Latest Silver Price: బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరల్లో నిత్యం మార్పులు చేసుకుంటాయన్న విషయం అందరికీ తెలిసిందే. మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు ఒక్కోసారి పెరిగితే.. మరి కొన్నిసార్లు తగ్గుముఖం పడుతుంటాయి. అందుకే బంగారం, వెండి ప్రియులు వాటి ధరల వైపు ప్రత్యేకంగా దృష్టిపెడుతుంటారు. కరోనా కాలంలో పెరిగిన బంగారం, వెండి ధరలు కొన్నిరోజుల నుంచి తగ్గుతూ వస్తున్నాయి. ఈ క్రమంలో పెరుగుతున్న వెండి ధరలకు కొన్ని రోజుల నుంచి బ్రేక్ పడుతూ వస్తోంది. తాజాగా వెండి ధరలు భారీగా తగ్గాయి. ప్రస్తుతం దేశంలో కిలో వెండి ధర రూ.63,400లుగా ఉంది. రూ.800ల మేర ధర తగ్గింది. కాగా.. దేశంలోని ప్రధాన నగరాల్లో, తెలుగు రాష్ట్రాల్లో వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి పరిశీలిద్దాం..
ప్రధాన నగరాల్లో వెండి ధరలు..
* దేశ రాజధాని న్యూఢిల్లీలో కిలో వెండి ధర రూ.63,400లుగా ఉంది.
* దేశ ఆర్థిక రాజధాని ముంబైలో వెండి ధర రూ. 63,400 వద్ద కొనసాగుతోంది.
* తమిళనాడు రాజధాని చెన్నైలో కిలో వెండి ధర రూ. 67,800గా ఉంది.
* బెంగళూరులో వెండి ధర కిలో వెండి రూ.63,400 గా కొనసాగుతోంది.
* కోల్‌కతాలో కిలో వెండి ధర రూ.63,400 లుగా ఉంది.
* కేరళలో కిలో వెండి ధర రూ.67,800గా ఉంది.
తెలుగు రాష్ట్రాల్లో..
* హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.67,800 లుగా కొనసాగుతోంది.
* విజయవాడలోనూ వెండి ధర రూ. 67,800 వద్ద కొనసాగుతోంది.
* విశాఖపట్నంలో కూడా కిలో వెండి ధర రూ. 67,800 లుగా ఉంది.
కాగా.. ఈ ధరలు మంగళవారం ఉదయం 6 గంటలకు నమోదైనవి మాత్రమే. ప్రతిరోజూ ధరల్లో మార్పులు చోటు చేసుకుంటూనే ఉంటాయి. కొనుగోలుదారులు ముందుగానే ధరలు తెలుసుకుని వెళ్లడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు సూచిస్తున్నారు.
Also Read: