Business Idea: సైడ్‌ బిజినెస్‌ చేయాలనుకుంటున్నారా? మీరు పని చేయకుండానే ఆదాయ ఇచ్చే అద్భుతమైన బిజినెస్‌

చాలా మందికి ఉద్యోగం చేస్తూనే అదనపు ఆదాయం కోసం సైడ్‌ బిజినెస్‌ చేయాలనే కోరిక ఉంటుంది. అయితే అది భారంగా మారకుండా, తక్కువ శ్రమతో మంచి లాభాలు తెచ్చిపెట్టేదిగా ఉండాలి. డీజే & డెకరేషన్‌ వ్యాపారం అలాంటి వాటిలో ఒకటి. దీనికి భారీ పెట్టుబడి అవసరం అయినప్పటికీ, డిమాండ్ ఉన్న సమయాల్లో గొప్ప ఆదాయాన్ని ఆర్జించవచ్చు.

Business Idea: సైడ్‌ బిజినెస్‌ చేయాలనుకుంటున్నారా? మీరు పని చేయకుండానే ఆదాయ ఇచ్చే అద్భుతమైన బిజినెస్‌
Indian Currency

Updated on: Jan 15, 2026 | 10:17 PM

జాబ్‌ చేసుకుంటూనే ఒక సైడ్‌ బిజినెస్‌ చేయాలని చాలా మందికి ఉంటుంది. అలాగే ఆల్రెడీ సక్సెస్‌ఫుల్‌ బిజినెస్‌ చేస్తూ లేదా వ్యవసాయం చేసుకుంటూ కూడా ఏదో ఒక మంచి బిజినెస్‌ చేయాలనే ఆలోచన ఉన్నవారికి సైడ్‌ బిజినెస్‌ చేసుకోవడం ఉత్తమ మార్గం. అయితే ఆల్రెడీ ఏదో ఒక పనిలో బిజీగా ఉంటారు కనుక సైడ్‌ బిజినెస్‌ అనేది వారికి ఆదాయ ఇచ్చే వనరుగా ఉండాలి కానీ అదనపు భారం కాకూడదు. అలాంటి ఓ సైడ్‌ బిజినెస్‌ గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

మంచి సైడ్‌ బిజినెస్‌ అంటే ఎలా ఉండాలంటే.. మన అక్కడ లేకపోయినా మనకు ఆదాయం జనరేట్‌ అవుతూ ఉండాలి. సింపుల్‌గా చెప్పాలంటే మన డబ్బు డబ్బుని సంపాదించాలి. జస్ట్‌ పెట్టుబడి పెట్టి, పని ఉన్న సమయంలో రోజు పేమెంట్‌ లెక్కన దాన్ని మేయిటెన్‌ చేసేవాళ్లను మాట్లాడితే చాలు. అలాంటి బిజినెస్‌లలో ఒకటి డీజే అండ్‌ డెకరేషన్‌ బిజినెస్‌. ఈ బిజినెస్‌పైనే పూర్తిగా ఆధారపడకుండా.. దీన్నో సైడ్‌ బిజినెస్‌లా భావించి చేస్తే మాత్రం మంచి ఆదాయం పొందవచ్చు.

ఎందుకంటే ఇది ప్రతి రోజు సరిగే బిజినెస్‌ కాదు. కానీ డిమాండ్‌ ఉన్న సమయంలో మాత్రం మంచి ఆదాయం ఇచ్చే బిజినెస్‌. అయితే ఈ బిజినెస్‌ కోసం ముందుగా పెట్టుబడి భారీగానే పెట్టాల్సి ఉంటుంది. డీజే బాక్సుల కోసం ఓ రూ.10 నుంచి రూ.15 లక్షలు ఖర్చు చేయాలి. అలాగే వాటిని తీసుకెళ్లేందుకు ఒక ట్రాలీ, దాన్ని ప్లే చేసేందుకు ఒక డీజే బ్యాయ్‌ను కూడా మాట్లాడుకోవాలి. దాని కోసం ఒక జెనరేటర్‌ కూడా ఉండాలి. అయితే ఇందులో అడ్వాంటేజ్‌ ఏంటంటే.. డీజే ఆర్డర్‌ వచ్చిన ప్రతీ సారి మీరే వెళ్లాల్సిన పనిలేదు. ఒకరిద్దరు కుర్రాళ్లను మాట్లాడి పంపిస్తే సరిపోతుంది. మీ విలువైన టైమ్‌ను వేరే పనిమీదో, జాబ్‌లోనో, ఇతర బిజినెస్‌ కోసమే వెచ్చిస్తే రెండు చేతులా సంపాదించుకోవచ్చు.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి