
Silver Price: గత కొన్ని రోజులుగా పతనమవుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు ఇప్పుడు మళ్లీ పుంజుకుంటున్నాయి. ముఖ్యంగా వెండి ధరలు రాకెట్ వేగంతో దూసుకుపోతున్నాయి. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే వెండి ధర ఏకంగా 13,000 రూపాయల మేర పెరగడం గమనార్హం.
మల్టీ కమొడిటీ ఎక్స్ఛేంజ్ (MCX)లో వెండి ధరలు గురువారం ట్రేడింగ్ ప్రారంభంతోనే భారీ లాభాల్లో కొనసాగుతున్నాయి. గత ట్రేడింగ్ సెషన్‌లో రూ. 2,53,265 వద్ద ముగిసిన వెండి, నేడు మరింత పెరిగింది. గత మూడు రోజుల్లో జరిగిన ఈ భారీ పెరుగుదల ఇన్వెస్టర్లను ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ప్రస్తుతం కిలో వెండి ధర రూ.2.70,000 వద్ద కొనసాగుతోంది.
కేవలం వెండి మాత్రమే కాదు, పసిడి కూడా అదే బాటలో పయనిస్తోంది. వరుసగా పెరుగుతున్న ధరలతో బంగారం మళ్లీ సామాన్యులకు భారంగా మారుతోంది. అంతర్జాతీయ మార్కెట్ ప్రభావం, దేశీయంగా పెరిగిన డిమాండ్ కారణంగా 24 క్యారెట్ల బంగారం ధరలు కూడా క్రమంగా పెరుగుతున్నాయి.
గరిష్ట ధరతో పోలిక: ప్రస్తుత ధరలు భారీగా పెరిగినప్పటికీ, గతంలో నమోదైన రికార్డు గరిష్ట స్థాయి కంటే తక్కువగానే ఉన్నాయి. ఒకప్పుడు కిలో వెండి ధర ఏకంగదా 4 లక్షల రూపాయల వరకు వెళ్లింది. తర్వాత క్రమంగా దిగి వచ్చింది. మార్కెట్ ట్రెండ్: ధరలు కనిష్ట స్థాయికి పడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్లీ ‘రికవరీ’ మోడ్‌లోకి వచ్చాయని నిపుణులు విశ్లేషిస్తున్నారు. పెరుగుతున్న ఈ ధరలు మున్ముందు ఎలా ఉంటాయో వేచి చూడాలి. మీరు ఒకవేళ పెట్టుబడి పెట్టాలని ఆలోచిస్తుంటే లేదా ఆభరణాలు కొనాలనుకుంటే, తాజా ధరలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండటం మంచిది.
ఇది కూడా చదవండి: SBI FD Interest: ఎస్‌బీఐ 444 రోజుల ఎఫ్‌డీలో రూ.2,50,000 పెట్టుబడిపై మీకు ఎంత వడ్డీ లభిస్తుంది?
ఇది కూడా చదవండి: Petrol Price Hike: చేదు వార్త.. భారత్‌లో పెట్రోల్, డీజిల్ ధరలు పెంచక తప్పదా? IMF షాకింగ్ కామెంట్స్
మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి