Silver Price Today: ఒక వైపు దేశీయంగా బంగారం ధరలు తగ్గుతుంటే.. అదే బాటలో వెండి కూడా పయనిస్తోంది. నిన్న బంగారం ధర పెరిగితే.. వెండి ధర నిలకడగా ఉంది. ఇక మంగళవారం మాత్రం ధరలు స్వల్పంగా దిగి వచ్చాయి. మంగళవారం (ఆగస్టు 31)న ఉదయం ఆరు గంటల సమయానికి కిలో వెండి ధరపై రూ.200 నుంచి 300 వరకు తగ్గుముఖం పట్టింది. అయితే భారతీయ సాంప్రదాయంలో బంగారం లాగే వెండి కూడా ఎంతో ప్రాధాన్యత ఇస్తుంటారు. దేశీయంగా కిలో రూ.70 వేలకుపైగా ఉన్న వెండి ధర రోజురోజుకు దిగివస్తోంది. తాజాగా దేశీయంగా ప్రధాన నగరాల్లో వెండి ధరలు ఇలా ఉన్నాయి.
దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,600 ఉండగా, దేశ ఆర్థిక రాజధాని ముంబైలో రూ.63,600 ఉంది. అలాగే చెన్నైలో కిలో వెండి ధర రూ.68,400 ఉండగా, కోల్‌కతాలో రూ.63,600 ఉంది. బెంగళూరులో కిలో వెండి ధర రూ.63,600 ఉండగా, కేరళలో రూ.68,400 ఉంది. ఇక అహ్మదాబాద్‌లో కిలో వెండి రూ.63,600 ఉండగా, హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.68,400 ఉంది. విజయవాడలో కిలో వెండి ధర రూ.68,400 ఉండగా, విశాఖపట్నంలో రూ.68,400 ఉంది. అయితే ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. వినియోగదారులు కొనుగోలు చేసే సమయానికి ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదంటున్నారు ఆర్థిక నిపుణులు.
కాగా, ప్రతి రోజు మార్పులు చోటు చేసుకునే బంగారం, వెండి ధరలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయంటున్నారు బులియన్ మార్కెట్ నిపుణులు. అంతర్జాతీయ మార్కెట్ పసిడి ధరల్లో మార్పు, ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు, వాటి వడ్డీ రేట్లు, కరోనా, జువెలరీ మార్కెట్, భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతాయని బులియన్ మార్కెట్ నిపుణులు వెల్లడిస్తున్నారు.