు ప్రజలకు అవగాహన వచ్చిందని, అందుకే ఇప్పుడు 6 ఎయిర్‌బ్యాగ్‌ల నిబంధనను తప్పనిసరి చేయడం లేదని నితిన్ గడ్కరీ అన్నారు.

4 ఎయిర్‌బ్యాగ్‌లు అందిస్తే ఖర్చు పెరుగుతుంది

రాయిటర్స్ నివేదిక ప్రకారం.. గత సంవత్సరం ప్రభుత్వం మరో నాలుగు ఎయిర్‌ బ్యాగ్‌ లను జోడించడం వల్ల ఒక్కో వాహనానికి 75 డాలర్లు (సుమారు రూ. 6,221) మించదని అంచనా వేసింది. కానీ మరోవైపు ఆటో మార్కెట్ డేటా ప్రొవైడర్ JATO డైనమిక్స్ ఇలా చేయడం వల్ల ఖర్చు కనీసం $231 (సుమారు రూ. 19,161) పెరుగుతుందని చెప్పారు.