
చర్లపల్లి– చెన్నై సెంట్రల్ – చర్లపల్లి: ఈ ప్రత్యేక రైలు 16.10.2026న రాత్రి 9:30 గంటలకు చర్లపల్లి నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:15 గంటలకు చెన్నై సెంట్రల్ చేరుకుంటుంది. ఇది మొత్తం ఒక సర్వీసును అందిస్తుంది. అలాగే తిరుగు ప్రయాణంలో 17-10-26 మధ్యాహ్నం ఒంటి గంటకు చెన్నై నుంచి బయల్దేరి మరుసటిరోజు తెల్లవారుజామున 04.30కు చర్లపల్లి చేరుకుంటుంది. ఈ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో రెండు వైపులా ఆగుతుంది. ఈ ట్రైన్లో స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

చర్లపల్లి – నాగర్‌కోయిల్ – చర్లపల్లి: చర్లపల్లి – నాగర్‌కోయిల్ మధ్య నడిచే ప్రత్యేక రైలు 30.10.2026 నుంచి 13.11.2026 వరకు అందుబాటులో ఉంటుంది. ఇది రాత్రి 7:45 గంటలకు చర్లపల్లి నుంచి బయల్దేరి, మరుసటి రోజు రాత్రి 10:45 గంటలకు నాగర్‌కోయిల్ చేరుకుంటుంది. ఈ మార్గంలో మొత్తం 3 సర్వీసులు ఉంటాయి. అలాగే నాగర్‌కోయిల్ - చర్లపల్లి మధ్య నడిచే 07536 నెంబర్ గల ప్రత్యేక రైలు 01.11.2026 నుంచి 15.11.2026 వరకు నడుస్తుంది. అర్ధరాత్రి దాటిన తర్వాత 00:45 గంటలకు నాగర్‌కోయిల్ నుంచి బయల్దేరి, మరుసటి రోజు తెల్లవారుజామున 03:45 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది. ఇది మొత్తం 3 సర్వీసులను అందిస్తుంది.

ఈ ట్రైన్ నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, నాయుడుపేట, సూళ్లూరుపేట, చెన్నై ఎగ్మోర్, తాంబరం, చెంగల్పట్టు, విల్లుపురం, వృద్ధిచలం, తిరుచిరాపల్లి, దిండిగల్, మదురై, విరుదునగర్, సాత్తూరు, కోవిల్పట్టి, తిరునెల్వేలి, వల్లియూర్ స్టేషన్లలో ఆగుతుంది. ఈ ట్రైన్లో 2 AC, 3 AC, స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు ఉంటాయి.

సికింద్రాబాద్ – విశాఖపట్నం – సికింద్రాబాద్: ఇక సికింద్రాబాద్ - విశాఖపట్నం మధ్య నడిచే 07069 నెంబర్ గల ప్రత్యేక రైలు 16.10.2026న రాత్రి 8:15 గంటలకు సికింద్రాబాద్ నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 11:00 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఈ రైలు ఒక సర్వీసుగా అందుబాటులో ఉంటుంది. అలాగే విశాఖపట్నం - సికింద్రాబాద్ మధ్య నడిచే 07070 నెబర్ గల ప్రత్యేక రైలు 17.10.2026న మధ్యాహ్నం 3:50 గంటలకు విశాఖపట్నం నుంచి బయల్దేరి, మరుసటి రోజు ఉదయం 05:30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఇది ఒక సర్వీసును అందిస్తుంది.

ఈ ట్రైన్ చర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్లలో రెండు వైపులా ఆగుతుంది. ఈ ట్రైన్లో ఫస్ట్ ఏసీ (1 AC), సెకండ్ ఏసీ (2 AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ బోగీలు అందుబాటులో ఉంటాయి. పండుగ వేళ సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులు ఈ ప్రత్యేక రైలు సర్వీసులను వినియోగించుకోవాలని రైల్వే శాఖ సూచించింది. రిజర్వేషన్లు ఇప్పటికే ప్రారంభమైనందున ప్రయాణికులు ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్ లేదా రిజర్వేషన్ కౌంటర్లలో టికెట్లు బుక్ చేసుకోవచ్చు.