
గ్లోబల్ మార్కెట్ల బలహీనత కారణంగా భారత స్టాక్ మార్కెట్ బుధవారం నష్టాల్లో ప్రారంభమైంది. సెన్సెక్స్ 755.28 పాయింట్లు లేదా 1.03 శాతం క్షీణతతో 72,373.49 వద్ద ట్రేడింగ్ ప్రారంభించి కొద్ది నిమిషాల్లోనే 72,200 స్థాయికి చేరుకుంది. ఉదయం 9.41 గంటలకు 800 పాయింట్లకు పైగా క్షీణతతో ట్రేడింగ్‌లో కనిపించగా, ఉదయం 11 గంటల సమయానికి 1067 పాయింట్లు దిగజారి 72,060 స్థాయికి పడిపోయింది.
సెన్సెక్స్ మాదిరిగానే, నిఫ్టీ కూడా పతనమైంది. అలాగే 203.50 పాయింట్లు లేదా 0.92 శాతం పతనంతో ప్రారంభమైంది. 21,647.25 స్థాయి వద్ద ప్రారంభమైన తర్వాత, అది మరింత పతనమవుతూ, ఇది 211 పాయింట్లు జారిపోయి, 21,821.30 స్థాయి వద్ద ట్రేడవుతోంది. స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ ప్రారంభంతో దాదాపు 574 షేర్లు లాభాలను నమోదు చేసుకోగా, 1836 షేర్లు క్షీణతతో ట్రేడింగ్ ప్రారంభించాయి. హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్ షేర్లు అత్యధికంగా పడిపోయాయి.