స్టాక్ మార్కెట్లు(Stock Market) వరుసగా రెండో రోజు నష్టాల్లో ముగిశాయి. మంగళవారం బీఎస్‌ఈ సెన్సెక్స్(Sensex) 388 పాయింట్లు తగ్గి 58,576 వద్ద ముగియగా.. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ(Nifty) 145 పాయింట్లు క్షీణించి 17,530 వద్ద స్థిరపడింది. మెటల్, ఐటీ స్టాక్‌లు నష్టపోవడంతో మార్కెట్లు కూడ పతనమయ్యాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 100 ఇండెక్స్ 1.92 శాతం, స్మాల్ క్యాప్ 1.58 శాతం తగ్గాయి. ఎర్నింగ్స్ సీజన్ ప్రారంభం కావడంతో ఇన్వెస్టర్లు కూడా అప్రమత్తంగా ఉన్నారు. ఐటీ మేజర్ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) సోమవారం క్యూ4 ఆదాయాల సీజన్‌ను ప్రారంభించింది. సెన్సెక్స్ క్రితం సెషన్‌లో 58,965 పాయింట్ల వద్ద ముగిసింది.
నిఫ్టీ 17,600 ట్రెండ్ సపోర్ట్‌ను బ్రేక్ చేసింది. నిఫ్టీ మెటల్ 2.74, నిఫ్టీ IT 1.48 శాతం క్షీణించాయి. హిండాల్కో స్టాక్ 5.77 శాతం పడిపోయి రూ 543.10కి చేరుకుని నిఫ్టీలో టాప్ లూజర్‌గా నిలించింది. కోల్ ఇండియా , గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్, టాటా స్టీల్ కూడా నష్టపోయాయి. 30 షేర్ల బీఎస్‌ఈ ఇండెక్స్‌లో టాటా స్టీల్, విప్రో, టెక్ మహీంద్రా, భారతి ఎయిర్‌టెల్, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎల్‌అండ్‌టి, బజాజ్ ఫిన్‌సర్వ్ టాప్ లూజర్స్‌లో ఉన్నాయి. యాక్సిస్ బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, పవర్‌గ్రిడ్, మారుతీ, ఐసీఐసీఐ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, ఎంఅండ్ ఎం, హెచ్‌డీఎఫ్‌సీ లాభపడ్డాయి.
దేశంలో 5జీ సేవల కోసం మార్గాన్ని సిద్ధం చేయడంతో పాటు రూ.7.50 లక్షల కోట్ల విలువైన స్పెక్ట్రమ్ వేలానికి ప్రణాళికను టెలికాం నియంత్రణ సంస్థ ట్రాయ్ సోమవారం వెల్లడించింది. 5జీ స్పెక్ట్రమ్ కనీస ధరలో ట్రాయ్ 35 శాతం కోతను సిఫారసు చేసింది. ఈ కోత ఆశించిన కంటే తక్కువ స్థాయిలో ఉండడంతో టెలికాం స్టాక్‌లు ఈరోజు భారీ నష్టాల్ని చవిచూశాయి. భారతీ ఎయిర్‌టెల్ 2.12 శాతం పడిపోయి రూ.742 వద్ద స్థిరపడగా.. వోడాఫోన్ ఐడియా 2.3 శాతం తగ్గింది. పెట్టుబడిదారుల సంపదగా భావించే బీఎస్‌ఈలోని నమోదిత సంస్థల మార్కెట్ విలువ రూ.3.18 లక్షల కోట్లు తగ్గి రూ.271.98 లక్షల కోట్లకు చేరింది.
Read Also. Bank Alert: HDFC యూజర్లకు షాక్.. UPI చెల్లింపులకు పరిమితి పెట్టిన బ్యాంక్.. పూర్తి వివరాలు..