Silver Price Today: పండగ సీజన్‌లు వచ్చేస్తున్నాయి. పండుగలకు నగలు వేసుకోవడం చాలా మందికి ఇష్టం. దీంతో పాటు వెండి కొనుగోళ్లు బాగానే జరుగుతుంటాయి. భారతీయులు వెండి కూడా చాలా ప్రాముఖ్యత ఇస్తుంటారు. ముఖ్యంగా వెండి దీపాలు, వెండి విగ్రహాలు కొనుగోలు చేస్తుంటారు. అలాగే వెండితే తయారు చేసిన రకరకాల అభరణాలను సైతం చాలా మంది కొనుగోలు చేస్తుంటారు. దేశంలో బంగారం, వెండికి డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది. తాజాగా సోమవారం దేశీయంగా వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. కొన్ని ప్రాంతాల్లో స్వల్ప మార్పులు జరిగాయి. ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి రూ.62,200 ఉండగా, చెన్నైలో రూ.65,900 ఉంది. ముంబైలో కిలో వెండి రూ.65,900 ఉండగా, కోల్‌కతాలో రూ.62,000 ఉంది. ఇక బెంగళూరులో కిలో వెండి రూ.62,000 ఉండగా, కేరళలో రూ.65,900 ఉంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.65,900 ఉండగా, విజయవాడలో రూ. 65,900 వద్ద కొనసాగుతోంది.
కాగా, బంగారం, వెండి ధరల్లో ప్రతిరోజు అనేక మార్పు చేసుకుంటుండటం అనేది ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల అంశాలపై ఆధారపడి ఉంటుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు మార్పులు కావడం కూడా ఓ కారణం. అయితే, ఇలా గ్లోబల్ మార్కెట్‌లో ధరలు హెచ్చు తగ్గులు కావడానికి కూడా మళ్లీ అనేక అంతర్జాతీయ పరమైన కారణాలు ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరల వివరాలు తెలుసుకొని వెళ్లడం మంచిది.